Telugu Cinema News Live January 17, 2025: Urvashi Rautela: నోరు జారి క్షమాపణ చెప్పిన బాలయ్య హీరోయిన్.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి, డాకు మహారాజ్ సక్సెస్‌కు ముడిపెడుతూ..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Fri, 17 Jan 202505:08 PM IST
- Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి ఘటనపై నోరు జారిన డాకు మహారాజ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా..ఇప్పుడు క్షమాపణ చెప్పింది. ఆ దాడి తీవ్రతను అర్థం చేసుకోలేక తాను నోరు జారినట్లు ఆమె చెప్పడం విశేషం.
Fri, 17 Jan 202502:45 PM IST
- Manchu Manoj vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. తన తండ్రి పాత మూవీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఈ ఇద్దరూ మళ్లీ రోడ్డున పడ్డారు.
Fri, 17 Jan 202512:03 PM IST
- Sivarapalli Web Series: హిందీలో సూపర్ హిట్ అయిన పంచాయత్ వెబ్ సిరీస్ తెలుగు రీమేక్ సివరపల్లి పేరుతో రాబోతోంది. ఈ కామెడీ డ్రామా సిరీస్ ట్రైలర్ ను శుక్రవారం (జనవరి 17) మేకర్స్ రిలీజ్ చేస్తూ.. స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు.
Fri, 17 Jan 202511:06 AM IST
- OTT Telugu Web Series: ఓటీటీలోకి మరో తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు కోబలి. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేస్తూ.. శుక్రవారం (జనవరి 17) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
Fri, 17 Jan 202510:51 AM IST
- Nagarjuna About Nageswara Rao Annapurna Studios 50 Years: అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అందులో నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Fri, 17 Jan 202510:15 AM IST
Emergency Review: కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన ఎమర్జెన్సీ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
Fri, 17 Jan 202509:51 AM IST
- Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ తొలి వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. కార్తీకదీపం సీరియల్ టాప్ లో కొనసాగుతుండగా.. చిన్ని సీరియల్ కూడా దుమ్ము రేపుతోంది. మొత్తంగా టాప్ 6లో స్టార్ మా సీరియల్సే ఉన్నాయి.
Fri, 17 Jan 202509:31 AM IST
- Paatal Lok Season 2 Review In Telugu: ఓటీటీలోకి ఇవాళ స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాళ్ లోక్ సీజన్ 2. భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందో నేటి పాతాళ్ లోక్ 2 రివ్యూలో చూద్దాం.
Fri, 17 Jan 202509:04 AM IST
- Pushpa 2 Reloaded Version: పుష్ప 2 మూవీ రీలోడెడ్ వెర్షన్ శుక్రవారం (జనవరి 17) థియేటర్లలోకి వచ్చేసింది. ఇందులో అదనంగా మరో 20 నిమిషాలను కలపడం విశేషం. దీంతో మూవీ రన్ టైమ్ మరింత పెరిగింది. మరి కొత్తగా మూవీలోకి వచ్చిన ఆ సీన్లేంటో చూడండి.
Fri, 17 Jan 202508:18 AM IST
- Naga Chaitanya Cooking Fish Curry Video Over Thandel Movie: హీరో నాగ చైతన్య మత్స్యకారులకు చేపల పులుసు వండిపెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదివరకు వారిలాగే చేపల పులుసు వండిపెడతానని మాటిచ్చిన నాగ చైతన్య నిలబెట్టుకున్నాడంటూ ఓ మత్స్యకారుడు ఆ వీడియోలో చెప్పాడు.
Fri, 17 Jan 202507:55 AM IST
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో డైరెక్టర్‌గా ఎనిమిదో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. టాలీవుడ్‌లో అపజయమే లేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అనిల్ రావిపూడి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి తమ్ముడు డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ కారణం.
Fri, 17 Jan 202507:28 AM IST
- Director Bobby Kolli About Animal Actor Bobby Deol: బాలకృష్ణ డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ కొల్లి యానిమల్ విలన్ బాబీ డియోల్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. యానిమల్ కంటే సినిమా ముందు తన పరిస్థితి ఎలా ఉందో తనతో బాబీ డియోల్ చెప్పుకున్నట్లు దర్శకుడు బాబీ కొల్లి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Fri, 17 Jan 202506:35 AM IST
OTT Action Thriller: కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అలంగు థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో గుణనిధి, చెంబన్ వినోద్ జోస్ కీలక పాత్రల్లోనటించారు.
Fri, 17 Jan 202506:10 AM IST
Priyanka Chopra Lands In Hyderabad Is For SSMB29: అమెరికాలోని లాస్ ఎంజెల్స్ నుంచి హైదారాబాద్‌కు వచ్చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఈ అమెరికా కోడలు హైదరాబాద్ రాకకు కారణం సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి సినిమా ఎస్ఎస్ఎంబీ 29 కోసమే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Fri, 17 Jan 202505:37 AM IST
హరి హర వీర మల్లు నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. మాట వినాలి అంటూ సాగిన ఈ పాటను హీరో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు. పెంచలదాస్ రాసిన ఈ పాటకు కీరవాణి మ్యూజిక్ అందించారు. ఈ పాటకు పవన్ కళ్యాణ్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Fri, 17 Jan 202503:53 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు జనవరి 17 ఎపిసోడ్‌లో బాలుతో మాట్లాడి అతడికి క్షమాపణలు చెప్పాలని రవి ప్రయత్నిస్తాడు. రవి మాటల్ని బాలు వినడు. దాంతో బాలుపై రవి రివర్స్ అవుతాడు. నీ కోపం, మూర్ఖత్వం వల్లే నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని బాలును నానా మాటలు అంటాడు రవి.
Fri, 17 Jan 202503:32 AM IST
- Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఒక్కటి తప్పా 10 సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, అందులోనూ 5 తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాలన్నీ హారర్ యాక్షన్, ఫాంటసీ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ జోనర్స్‌లో ఉన్నాయి.
Fri, 17 Jan 202502:32 AM IST
- Brahmamudi Serial January 17th Episode: బ్రహ్మముడి జనవరి 17 ఎపిసోడ్‌లో స్వప్న సీమంతంలో అడుగడుగునా అడ్డు పడుతుంది రుద్రాణి. కావ్య నగలు తాకట్టు పెట్టిన బిల్ రిసిప్ట్‌ను రాహుల్‌తో సంపాదిస్తుంది. దాన్ని అందరి ముందు చూపించి కావ్య గుట్టు రట్టు చేస్తుంది. నీ ఉద్దేశం ఏంటో బయటపడింది అత్త అని రాజ్ అంటాడు.
Fri, 17 Jan 202502:10 AM IST
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జనవరి 17 ఎపిసోడ్‌లో శౌర్య ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బులను ఎలా అడ్జెస్ట్ చేయాలో తెలియక కార్తీక్ సతమతమవుతాడు. స్నేహితుడు రవిని అప్పు అడుగుతాడు. మీ తాతకు సారీ చెబితే ఈ కష్టాలు ఉండవు కదా అని రవి సలహాలు ఇవ్వడంతో కార్తీక్ అతడిపై కోప్పడుతాడు.
Fri, 17 Jan 202501:10 AM IST
- Director Anil Ravipudi On Sankranthiki Vasthunnam Success: విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ విశేషాల్లోకి వెళితే..!
Fri, 17 Jan 202512:43 AM IST
Telugu OTT: అనసూయ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన రజాకార్ మూవీ జనవరి 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం జనవరి 22 నుంచే ఈ మూవీని స్క్రీనింగ్‌కు అందుబాటులోకి తీసుకొస్తోన్నట్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది.
Fri, 17 Jan 202512:30 AM IST
- Nindu Noorella Saavasam January 17th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 17 ఎపిసోడ్‌లో అంజులో అరుంధతి ఆత్మ ఉందని అమర్, రాథోడ్ అనుమానించి రామ్మూర్తి వెళ్లిన షాప్‌కు వెళ్తారు. కానీ, అదివరకే అంజును పాత బిల్డింగ్‌లో బంధిస్తాడు ఘోరా. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన అమర్ ఘోరాను చితకబాతాడు.