Telugu Cinema News Live February 11, 2025: Max OTT Release Date: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. సంక్రాంతికి వస్తున్నాం బాటలోనే..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Tue, 11 Feb 202504:08 PM IST
- Max OTT Release Date: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తోంది మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మధ్యే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా ఇలాగే అనౌన్స్ చేయగా.. ఇప్పుడు కిచ్చా సుదీప్ మ్యాక్స్ మూవీ కూడా అదే బాటలో వెళ్లింది.
Tue, 11 Feb 202503:42 PM IST
- Nagarjuna: లవ్ సునామీ పేరుతో హైదరాబాద్ లో జరిగిన తండేల్ మూవీ సక్సెస్ మీట్ లో నాగార్జున, నాగ చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వస్తున్నాం.. కొడుతున్నాం అంటూ ఈ తండ్రీకొడుకులు అనడం విశేషం.
Tue, 11 Feb 202502:36 PM IST
- Malayalam Movie on Youtube: ఓ మలయాళం మూవీ థియేటర్లలో నుంచి నేరుగా యూబ్యూట్ లోకి వచ్చింది. అక్కడ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పేరు పరాక్రమం. మరి ఈ మూవీని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
Tue, 11 Feb 202511:54 AM IST
- OTT Kannada Action Thriller: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత ఓ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు రాబోతోంది. రెండు నెలల కిందటే ఓ ఓటీటీలోకి కన్నడలో వచ్చిన మూవీ.. మరో రెండు రోజుల్లో తెలుగులో రానుండటం విశేషం.
Tue, 11 Feb 202510:25 AM IST
- Crime Thriller Web Series OTT: క్రైమ్ బీట్ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. క్రిమినల్ గురించి వాస్తవాలను బయటపెట్టేందుకు జర్నలిస్టు ప్రయత్నం చుట్టూ ఈ సిరీస్ ఉండనుంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ వివరాలు కూడా వెల్లయడయ్యాయి.
Tue, 11 Feb 202510:15 AM IST
OTT Family Drama: ఓటీటీలో ఇప్పుడో మలయాళం రీమేక్ ఫ్యామిలీ డ్రామా అదరగొడుతోంది. అంతేకాదు గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాగానూ నిలిచింది. జీ5 ఓటీటీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలుస్తుండటం విశేషం.
Tue, 11 Feb 202509:30 AM IST
- Game Changer OTT Trending: గేమ్ ఛేంజర్ చిత్రం ఓటీటీ ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చింది. రామ్‍చరణ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఫస్ట్ ప్లేస్‍లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..
Tue, 11 Feb 202509:05 AM IST
- OTT Thriller Movies: ఓటీటీలోకి ఈ మధ్యే రెండు థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి. అందులో ఒకటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మలయాళం మూవీ కాగా.. మరొకటి సైన్స్ ఫిక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళ సినిమా. వీటిని అస్సలు మిస్ కాకుండా చూడాల్సిందే.
Tue, 11 Feb 202508:22 AM IST
- OTT Bold Web Series: ఓటీటీలోకి మరో బోల్డ్ వెబ్ సిరీస్ వస్తోంది. వాలెంటైన్స్ డే గిఫ్ట్ గా అమ్మాయిలను ఎలా పడేయాలో చెప్పే ప్రొఫెసర్ వస్తున్నాడు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా చూడొచ్చు.
Tue, 11 Feb 202508:15 AM IST
Aishwarya Rajesh: తమిళ సూపర్ హిట్ వెబ్‌సిరీస్ సుడల్‌కు సీజన్ వస్తోంది. సెకండ్ సీజన్ రిలీజ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్‌గా ప్రకటించింది. ఫిబ్రవరి 28 నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది.
Tue, 11 Feb 202508:07 AM IST
- Bujji Thalli Song Sad Versions Lyrics: తండేల్ మూవీలో బుజ్జి తల్లి పాటకు సాడ్ వెర్షన్ కూడా ఉంది. థియేటర్లలో ఈ ఎమోషనల్ సాంగ్ ప్రేక్షకులను టచ్ చేసింది. ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
Tue, 11 Feb 202507:21 AM IST
- OTT Malayalam: రైఫిల్ క్లబ్ అనే చిత్రం ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఈ లో బడ్జెట్ మలయాళ చిత్రం మూడు వారాలుగా ఓటీటీలో టాప్-10లో ట్రెండ్ అవుతూనే ఉంది.
Tue, 11 Feb 202507:20 AM IST
- NNS 11th February Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 11) ఎపిసోడ్లో అనామికగా మారబోతోంది అరుంధతి. చిత్రగుప్తుడు ఇచ్చిన బంపర్ ఆఫర్ కు ఇష్టం లేకపోయినా సరే అంటుంది. అటు మనోహరిపై అమర్ లో అనుమానం పెరుగుతుంది.
Tue, 11 Feb 202507:15 AM IST
Thandel Collections: తండేల్ మూవీ నాగచైతన్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. నాలుగు రోజుల్లో ఈ మూవీకి 73.20 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ పేర్కొన్నారు. వీకెండ్ లోగా వంద కోట్ల మైలురాయిని టచ్ చేస్తుందని పేర్కొన్నారు.
Tue, 11 Feb 202506:21 AM IST
OTT: తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లారాతో పాటు హారర్ సినిమా పార్క్ ఓటీటీలోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలు టెంట్ కోట ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. పార్క్ మూవీలో తమన్‌కుమార్ హీరోగా నటించగా...లారా మూవీలో అశోక్ కుమార్ బాలకృష్ణన్ లీడ్ రోల్ చేశాడు.
Tue, 11 Feb 202505:47 AM IST
- VD12 Title Teaser: వీడీ12 టైటిల్ టీజర్ కోసం ముగ్గురు హీరోలు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని అధికారికంగా వెల్లడైంది. ఇప్పటికే రూమర్లు రాగా.. నేడు అధికారికంగా ఖరారు చేసింది మూవీ టీమ్. ఆ వివరాలు ఇవే..
Tue, 11 Feb 202504:46 AM IST
- Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొత్త వ్యూహాన్ని పాటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని అందరూ ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు ఇవే..
Tue, 11 Feb 202504:40 AM IST
Bigg Boss Utsavam: బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ మళ్లీ ఒకే వేదికపై కలిసి సందడి చేయబోతున్నారు. బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్‌తో స్టార్ మా బిగ్‌బాస్ ఉత్సవం పేరుతో స్పెషల్ షో ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 16న ఈ షో టెలికాస్ట్ కాబోతోంది. బిగ్‌బాస్ ఉత్సవం ప్రోమోను రిలీజ్ చేసింది.
Tue, 11 Feb 202504:01 AM IST
- OTT Today: నేడు ఓటీటీల్లో రెండు చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. నిత్యా మీనన్ నటించిన ఓ తమిళ మూవీ నేడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఓ హిందీ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ రెండు సినిమాలు ఏవి.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు వచ్చాయంటే..
Tue, 11 Feb 202503:43 AM IST
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 11 ఎపిసోడ్‌లో తాను పుట్టింటికి వెళుతున్నట్లు సాగర్‌తో చెబుతుంది నర్మద. భార్య మాటలు వినగానే సాగర్ షాకవుతాడు. తాను తప్పు చేశానని ఒప్పుకొని నర్మదకు క్షమాపణలు చెబుతాడు. ధీరజ్‌తో పాటు ప్రేమ చదువు మానేయాలని నిర్ణయించుకుంటారు.
Tue, 11 Feb 202503:08 AM IST
- Bollywood: బాలీవుడ్ సీనియర్ హీరో సంజత్ దత్‍కు ఓ మహిళ ఏకంగా రూ.72కోట్ల ఆస్తి ఇచ్చారు. చనిపోతూ ఆయనకు ఆ ఆస్తి చెందాలని రాశారు. దీనిపై సంజయ్ దత్ కూడా స్పందించారు.
Tue, 11 Feb 202502:07 AM IST
Brahmamudi: బ్రహ్మముడి ఫిబ్రవరి 11 ఎపిసోడ్‌లో రాజ్, కావ్య కలిసి వంద కోట్లు అప్పు చేశారని దుగ్గిరాల కుటుంబసభ్యుల ముందు వాళ్లను ఇరికిస్తుంది అనామిక. బ్యాంకు నోటీసు పేపర్లు చూపిస్తుంది. మరోవైపు గడువులోపు అప్పు తీర్చకపోవడంతో దుగ్గిరాల ఆస్తులను జప్తు చేయడానికి బ్యాంకు వాళ్లు వస్తారు.
Tue, 11 Feb 202501:50 AM IST
- Karthika Deepam 2 Serial Today Episode February 11: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు ఇచ్చింది కావేరి అనే నిజాన్ని బయటపెట్టేశాడు శ్రీధర్. ఈ క్రమంలో కార్తీక్‍ను బాధపెట్టేలా చాలా మాటలు అంటాడు. దీపపై కూడా కోపం రగిలేలా చేస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Tue, 11 Feb 202512:36 AM IST
Romantic Action OTT: తెలుగు రొమాంటిక్ యాక్షన్ మూవీ రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి మూవీ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు మూవీలో రవితేజ నున్నా, నేహా జురేల్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Tue, 11 Feb 202512:00 AM IST
- OTT Movies This Week In Telugu: ఓటీటీలోకి ఈ వాలంటైన్స్ వారంలో 21 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 9 స్పెషల్‌గా ఉంటే.. 4 మాత్రం తెలుగులో ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా, సోనీ లివ్, హోయ్‌చోయ్, లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.