Telugu Cinema News Live January 10, 2025: Daaku Maharaj Release Trailer: రాయలసీమ నా అడ్డా.. మాస్టర్స్ ఇన్ మర్డర్స్.. డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ మరో లెవెల్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Fri, 10 Jan 202503:20 PM IST
- Daaku Maharaj Release Trailer: బాలకృష్ణ డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ మరో లెవెల్లో ఉంది. బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగులు, మాస్ యాక్షన్ సీన్లతో నిండిపోయిన ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ మూవీ ఆదివారం (జనవరి 12) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
Fri, 10 Jan 202502:13 PM IST
- OTT Love Thriller Movie: ఓటీటీలోకి ఓ లవ్ థ్రిల్లర్ మూవీ సడెన్‌గా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీ పేరు ప్రేమించొద్దు. రెండు ఓటీటీల్లోకి ముందస్తు సమాచారం లేకుండా స్ట్రీమింగ్ కు రావడం విశేషం. మరి ఈ మూవీని ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడాలో తెలుసుకోండి.
Fri, 10 Jan 202512:41 PM IST
- Allu Aravind Birthday: అల్లు అరవింద్ తన 76వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నాడు. పుష్ప కా బాప్ అని రాసి ఉన్న కేకును అల్లు అర్జున్, ఫ్యామిలీతో కలిసి అతడు కట్ చేస్తున్న ఫొటోలు ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తున్నాయి.
Fri, 10 Jan 202511:20 AM IST
- Naanaa Hyraanaa Song: గేమ్ ఛేంజర్ మూవీలో నానా హైరానా పాట కనిపించకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. భారీ ఖర్చుతో తీసిన ఈ పాటను సినిమాలో ఎందుకు పెట్టలేదో చెబుతూ మూవీ టీమ్ ఓ ట్వీట్ చేసింది.
Fri, 10 Jan 202509:34 AM IST
- Sai Kumar Remuneration Over 50 Years Journey: బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. 50 ఏళ్ల నుంచి టాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు సాయి కుమార్. రెండు సార్లు నంది అవార్డులు, పలు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న సాయి కుమార్ ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం.
Fri, 10 Jan 202509:22 AM IST
OTT Suspense Thriller: మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సీక్రెట్ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మలయాళం మూవీలో ధ్యాన్ శ్రీనివాసన్, అపర్ణ దాస్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Fri, 10 Jan 202508:53 AM IST
- Game Changer Leaked: గేమ్ ఛేంజర్ మూవీ కూడా పైరసీ బారిన పడింది. థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల్లోనే ఈ మూవీ ఆల్‌లైన్లోకి వచ్చేసింది. అయితే ఈ పైరసీ వెర్షన్ ను మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మాత్రం కొన్ని చిక్కుల్లో పడినట్లే అని గుర్తుంచుకోండి.
Fri, 10 Jan 202508:45 AM IST
- Bachchala Malli OTT Streaming On 3 Platforms: ఓటీటీలోకి ఇవాళ బచ్చల మల్లి సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, తాజాగా సడెన్‌గా మరో రెండు ఓటీటీల్లో బచ్చల మల్లి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అల్లరి నరేష్ నటించిన రూరల్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ బచ్చల మల్లి 3 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూద్దాం.
Fri, 10 Jan 202508:38 AM IST
బిగ్‌బాస్ ఫేమ్ ఆదిత్యం ఓం హీరోగా నటిస్తోన్న బంధీ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సింగిల్ క్యారెక్టర్‌తో ప్రయోగాత్మకంగా ఈ మూవీ తెరకెక్కింది. పర్యావరణ సంరక్షణ, ప్రకృతి గొప్పదనం చాటి చెప్పే కాన్సెప్ట్‌తో డైరెక్టర్ తిరుమల రఘు ఈ మూవీని రూపొందించాడు.
Fri, 10 Jan 202508:26 AM IST
- Rashmika Mandanna Injury: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జిమ్ లో గాయపడింది. దీంతో ఆమె నటిస్తున్న సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. యానిమల్, పుష్ప 2 బ్లాక్‌బస్టర్ హిట్స్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. ప్రస్తుతం వివిధ సినిమాల్లో నటిస్తోంది.
Fri, 10 Jan 202507:55 AM IST
Game Changer OTT: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని దిల్‌రాజు ప్రొడ్యూస్ చేశాడు.
Fri, 10 Jan 202507:46 AM IST
- Game Changer Day 1 Worldwide Box Office Collection: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఇవాళ (జనవరి 10) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మొదటి రోజు గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ ఎంత అనేదానిపై క్యూరియాసిటీ నెలకొంది. కాబట్టి, అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి గేమ్ ఛేంజర్ డే 1 కలెక్షన్స్ ఎంతో చూద్దాం.
Fri, 10 Jan 202506:26 AM IST
- Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో 6 సినిమాలు స్పెషల్‌గా ఉండగా.. మూడు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మొత్తంగా ఈ సినిమాలన్లీ హారర్ ఫాంటసీ థ్రిల్లర్, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ జోనర్స్‌లో ఉన్నాయి.
Fri, 10 Jan 202505:25 AM IST
Telugu Serial: మరో కొత్త సీరియల్‌ను స్టార్ మా త్వరలోనే లాంఛ్ చేయబోతున్నది. భానుమతి పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీరియల్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ సీరియల్‌లో శంకర్‌కుమార్ చక్రవర్తి, చైత్ర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.
Fri, 10 Jan 202505:24 AM IST
- Pooja Ramachandran In Hathya Teaser Release Event: బిగ్ బాస్ తెలుగు సీజన్ 2, స్వామిరారా సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న పూజా రామచంద్రన్ కొడుకు పుట్టిన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా హత్య. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన హత్య టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Fri, 10 Jan 202504:14 AM IST
Romantic Comedy OTT: సిద్ధార్థ్ మిస్ యూ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది.
Fri, 10 Jan 202503:01 AM IST
Karthika Deepam 2 : కార్తీక దీపం 2 జనవరి 10 ఎపిసోడ్‌లో కార్తీక్ చేత తన కంపెనీ ముందు దీపనే ధర్నా చేయించిందని కోపంతో జ్యోత్స్న రగిలిపోతుంది. నా జోలికి రావద్దంటూ దీపకు వార్నింగ్ ఇస్తుంది. మొండితనం పక్కనపెట్టి ఇకనైనా మారమని, పది మంచి మెచ్చేలా బతకమని జ్యోత్స్నకు దీప బదులిస్తుంది.
Fri, 10 Jan 202502:50 AM IST
- Gunde Ninda Gudi Gantalu Serial January 10th Episode: గుండె నిండా గుడి గంటలు జనవరి 10 ఎపిసోడ్‌లో రవి, శ్రుతి వస్తారని బాలును ఇంట్లో లేకుండా చేసేందుకు ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తుంది ప్రభావతి. అది చూసి తట్టుకోలేకపోతాడు బాలు. తర్వాత అత్తింట్లోకి భర్త రవితో కలిసి శ్రుతి అడుగుపెడుతుంది.
Fri, 10 Jan 202501:53 AM IST
- Brahmamudi Serial January 10th Episode: బ్రహ్మముడి జనవరి 10 ఎపిసోడ్‌లో వెండి కుంకుమ భరిణ బహుమతిగా ఇచ్చి మరి స్వప్నకు సీమంతం జరిపించాలని రుద్రాణి అంటే కావ్య ఒప్పుకుంటుంది. అలా ఇంట్లో గొడవ పెడదామని ధాన్యలక్ష్మీతో ప్లాన్ చేస్తుంది. కానీ, ఆ ప్లాన్ తిప్పికొట్టేలా కనకంను అస్త్రంగా పంపిస్తుంది కావ్య.
Fri, 10 Jan 202512:47 AM IST
- Pragya Jaiswal About Daaku Maharaaj Releasing On Her Birthday: అఖండ సినిమాతో హీరోయిన్‌గా మంచి హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. బాలకృష్ణ యాక్ట్ చేసిన డాకు మహారాజ్ ప్రగ్యా జైస్వాల్ పుట్టినరోజున రిలీజ్ కానుంది. దీనిపై ప్రగ్యా జైస్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Fri, 10 Jan 202512:31 AM IST
- Game Changer Review: రామ్చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో మంచి అంచనాలతో ఈ పొలిటికల్ మూవీ నేడు రిలీజ్ అయింది. ఈ సినిమా మెప్పించేలా ఉందా.. హైప్‍ను నిలబెట్టుకుందా అనేది ఇక్కడ రివ్యూ చూడండి.
Fri, 10 Jan 202512:30 AM IST
- NNS 10th January Episode: నిండు నూరేళ్ల సావాసం శుక్రవారం (జనవరి 10) ఎపిసోడ్లో మిస్సమ్మ దగ్గర రామ్మూర్తి నిజం దాస్తాడు. అటు ఆరు కోసం వెతుకుతున్నానని అమర్ కు చెబుతుంది మనోహరి. కనిపించిందా అని అతడు అడుగుతాడు.
Fri, 10 Jan 202512:19 AM IST
Game Changer Twitter Review: రామ్చరణ్, డైరెక్టర్ శంకర్ కలయికలో వచ్చిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న (నేడు) పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైంది. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?