Telugu Cinema News Live January 23, 2025: Kichcha Sudeep: బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తానన్నా వద్దంటున్న ఈగ విలన్.. ఇదీ కారణం
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 23 Jan 202504:53 PM IST
- Kichcha Sudeep: బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఎంతో మంది కలలు కంటారు. కానీ ఈగ మూవీలో విలన్ గా నటించిన కన్నడ స్టార్ హీరో మాత్రం అక్కడి ప్రభుత్వం తనకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తానన్నా వద్దంటున్నాడు. దీనికి కారణమేంటో కూడా అతడే చెప్పుకొచ్చాడు.
Thu, 23 Jan 202504:15 PM IST
- Thandel Hillesso Hilessa Song Lyrics: తండేల్ మూవీ నుంచి మరో అదిరిపోయే మెలోడీ సాంగ్ వచ్చేసింది. ఈ థర్డ్ సింగిల్ ను గురువారం (జనవరి 23) రిలీజ్ చేశారు. హైలెస్సో హైలెస్సా అంటూ సాగిపోయే ఈ పాట మనసుకు హత్తుకుంటోంది.
Thu, 23 Jan 202502:34 PM IST
- Oscars 2025 Nominations: ఆస్కార్స్ 2025 కోసం నామినేషన్లను అకాడెమీ గురువారం (జనవరి 23) అనౌన్స్ చేసింది. గునీత్ మోంగా, ప్రియాంకా చోప్రా నిర్మించిన ఫిల్మ్ అనూజకు ఇందులో చోటు దక్కడం విశేషం.
Thu, 23 Jan 202502:04 PM IST
- Madha Gaja Raja: తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన 12 ఏళ్ల కిందటి మూవీ మదగజరాజ తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పుడు ఏకంగా రూ.50 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.
Thu, 23 Jan 202511:17 AM IST
- Telugu TV Serials TRP Ratings January 2nd Week: తెలుగు టీవీ సీరియల్స్‌కు సంబంధించిన జనవరి రెండో వారం టీఆర్‌పీ రేటింగ్స్ జాబితా వచ్చేసింది. ఎప్పటిలాగే స్టార్ మా ఛానెల్స్ మొదటి స్థానంలో దూసుకుపోతుంటే రెండో ప్లేసులో జీ తెలుగు నిలిచింది. మరి వీటిలో టాప్ 5లో ఉన్న సీరియల్స్‌పై లుక్కేద్దాం.
Thu, 23 Jan 202510:32 AM IST
- OTT Bold Movie: టాలీవుడ్ హీరోయిన్ నటించిన బోల్డ్ మూవీ ఒకటి నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. కొత్త బంగారు లోకం మూవీతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు ప్రసాద్ మరో బోల్డ్ క్యారెక్టర్ ఈ మూవీలో పోషించడం విశేషం.
Thu, 23 Jan 202509:09 AM IST
IT Raids: టాలీవుడ్ ఐటీ దాడులు మూడో రోజు కొనసాగుతోన్నాయి. టాలీవుడ్ ప్రొడ్యూసర్లతో వారికి ప్రొడక్షన్‌లో సహాయం చేస్తోన్న ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులలో అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నారు. ఈ ఐటీ దాడుల కారణంగా భారీ బడ్జెట్ సినిమాలపై ఎఫెక్ట్ పడినట్లు సమాచారం.
Thu, 23 Jan 202509:06 AM IST
- Friday OTT Releases: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. అందులో ఓ తెలుగు మూవీ, వెబ్ సిరీస్ మాత్రం ఆసక్తి రేపుతోంది. వీటిని అస్సలు మిస్ కాకుండా చూడండి.
Thu, 23 Jan 202508:36 AM IST
- RGV Jail Sentence: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష విధించింది ముంబై కోర్టు. 2018లో అతనిపై నమోదైన కేసులో ఇప్పుడు శిక్ష పడటం గమనార్హం. అయితే అతడు అదనంగా మరో మూడు నెలలు కూడా జైలు శిక్ష ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది.
Thu, 23 Jan 202508:20 AM IST
- Director SS Rajamouli Favourite 2 Songs And Heroine: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో తెరకెక్కిస్తోన్న ఎస్ఎస్ఎంబీ 29తో బిజీగా ఉన్నారు. అయితే, రాజమౌళికి బాగా నచ్చిన రెండు సాంగ్స్, వాటిని కేవలం హీరోయిన్ డ్యాన్స్ కోసమే చూసినట్లుగా చెప్పారు జక్కన్న. ఆ వివరాల్లోకి వెళితే..!
Thu, 23 Jan 202507:27 AM IST
OTT Crime Thriller: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైడ్ అండ్ సీక్ ఈటీవీ విన్ ఓటీటీలో జనవరి 24న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ మూవీలో విశ్వాంత్, రియాసచ్‌దేవ్, శిల్పా మంజునాథ్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Thu, 23 Jan 202507:01 AM IST
- Daaku Maharaaj Director Bobby Kolli About Balakrishna: నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు డైరెక్టర్ బాబీ కొల్లి. తాజాగా అనంతపురంలో నిర్వహించిన డాకు మహారాజ్ విజయోత్సవ పండుగలో దర్శకుడు బాబీ కొల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Thu, 23 Jan 202506:22 AM IST
OTT: నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన కోలీవుడ్ మూవీ టెస్ట్ నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ నెలాఖరున లేదా మే ఫస్ట్ వీక్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Thu, 23 Jan 202506:20 AM IST
- Wife Off OTT Streaming Today: ఓటీటీలోకి ఇవాళ డైరెక్ట్ రిలీజ్ అయిన తెలుగు ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ వైఫ్ ఆఫ్. నిఖిల్ గాజుల, దివ్య శ్రీ, అభినవ్ మణికంఠ ప్రధాన పాత్రల్లో నటించిన వైఫ్ ఆఫ్ సినిమాను భాను యేరుబండి దర్శకత్వం వహించారు. నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న వైఫ్ ఆఫ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై లుక్కేద్దాం.
Thu, 23 Jan 202505:01 AM IST
- Anil Ravipudi About Sankranthiki Vasthunnam Movie: డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. తాజాగా జనవరి 23 అంటే నేటితో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి డైరెక్టర్‌గా 10 ఏళ్లు పూర్తి చేసుకున్నారు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలిపారు.
Thu, 23 Jan 202504:36 AM IST
ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 23 ఎపిసోడ్‌లో కూతురు ప్రేమ కళ్ల ముందే ఉన్నా తనతో మాట్లాడలేని పరిస్థితి రావడంతో సేనాపతి, రేవతి కన్నీళ్లు పెట్టుకుంటారు. తమ కుటుంబంపై పగ తీర్చుకోవడానికే ధీరజ్‌కు, ప్రేమకు రామరాజు పెళ్లి జరిపించాడని అపోహపడిన భద్రావతి కోపంతో రగిలిపోతుంది.
Thu, 23 Jan 202503:13 AM IST
విశాల్ కోలీవుడ్ మూవీ మదగజరాజా తెలుగు రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఈ యాక్షన్ కామెడీ మూవీ జనవరి 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించారు.
Thu, 23 Jan 202503:10 AM IST
- Balakrishna Comments At Daaku Maharaaj Success Celebrations: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను జనవరి 22న అనంతపురములో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Thu, 23 Jan 202502:35 AM IST
- Brahmamudi Serial January 23rd Episode: బ్రహ్మముడి జనవరి 23 ఎపిసోడ్‌లో నందగోపాల్‌ను ఎవరో గన్‌తో షూట్ చేసి పారిపోతారు. దాంతో మళ్లీ రాజ్, కావ్య కష్టాలు మొదటికి వస్తాయి. నిజం చెబితే రుద్రాణి చాటింపు వేస్తుందని, అప్పులన్నీ నెత్తిమీద పడతాయని రాజ్ భయపడిపోతాడు. తనే దోషిలా ఇంట్లో ఉంటానని కావ్య అంటుంది.
Thu, 23 Jan 202502:35 AM IST
Karthika Deepam 2 Serial:కార్తీక దీపం జనవరి 23 ఎపిసోడ్‌లో దాసును చంపడానికి ప్రయత్నించింది ఎవరో తెలుసుకోవడానికి శివన్నారాయణ ఇంటికొస్తారు పోలీసులు. కానీ జ్యోత్స్న తెలివిగా దాసు తమ ఇంటికొచ్చిన రోజు సీసీ టీవీ ఫుటేజ్ డిలీట్ చేస్తుంది.
Thu, 23 Jan 202501:07 AM IST
- Anupama Parameswaran Comments In Paradha Teaser Launch: బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ మూవీ పరదా. సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన పరదా టీజర్‌ను మలయాళ స్టార్ హీరో దుల్కన్ సల్మాన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ చేసింది.