Telugu Cinema News Live February 17, 2025: Laila Box Office Collection: డిజాస్టర్‌గా మిగిలిపోయిన విశ్వక్ సేన్ లైలా.. ఫస్ట్ వీకెండ్ దారుణమైన కలెక్షన్లు
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Mon, 17 Feb 202504:31 PM IST
- Laila Box Office Collection: విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. అతని కెరీర్లోనే అతిపెద్ద బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది.
Mon, 17 Feb 202503:01 PM IST
- Zee Telugu Shooting Live: ఓ సినిమా షూటింగ్ ను లైవ్ లో చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వాళ్ల కోసం జీ తెలుగు ఓ వినూత్న ప్రయోగం చేయబోతోంది. మజాకా మూవీ పాట షూటింగ్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది.
Mon, 17 Feb 202501:57 PM IST
- ETV Win OTT: ఈటీవీ విన్ ఓటీటీ ఇప్పుడు పిల్లలను ఆకర్షించే పనిలో పడింది. త్వరలోనే ఈ ఓటీటీలో పాపులర్ కార్టూన్ షోలు రాబోతున్నాయి. ఒకేసారి ఐదు షోలను స్ట్రీమింగ్ చేయనున్నారు.
Mon, 17 Feb 202512:27 PM IST
- Vijay Deverakonda Maha Kumbh: మహా కుంభమేళాకు వెళ్లాడు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. అక్కడి త్రివేణీ సంగమంలో స్నానం చేశాడు. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు.
Mon, 17 Feb 202510:49 AM IST
- Jaali Reddy Wedding: పుష్ప మూవీలో జాలిరెడ్డి అనే క్రూరమైన విలన్ గా కనిపించిన కన్నడ నటుడు రియల్ లైఫ్ లో చేసిన ఓ పని ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మధ్య పెళ్లి చేసుకున్న అతడు తన భార్య కాళ్లు మొక్కుతున్న వీడియో అది.
Mon, 17 Feb 202510:35 AM IST
- OTT Web Series: జిడ్డీ గర్ల్స్ వెబ్ సిరీస్ వస్తోంది. అడల్ట్ డ్రామా సిరీస్‍గా ఉండనుంది. ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. స్ట్రీమింగ్ డేట్ కూడా రివీల్ అయింది.
Mon, 17 Feb 202509:55 AM IST
- OTT Telugu Comedy Movie: ఓటీటీలో ఇప్పుడో తెలుగు కామెడీ డ్రామా దుమ్ము రేపుతోంది. హెబ్బా పటేల్ నటించిన ఈ సినిమా రెండు వారాల కిందట అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది.
Mon, 17 Feb 202509:43 AM IST
- India vs Pakistan - Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్ టికెట్ ధరలు బ్లాక్ మార్కెట్ సైట్లలో ఆకాశాన్ని అంటుతున్నాయి.
Mon, 17 Feb 202508:57 AM IST
Comedy OTT:తంగలాన్ డైరెక్టర్ పా రంజిత్ నిర్మించిన తమిళ కామెడీ డ్రామా మూవీ బాటిల్ రాధ ఓటీటీలోకి రాబోతుంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాలో గురు సోమసుందరం, సంచన నటరాజన్ కీలక పాత్రలు పోషించారు.
Mon, 17 Feb 202508:49 AM IST
- Urvashi Rautela - Daaku Maharaj OTT: డాకు మహారాజ్ ఓటీటీ డేట్ వచ్చేసింది. దీనికోసం ఓ పోస్టర్‌ను కూడా ఓటీటీ ప్లాట్‍ఫామ్ రివీల్ చేసింది. ఇందులో ఈ మూవీలో లీడ్ రోల్స్ చేసిన అందరూ ఉండగా.. ఊర్వశి రౌతేలా మిస్ అయ్యారు.
Mon, 17 Feb 202507:58 AM IST
Naari Movie: సీనియర్ హీరోయిన్ ఆమని ప్రధాన పాత్రలో నటిస్తోన్ననారి మూవీ నుంచి నిషిలో శశిలా అనే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. చిన్మయి శ్రీపాద ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. నారి మూవీని ఉమెన్స్ డే రోజున రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Mon, 17 Feb 202507:34 AM IST
- Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన దిల్‍రూబా నుంచి మరో పాట రెడీ అయింది. అయితే, ఈ సాంగ్ గురించి హీరోయిన్ ఓ ట్వీట్ చేశారు. దీనికి కిరణ్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు.
Mon, 17 Feb 202506:41 AM IST
- NNS 17th February Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (ఫిబ్రవరి 17) ఎపిసోడ్లో గుడిలో అనామికను చూసి షాక్ తింటారు అమర్, భాగీ. దీంతో అరుంధతి తన ఇంటికే రాబోతోందన్న ఆసక్తి నెలకొంది.
Mon, 17 Feb 202506:25 AM IST
రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో హోమ్‌టౌన్ పేరుతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. ఆహా ఓటీటీలో త్వరలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఓటీటీలో సుమ కనకాల సెలిబ్రిటీ కుకరీ షో చేయబోతున్నది. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ 4కు సుమ హోస్ట్‌గా వ్యవహరించనుంది.
Mon, 17 Feb 202506:00 AM IST
- OTT Comedy Thriller: నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ మధ్యే ధూమ్ ధామ్ (Dhoom Dhaam) పేరుతో వచ్చిన కామెడీ థ్రిల్లర్ మూవీ చూశారా? ఈ మూవీ ట్విస్టులతోపాటు నవ్విస్తూనే థ్రిల్ పంచే తీరు బాగుంది. ఇప్పటి వరకూ చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి.
Mon, 17 Feb 202505:57 AM IST
- Allu Arjun Trivikram Movie: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‍లో ఓ మూవీ రూపొందనుంది. ఈ ప్రాజెక్టుపై క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ చిత్రంలో ఓ తమిళ నటుడు ఓ పాత్ర పోషించనున్నారంటూ తాజాగా సమాచారం బయటికి వచ్చింది.
Mon, 17 Feb 202505:21 AM IST
టాలీవుడ్ కమెడియన్ ధన్‌రాజ్ రామం రాఘవం మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీలో సముద్రఖనితో పాటు ధన్‌రాజ్ కీలక పాత్రలు పోషించారు.
Mon, 17 Feb 202505:07 AM IST
- Karan Johar - SS Rajamouli: రాజమౌళి సినిమాల్లో లాజిక్‍లు ఎక్కడ ఉంటాయని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ అన్నారు. అయినా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు చాలా సక్సెస్ అవుతున్నాయని, అందుకు కారణమేంటో కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు.
Mon, 17 Feb 202504:19 AM IST
- OTT Action Movies: ఓటీటీల్లో ఇటీవల కొన్ని యాక్షన్ చిత్రాలు అడుగుపెట్టాయి. ఈ జానర్ చిత్రాలు ఇష్టపడే వారిని మెప్పిస్తాయి. అలా లేటెస్ట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన నాలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Mon, 17 Feb 202503:50 AM IST
Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 17 ఎపిసోడ్‌లో మౌనిక చేత సంజు జాబ్ మానేయించాడని బాలు అనుమానపడతాడు. నిజం తెలుసుకోవడానికి సంజు ఇంటికి బయలుదేరుతాడు. కానీ మౌనికనే సడెన్‌గా పుట్టింటికి వస్తుంది. సంజు తనను బాగా చూసుకుంటున్నాడని అబద్ధం చెబుతుంది
Mon, 17 Feb 202502:47 AM IST
- Producer SKN on Telugu Heroins: నిర్మాత ఎస్‍కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు వచ్చిన అమ్మాయిలకు ఇవి అవకాశం ఇవ్వకూడదని అనుకుంటున్నామని మాట్లాడారు. మరిన్ని కామెంట్లు చేశారు. వీటిపై విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇవే..
Mon, 17 Feb 202502:18 AM IST
Brahmamudi February 17th Episode:బ్రహ్మముడి ఫిబ్రవరి 17 ఎపిసోడ్‌లో బ్యాంకు అప్పు కుట్ర వెనుక అనామిక, సామంత్ ఉన్నారనే నిజం తెలుసుకున్న రాజ్ కోపంతో రగిలిపోతాడు. సామంత్ ఇంటికెళ్లి అతడిని చితక్కొడతాడు. అడ్చొచ్చిన అనామిక చెంపలు కావ్య వాయిస్తుంది.
Mon, 17 Feb 202501:52 AM IST
- Karthika Deepam Serial Today Episode February 17: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో కొత్త టిఫిన్ బండిని దీప కొంటుంది. అయితే, శౌర్యపై ఒట్టు వేయించి మరీ కార్తీక్ దగ్గర ఓ మాట తీసుకుంటుంది. దాసు కోసం హోమం చేయాలని పారిజాతం అనుకుంటే అడ్డుపడేందుకు జోత్స్న ప్రయత్నిస్తుంది. పూర్తిగా ఏం జరిగిందంటే..
Mon, 17 Feb 202512:43 AM IST
Bold OTT: ఊర్వశి రౌటేలా హీరోయిన్‌గా నటించిన వర్జిన్ భానుప్రియ అల్ట్రా ప్లే ఓటీటీలో రిలీజైంది. ఈ అడల్ట్ కామెడీ మూవీ ఇప్పటికే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గౌతమ్ గులాటి హీరోగా నటించిన ఈ మూవీకి అజయ్ లోహాన్ దర్శకత్వం వహించాడు.