Telugu Cinema News Live January 25, 2025: Padma Bhushan for Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు.. ప్రకటించిన కేంద్రం
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 25 Jan 202503:47 PM IST
- Padma Bhushan for Balakrishna: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు (జనవరి 25) అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Sat, 25 Jan 202502:38 PM IST
- Mystery Crime Thriller OTT: రేఖాచిత్రం సినిమా పాజిటివ్ టాక్‍ను దక్కించుకుంది. ఈ చిత్రం సూపర్ హిట్‍గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులపై వివరాలు బయటికి వచ్చాయి.
Sat, 25 Jan 202501:39 PM IST
Lyf Teaser: ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్‌పి చరణ్ యాక్టర్‌గా ఇరవై ఏళ్ల తర్వాత తెలుగులో ఓ సినిమా చేస్తోన్నాడు. ఎల్‌వైఎఫ్ పేరుతో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించారు. ఎల్‌వైఎఫ్ టీజర్‌ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిలీజ్ చేశారు.
Sat, 25 Jan 202511:13 AM IST
- Pushpa 2 The Rule Record: పుష్ప 2 సినిమా రికార్డుల వేటను ఇంకా కొనసాగిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం తాజాగా మరో రికార్డు సృష్టించింది. ఆ వివరాలు ఇవే..
Sat, 25 Jan 202510:15 AM IST
- OTT Action Thriller: మార్కో సినిమా సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ అయింది. భారీ కలెక్షన్లను దక్కించుకుంటోంది. మలయాళంలో దుమ్మురేపిన ఈ చిత్రం తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ ఖరారు చేసుకుందని తెలుస్తోంది.
Sat, 25 Jan 202509:23 AM IST
- Dil Raju on IT Raids: ప్రముఖ నిర్మాత దిల్‍రాజు ఇళ్లు, ఆఫీస్‍ల్లో సుదీర్ఘంగా ఐటీ అధికారుల సోదాలు జరిగాయి. దీనిపై చాలా రూమర్ల వచ్చాయి. ఈ తరుణంలో దిల్‍రాజు మీడియా సమావేశంలో ఈ విషయాలపై నేడు మాట్లాడారు.
Sat, 25 Jan 202508:40 AM IST
- Venom The Last Dance OTT streaming: వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ సినిమా ఎట్టకేలకు రెంట్ లేకుండా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఇండియాలో ఈ మూవీ రెగ్యులర్ స్ట్రీమింగ్ మొదలైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Sat, 25 Jan 202508:39 AM IST
Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ వెంకటలచ్చిమి పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తోంది. రివేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముని దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ ఆరు భాషల్లో రిలీజ్ కాబోతోంది.
Sat, 25 Jan 202507:50 AM IST
- My South Diva Calendar 2025 Launch With 12 Heroines: స్టార్ హీరోయిన్స్‌ను ముందుగా మోడల్స్‌గా పరిచయం చేసిన మై సౌత్ దివా క్యాలెండర్స్ ఈ ఏడాది 12 మంది హీరోయిన్స్‌తో లాంచ్ చేశారు. ఈ క్యాలెండర్‌ను శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ ఇతర హీరోయిన్స్ లాంచ్ చేశారు.
Sat, 25 Jan 202507:33 AM IST
Malayalam OTT: బిచ్చగాడు ఫేమ్ సాట్నా టైటస్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ పార్ట్‌నర్స్ ఓటీటీలోకి వస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో ధ్యాన్ శ్రీనివాసన్, రోనీ డేవిడ్ కళాభవన్ షాజాన్ కీలక పాత్రలు పోషించారు.
Sat, 25 Jan 202507:09 AM IST
- Nindu Noorella Saavasam January 25th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 25 ఎపిసోడ్‌లో రణవీర్‌కు వచ్చిన కోర్టు నోటీసులు చూస్తుంటాడు. కూతురుని ప్రవేశపెట్టనందుకు ఆస్తి అంతా ట్రస్ట్‌కు వెళ్లిపోతుందని లాయర్ చెబుతాడు. దాంతో ఫైర్ అయిన రణవీర్ అమర్ కూతురు అంజును తీసుకొచ్చెందుకు మనోహరికి కాల్ చేసి చెబుతాడు.
Sat, 25 Jan 202506:27 AM IST
Sivarapalli Review: రాగ్ మయూర్, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్‌సిరీస్ సివరపల్లి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పంచాయత్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Sat, 25 Jan 202505:23 AM IST
- Samyuktha Menon With Balakrishna In Akhanda 2: నందమూరి బాలకృష్ణతో విరూపాక్ష హీరోయిన్ సంయుక్త మీనన్ జత కట్టనుంది. అది కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయిన బాలయ్య-బోయపాటి శ్రీను అఖండ 2 సినిమాలో. బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సీక్వెల్‌లో సంయుక్త హీరోయిన్‌గా చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Sat, 25 Jan 202503:25 AM IST
- OTT Streaming Telugu Movies: ఓటీటీలోకి గత మూడు రోజుల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చాయి. కానీ, వాటిలో 6 తెలుగు స్ట్రైట్ సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రాగా రెండు తెలుగు భాషలో డబ్ అయి రిలీజ్ అయ్యాయి. ఒక్కో డిఫరెంట్ జోనర్‌తో ఓటీటీలోకి వచ్చిన 8 తెలుగు సినిమాలు, సిరీస్‌లు చూద్దాం.
Sat, 25 Jan 202503:08 AM IST
Illu Illalu Pillalu : ఇళ్లు ఇల్లాలు పిల్లలు జనవరి 25 ఎపిసోడ్‌లో ఫస్ట్ నైట్ రోజు తల నొప్పి పేరుతో నర్మద ఆడిన నాటకాన్ని బయటపెడతాడు సాగర్. నన్ను ఎందుకు దూరం పెడుతోన్నావో చెప్పాల్సిందేనని పట్టుపడతాడు. సంక్రాంతి వేడుకల్ని అడ్డం పెట్టుకొని ధీరజ్‌పై విశ్వ మనిషి ఎటాక్ చేస్తాడు.
Sat, 25 Jan 202502:31 AM IST
- Brahmamudi Serial January 25th Episode: బ్రహ్మముడి జనవరి 25 ఎపిసోడ్‌లో కావ్య అవమానించిన దాని గురించి సుభాష్‌తో ప్రకాశం మాట్లాడుతాడు. కావ్య నన్ను అన్నదంటే తనకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో అని ఆలోచిస్తున్నా అంటాడు సుభాష్. తర్వాత కావ్యతో కూడా నా కోడలు తప్పు చేయదని నాకు తెలుసు అని సుభాష్ అంటాడు.
Sat, 25 Jan 202501:56 AM IST
- Karthika Deepam 2 Serial January 25 Episode: కార్తీక దీపం 2 సీరియల్‍లో నేడు.. శౌర్య కాసేపు కనిపించకపోవటంతో కార్తీక్ కంగారు పడతాడు. సాయం కోసం తండ్రి శివన్నారాయణ ఇంటికి వెళుతుంది కాంచన. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Sat, 25 Jan 202501:46 AM IST
మహేష్‌బాబు, రాజమౌళి మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా కోసం మహేష్‌బాబు పాస్‌పోర్ట్‌ను లాగేసుకొని అతడిని లాక్ చేసినట్లుగా ఓ వీడియోను రాజమౌళి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. రాజమౌళి పోస్ట్‌కు మహేష్‌బాబు ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది.
Sat, 25 Jan 202501:21 AM IST
- Ananthika Sanilkumar 8 Vasanthalu Teaser Released: మ్యాడ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది మలయాళ బ్యూటిఫుల్ భామ అనంతిక సనిల్‌కుమార్. ఆమె నటించిన లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ 8 వసంతాలు. తాజాగా 8 వసంతాలు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..!
Sat, 25 Jan 202512:41 AM IST
OTT: రాశీఖన్నా బాలీవుడ్ మూవీ ది సబర్మతి రిపోర్ట్ తెలుగులోకి వచ్చింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ మూవీలో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు.
Sat, 25 Jan 202512:00 AM IST
- Patriotic OTT Movies To Watch On Republic Day 2025: ఓటీటీలో స్ఫూర్తి నింపే దేశభక్తి సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ, వాటన్నింటిలో ఈ గణతంత్ర దినోవత్సవం (జనవరి 26) రోజున ఫ్యామిలీతో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేసేందుకు టాప్ 5 ఓటీటీ సినిమాలను సజెషన్ కింద ఇక్కడ తెలుసుకోండి. అన్నీ 2024లో రిలీజ్ అయిన కొత్త సినిమాలే.