Telugu Cinema News Live January 27, 2025: Fatima Sana Shaikh: నువ్వు అన్నీ చేస్తావు కదా అని అడిగాడు.. ప్రొడ్యూసర్లూ దాని గురించి ఓపెన్‌గా మాట్లాడతారు:బాలీవుడ్ నటి
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Mon, 27 Jan 202504:50 PM IST
Fatima Sana Shaikh: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ షాకింగ్ కామెంట్స్ చేసింది. నువ్వు అన్నీ చేస్తావు కదా అని ఓ ఏజెంట్ అడిగాడని, ప్రొడ్యూసర్లూ దాని గురించి ఓపెన్ గా మాట్లాడతారని అనడం గమనార్హం.
Mon, 27 Jan 202503:39 PM IST
- Chris Martin at Maha Kumbh: కోల్డ్‌ప్లే బ్యాండ్ కు చెందిన క్రిస్ మార్టిన్ తన గర్ల్‌ఫ్రెండ్ డకోటా జాన్సన్ తో కలిసి ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mon, 27 Jan 202501:46 PM IST
- Thandel Trailer Prelude: తండేల్ అంటే ఏంటి? ఈ సందేహం చాలా మందికి ఉంది. దీనికి సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్నారు మూవీ మేకర్స్. తండేల్ ట్రైలర్ లాంచ్ మంగళవారం (జనవరి 28) జరగనుండగా.. అప్పుడే దీనికి అర్థమేంటో రివీల్ చేయనున్నారు.
Mon, 27 Jan 202511:55 AM IST
- Thandel Songs: తండేల్ మూవీ సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి మూడు పాటలు ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇవన్నీ కలిపి 10 కోట్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.
Mon, 27 Jan 202511:02 AM IST
- R Madhavan: ఆర్ మాధవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు సిక్స్ ప్యాక్ లేకపోయినా, డ్యాన్స్ రాకపోయినా 25 ఏళ్లుగా హీరోగా రాణిస్తున్న విషయాన్ని అతడు గుర్తు చేశాడు. ఈ మధ్యే అతడు హిసాబ్ బరాబర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Mon, 27 Jan 202510:18 AM IST
- OTT Comedy Thriller: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత వస్తోంది ఓ తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతోంది.
Mon, 27 Jan 202509:12 AM IST
- Razakar OTT Streaming: రజాకార్ చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి భారీ వ్యూస్ దక్కుతున్నాయి. ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతోంది.
Mon, 27 Jan 202508:44 AM IST
- Pushpa 2 OTT Release Date: పుష్ప 2 మూవీ ఓటీటీలోకి ఈ వారమే వస్తోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ కన్ఫమ్ చేసింది. అంతేకాదు రీలోడెడ్ వెర్షన్ నే స్ట్రీమింగ్ కు తీసుకురానుండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఇక పూనకాలే.
Mon, 27 Jan 202508:26 AM IST
- OTT Releases This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 11 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో అల్లు అర్జున్ పుష్ప ది రూల్‌తోపాటు చూసేందుకు 6 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇక తెలుగులో రెండు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవి క్రైమ్, ఇన్వెస్టిగేషన్, ఫాంటసీ జోనర్స్‌లో ఉన్నాయి.
Mon, 27 Jan 202508:19 AM IST
- OTT Comedy Crime Thriller: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఇప్పుడో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ నేరుగా వచ్చేస్తోంది. యామీ గౌతమ్, ప్రతీక్ గాంధీ నటించిన ఈ మూవీ ట్రైలర్ సోమవారం (జనవరి 27) రిలీజైంది. ఓ జంటకు శోభనం రాత్రే కాళరాత్రిగా మిగిలిపోతే ఎలా ఉంటుందో ఈ మూవీ చూడొచ్చు.
Mon, 27 Jan 202507:22 AM IST
- Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు సినిమా నుంచి బాబీ డియోల్ కొత్త పోస్టర్ వచ్చింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా దీన్ని మూవీ టీమ్ తీసుకొచ్చింది.
Mon, 27 Jan 202507:12 AM IST
- Sabar Bonda Movie Review In Telugu: స్వలింగ సంపర్కంపై తెరకెక్కిన రూరల్ బ్యాక్‌డ్రాప్ బోల్డ్ మూవీ సబర్ బొండా. రోహన్ కనవాడే దర్శకత్వం వహించిన ఈ మరాఠీ సినిమాను ప్రస్తుతం సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్నారు. ఇంకా థియేటర్లలో విడుదల కానీ ఈ సినిమా ఎలా ఉందో సబర్ బొండా రివ్యూలో తెలుసుకుందాం.
Mon, 27 Jan 202506:24 AM IST
- Kannappa Prabhas First Look Date: కన్నప్ప చిత్రం నుంచి ప్రభాస్ లుక్ రెడీ అయింది. ఫస్ట్ లుక్ ఎప్పుడు రానుందో డేట్‍ను మూవీ టీమ్ వెల్లడించింది. దీంతో రెబల్ స్టార్ అభిమానుల్లో ఎగ్జైట్‍మెంట్ పెరిగిపోయింది.
Mon, 27 Jan 202505:39 AM IST
- Aishwarya Rajesh Venkatesh Sankranthiki Vasthunnam Bhimavaram: వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ కావడంతో సక్సెస్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా భీమవరంలో నిర్వహించిన సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ సంబరం ఈవెంట్‌లో ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Mon, 27 Jan 202504:51 AM IST
- Telugu Movie Releases in February 2025: ఫిబ్రవరిలో ఇంట్రెస్టింగ్ తెలుగు చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. తండేల్ మూవీపై భారీ అంచనాల ఉన్నాయి. లైలా, బ్రహ్మానందం చిత్రాలపై మంచి క్రేజ్ ఉంది. ఫిబ్రవరిలో రానున్న టాప్ 5 తెలుగు చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
Mon, 27 Jan 202503:53 AM IST
- Bigg Boss Kannada 11: బిగ్‍బాస్ కన్నడ 11వ సీజన్ ముగిసింది. సీజన్‍కు ముందు పెద్దగా అంచనాలు లేని హనుమంత విజేతగా నిలిచాడు. బిగ్‍బాస్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ హనుమంత ఎవరో ఇక్కడ తెలుసుకోండి.
Mon, 27 Jan 202503:10 AM IST
- Illu Illalu Pillalu Serial January 27th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 27 ఎపిసోడ్‌లో ప్రభల తీర్థంలో ధీరజ్‌ను చంపేయమని రౌడీలకు చెబుతాడు విశ్వ. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్‌తో విశ్వ బావ అని పలకరిస్తాడు. దాంతో విశ్వపై ధీరజ్‌కు డౌట్ వస్తుంది. తను ప్రేమించిన అమ్మాయి కనిపించడంతో చందు షాక్ అవుతాడు.
Mon, 27 Jan 202502:42 AM IST
- Venkatesh - Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ ఈవెంట్ గ్రాండ్‍గా జరిగింది. తన మార్క్ సరదా స్పీచ్‍తో హీరో వెంకటేశ్ ఆకట్టుకున్నారు. స్టేజ్‍పై హుషారుగా పాడ పాడుతూ డ్యాన్స్ చేశారు.
Mon, 27 Jan 202502:15 AM IST
- Brahmamudi Serial January 27th Episode: బ్రహ్మముడి జనవరి 27 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటిన వల్లకాడు చేస్తానని అనామిక అంటుంది. మరోవైపు ఆస్తి కోసం కోర్టు నోటీసులు పంపమని లేకుంటే తన మెడలో తాళి తెంచేయమని ప్రకాశంను బెదిరిస్తుంది ధాన్యలక్ష్మీ. దాంతో కోర్టు నోటీసులపై ప్రకాశం సంతకం చేస్తాడు.
Mon, 27 Jan 202501:55 AM IST
- Karthika Deepam Today Episode January 27: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. సాయం కోసం వచ్చిన కాంచనను నానా మాటలు అంటాడు తండ్రి శివన్నారాయణ. కార్తీక్ కూడా ఫైర్ అవుతాడు. శౌర్య గురించి దీపకు జ్యోత్స్న నిజం చెప్పేస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Mon, 27 Jan 202501:08 AM IST
- Sudheer Babu Jatadhara Zee Studio Prerana Arora: నవ దళపతిగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నుంచి వస్తున్న కొత్త సినిమా జటాధర. సూపర్ నాచురల్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న జటాధర సినిమా కోసం బాలీవుడ్ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది.
Mon, 27 Jan 202512:00 AM IST
- Malayalam Action Movie Marco OTT Streaming: ఓటీటీలోకి మలయాళంలో మోస్ట్ వయెలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో స్ట్రీమింగ్ కానుంది. అయితే, తాజాగా మార్కో ఓటీటీ ప్లాట్‌ఫామ్ మారిందని, మలయాళం, తెలుగు ఐదు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని టాక్ జోరుగా నడుస్తోంది.