Telugu Cinema News Live February 5, 2025: Ram Charan Guest: రామ్ చరణ్ మూవీ సెట్‌లో స్పెషల్ గెస్ట్.. ఇంతకీ ఎవరో తెలుసా.. ఉపాసన క్యూట్ కామెంట్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 05 Feb 202504:48 PM IST
- Ram Charan Guest: రామ్ చరణ్ మూవీ ఆర్సీ16 సెట్లోకి ఓ స్పెషల్ గెస్ట్ వచ్చింది. ఆ గెస్టును చరణే ఎత్తుకొని తీసుకొచ్చాడు. ఈ క్యూట్ ఫొటోను చెర్రీ తన ఇన్‌స్టాగ్రామ్ లో బుధవారం (ఫిబ్రవరి 5) రాత్రి షేర్ చేశాడు.
Wed, 05 Feb 202503:42 PM IST
- Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ కు అతని 49వ పుట్టిన రోజు సందర్భంగా ఓ క్యూట్ బర్త్ డే విషెస్ చెప్పింది. అభిషేక్ చిన్ననాటి ఫొటోను పోస్ట్ చేస్తూ ఆమె విషెస్ చెప్పడం విశేషం. విడాకుల పుకార్ల నేపథ్యంలో ఈ పోస్ట్ వైరల్ అయింది.
Wed, 05 Feb 202501:01 PM IST
- Pushpa 2 on Netflix: పుష్ప 2 మూవీ నెట్‌ఫ్లిక్స్ లోనూ దుమ్ము రేపుతోంది. బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టి బాహుబలి 2లాంటి సినిమానే వెనక్కి నెట్టిన ఈ అల్లు అర్జున్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ తన మ్యాజిక్ రిపీట్ చేస్తోంది.
Wed, 05 Feb 202511:53 AM IST
- Producer Ramesh Babu: టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లపై సంచలన కామెంట్స్ చేశాడు ప్రొడ్యూసర్ శింగనమల రమేష్ బాబు. కొమురం పులి, ఖలేజా సినిమాల వల్ల తాను రూ.100 కోట్లు నష్టపోయినా అయ్యో పాపం కూడా అనలేదని అతడు అనడం గమనార్హం.
Wed, 05 Feb 202511:34 AM IST
- OTT Top Releases: ఈ వారం మరికొన్ని ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‍లు క్యూ కడుతున్నాయి. ఇందులో ఏడు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ మూవీ ఈవారమే అడుగుపెట్టనుంది. క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఓ సిరీస్ వచ్చేయనుంది.
Wed, 05 Feb 202510:47 AM IST
OTT Thriller: తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 54321 థియేటర్లలో విడుదలైన తొమ్మిదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 99 రూపాయల రెంటల్‌తో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కోలీవుడ్ మూవీలో ఆర్విన్, షబ్బీర్, పవిత్రా గౌడ హీరోహీరోయిన్లుగా నటించారు.
Wed, 05 Feb 202509:24 AM IST
- Anuja OTT Streaming: అనూజ షార్ట్ ఫిల్మ్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ మూవీ నిర్మాతల్లో ప్రియాంక చోప్రా కూడా ఒకరిగా ఉన్నారు.
Wed, 05 Feb 202508:19 AM IST
Mythological Movie: మహిషాసుర మర్ధిని కాన్సెప్ట్‌తో తెలుగులో ఓ మైథలాజికల్ మూవీ రాబోతుంది. ఈ సినిమా ద్వారా అర్చన కొంత గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. రాకీ షెర్మన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు.
Wed, 05 Feb 202507:15 AM IST
- Robinhood: రాబిన్‍హుడ్ సినిమా నుంచి మరో అప్‍డేట్ వచ్చింది. ఈ చిత్రంలో విలన్‍గా బాలీవుడ్ యాక్టర్ నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ నేడు వచ్చింది.
Wed, 05 Feb 202507:04 AM IST
- NNS 5th February Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఫిబ్రవరి 5) ఎపిసోడ్లో అంజు మెడలో చెయిన్ వేస్తాడు రణ్‌వీర్. అది చూసి అమర్ షాక్ తింటాడు. మరోవైపు అంజుని తనతోపాటు కోల్‌కతాకు తీసుకెళ్లడానికి రణ్‌వీర్ కొత్త ప్లాన్ వేస్తాడు.
Wed, 05 Feb 202506:22 AM IST
- Pushpa 2 OTT: పుష్ప 2 సినిమా వెస్ట్రన్ ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చేస్తోంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీని చూసిన చాలా మంది హాలీవుడ్ ప్రేక్షకులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు.
Wed, 05 Feb 202506:05 AM IST
నీట్ ఎగ్జామ్స్‌పై రూపొందిన హిందీ వెబ్‌సిరీస్ మెడికల్ డ్రీమ్స్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్‌సిరీస్‌లో త్రీ ఇడియట్స్ ఫేమ్ శర్మాన్ జోషి కీలక పాత్రలో నటించాడు.
Wed, 05 Feb 202504:34 AM IST
- Mythological Action Drama OTT: దేవకీ నందన వాసుదేవ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ మూవీ తెలుగు కంటే ముందు హిందీలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Wed, 05 Feb 202504:02 AM IST
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 5 ఎపిసోడ్‌లో ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి ధీరజ్ నీళ్ల కోసం వెళ్లబోతూ కిందపడతాడు. అతడిని ప్రేమ పట్టుకొని కాపాడుతుంది. విశ్వకు రామరాజు వార్నింగ్ ఇచ్చాడని తెలిసి భద్రావతి కోపంతో రగిలిపోతుంది. రామరాజు ఇంటిపైకి గొడవకు వస్తుంది.
Wed, 05 Feb 202502:55 AM IST
- Game Changer OTT: కమర్షియల్‍గా సక్సెస్ కాలేకపోయిన గేమ్ ఛేంజర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. భారీ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ నెల తిరగకుండానే స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. మరి ఈ చిత్రం ఓటీటీలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా..
Wed, 05 Feb 202502:11 AM IST
Brahmamudi: బ్రహ్మముడి ఫిబ్రవరి 5 ఎపిసోడ్‌లో రాజ్, కావ్య దగ్గర ఉన్న రెండు కోట్ల రూపాయల్ని కొట్టేస్తాడు రాహుల్. డబ్బులు కొట్టేసిన రౌడీ రాజ్, కావ్యలకు దొరికిపోతాడు. రాహుల్ ఈ పని చేశాడని అతడి ద్వారా నిజం తెలుసుకున్న రాజ్...రాహుల్‌ను చితక్కొడతాడు.
Wed, 05 Feb 202501:55 AM IST
- Karthika Deepam 2 Serial Today Episode February 5: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్య ఆపరేషన్ కోసం డబ్బు ఎవరు కట్టారనే సందేహంలో కార్తీక్, కాశీ ఉంటారు. ఆపరేషన్ ఎలా జరుగుతుందోననే దీప కంగారు పడుతుంది. ఆపరేషన్ పూర్తవుతుంది. కార్తీక్ వెక్కివెక్కి ఏడుస్తాడు. పూర్తిగా ఏం జరిగింతో ఇక్కడ చూడండి.
Wed, 05 Feb 202512:48 AM IST
Bollywood OTT: కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో ఈ బాలీవుడ్ మూవీ రిలీజైంది. తేరీ రీమేక్‌గా తెరకెక్కిన బేబీ జాన్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.