Telugu Cinema News Live February 4, 2025: MX Player New Movies Web Series: ఒకే ఓటీటీలోకి కొత్తగాా 100 సినిమాలు, వెబ్ సిరీస్.. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ దూకుడు
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Tue, 04 Feb 202505:08 PM IST
- MX Player New Movies Web Series: ఒకే ఓటీటీలోకి ఈ ఏడాది ఏకంగా 100కుపైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ఈ మధ్యే అమెజాన్ కొనుగోలు చేసిన ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ దూకుడుగా వెళ్తోంది.
Tue, 04 Feb 202504:37 PM IST
OTT Horror Crime Thriller Web Series: ఓటీటీలో హారర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. మరి ఈ రెండు జానర్లు కలిపి వచ్చిన తమిళ వెబ్ సిరీస్.. ఆ భాషలో ఎక్కువ మంది చూసిన సిరీస్ గా నిలిచింది. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మీరు చూశారా?
Tue, 04 Feb 202503:52 PM IST
- Thandel Movie Ticket Prices: తండేల్ మూవీ టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం (ఫిబ్రవరి 4) ఉత్తర్వులు జారీ చేసింది.
Tue, 04 Feb 202503:08 PM IST
- Pooja Hegde: అల వైకుంఠపురంలో ఓ తమిళ మూవీ అంటూ నోరు జారి హీరోయిన్ పూజా హెగ్డేతో నెటిజన్లు ఆడుకుంటున్నారు. అల్లు అర్జున్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ విషయంలో నోరు జారిన పూజాపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.
Tue, 04 Feb 202502:04 PM IST
- Prime Video Releases this week: ప్రైమ్ వీడియోలోకి ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తున్నాయి. అందులో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కూడా ఉండటం విశేషం. థియేటర్లలో దారుణంగా బోల్తా కొట్టిన ఈ సినిమాను ఓటీటీలో ఎంతమేర ఆదరిస్తారన్నది చూడాలి.
Tue, 04 Feb 202512:17 PM IST
- Breakup Kahani OTT: బ్రేకప్ కహానీ అనే ఓ ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ కాలం జంటలు బ్రేకప్ చెప్పడానికి చిన్న చిన్న విషయాలు కూడా ఎలా కారణమవుతున్నాయో కళ్లకు కట్టే ఓ డిఫరెంట్ కథల సమాహారం ఇది.
Tue, 04 Feb 202509:39 AM IST
- OTT Valentine's Day Releases: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేమికుల దినోత్సవం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారి కోసం ఓటీటీలోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా రాబోతున్నాయి. మరి అవేంటి? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడాలో తెలుసుకోండి.
Tue, 04 Feb 202509:04 AM IST
Suriya Father: ప్రస్తుతం కోలీవుడ్‌లో స్టార్ హీరోలుగా కొనసాగుతోన్నారు సూర్య, కార్తీ. ఈ హీరోల తండ్రి శివకుమార్ తమిళంలో 1970, 80 దశకంలో అగ్ర నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తమిళంలో 200లకుపైగా సినిమాలు చేశారు. శివకుమార్ నటించిన తమిళ సీరియల్స్ తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్‌గా నిలిచాయి.
Tue, 04 Feb 202508:26 AM IST
- Max OTT Release Date: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరో కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. కిచ్చా సుదీప్ నటించిన మ్యాక్స్ మూవీ గురించే మనం మాట్లాడుకుంటున్నది. ఈ మధ్యే ఉపేంద్ర యూఐ మూవీ విషయంలోనూ ఇవే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Tue, 04 Feb 202508:01 AM IST
- Bunny Vasu About Sai Pallavi Comments On Naga Chaitanya: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. తనకు నాగ చైతన్య నటనలో గట్టి పోటీ ఇస్తున్నట్లు సాయి పల్లవి చెప్పిందని నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..!
Tue, 04 Feb 202507:08 AM IST
- Game Changer OTT Release Date Confirmed Official: ఓటీటీలోకి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మరో మూడు రోజుల్లో గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ తాజాగా విడుదల చేసింది.
Tue, 04 Feb 202506:15 AM IST
Horror OTT: తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ బ్లాక్ తెలుగులో రిలీజైంది. డార్క్ పేరుతో డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సైన్స్‌ఫిక్షన్ హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో జీవా, ప్రియా భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Tue, 04 Feb 202506:03 AM IST
- Kobali OTT Streaming Today With Revenge Crime Thriller Genre: ఓటీటీలోకి ఇవాళ తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోబలి వచ్చేసింది. టాలీవుడ్ పాపులర్ నటుడు రవి ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ రస్టిక్ రివేంజ్ థ్రిల్లర్ తెలుగుతో సహా 7 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
Tue, 04 Feb 202505:05 AM IST
- Director Vinod Kumar Vijayan About Fahadh Faasil Debut: పుష్ప ది రైజ్, పుష్ప 2 ది రూల్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌ను తానే ఇండస్ట్రీకి పరిచయం చేశానని తెలిపారు దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్. సాయిరామ్ శంకర్ ఒక పథకం ప్రకారం ప్రమోషన్స్‌లో డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
Tue, 04 Feb 202503:54 AM IST
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 4 ఎపిసోడ్‌లో ధీరజ్‌ను చంపాలని చూసిన విశ్వకు రామరాజు వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి నా కొడుకు జోలికి వస్తే ముక్కలుగా నరికేస్తానని వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు చందు లవ్‌స్టోరీని భద్రావతి భయపెడుతుంది.
Tue, 04 Feb 202503:00 AM IST
- OTT Movies This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 36 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో తెలుగులో 18 అందుబాటులో ఉన్నాయి. అయితే, అన్నింటిలో మొత్తంగా చూసేందుకు స్పెషల్‌గా 11 సినిమాలు మాత్రమే ఉన్నాయి. అవన్నీ క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా జోనర్స్‌లో ఓటీటీ రిలీజ్ కానున్నాయి.
Tue, 04 Feb 202502:22 AM IST
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 ఫిబ్రవరి 4 ఎపిసోడ్‌లో శౌర్య ఆపరేషన్‌కు కార్తీక్ పేరుతో కావేరి డబ్బు కడుతుంది. ఆ విషయం దీపకు తెలిసిపోతుంది. తాను డబ్బులు కట్టిన విషయం ఎట్టి పరిస్థితుల్లో కార్తీక్‌కు చెప్పవద్దని దీపతో కావేరి అంటుంది.
Tue, 04 Feb 202502:11 AM IST
- Brahmamudi Serial February 4th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 4 ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. రాజ్ దగ్గర ఉన్న రెండు కోట్ల గురించి రుద్రాణి షేర్స్ మార్కెట్ అనే గ్యాంబ్లింగ్ల్ ప్లాన్ వేసి ఎమోషనల్ డ్రామా చేస్తుంది. తర్వాత రాహుల్‌తో రాజ్ దగ్గర ఉన్న 2 కోట్లను దొంగతనం చేయిస్తుంది.
Tue, 04 Feb 202501:04 AM IST
- Producer Bunny Vasu About Thandel Story And Word: నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్‌గా మరోసారి జత కట్టిన సినిమా తండేల్. ఫిబ్రవరి 7న విడుదల కానున్న తండేల్ స్టోరీ, ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది, నాగ చైతన్య నటనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
Tue, 04 Feb 202512:49 AM IST
Game Changer OTT: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అమెజాన్ ప్రైమ్ అప్‌డేట్ ఇచ్చింది. మెగా అన్‌ప్రెడిక్టబుల్ అనౌన్స్‌మెంట్‌ను త్వరలో వెల్లడించనున్నామని అమెజాన్ ప్రైమ్ ఓ ట్వీట్ చేసింది. వాలెంటైన్స్ డే కానుకగా గేమ్ ఛేంజర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.
Tue, 04 Feb 202512:30 AM IST
- NNS 4th February Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (ఫిబ్రవరి 4) ఎపిసోడ్లో మిస్సమ్మకు నిజం తెలిసిపోతుంది. దీంతో మనోహరి, రణ్‌వీర్ లకు వార్నింగ్ ఇస్తుంది. అటు అంజు మెడలో అమర్ చెయిన్ వేస్తాడు.
Tue, 04 Feb 202512:00 AM IST
- Rag Mayur Became Hero And Villain In One Day: ఒకేరోజు హీరోగా, విలన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు సినిమా బండి ఫేమ్ రాగ్ మయూర్. ఒకటి థియేట్రికల్ మూవీ అయితే, మరోటి ఓటీటీ కామెడీ వెబ్ సిరీస్‌తో ఈ క్రేజ్ సంపాదించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..!