Telugu Cinema News Live December 6, 2024: Allu Arjun: పుష్ప 2 ప్రీమియర్ వద్ద రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్.. ఆర్థిక సాయం కూడా ప్రకటన
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Fri, 06 Dec 202404:31 PM IST
Pushpa 2: పుష్ప 2 ప్రీమియర్ చూసేందుకు అల్లు అర్జున్ సడన్‌గా సంధ్య థియేటర్ వద్దకి బుధవారం రాత్రి వచ్చారు. దాంతో అప్పటికే అక్కడ ఉన్న అభిమానులు ఒక్కసారిగా అల్లు అర్జున్‌ను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో..?
Fri, 06 Dec 202402:20 PM IST
Kanguva OTT release: సూర్య నటించిన కంగువా సినిమా రూ.2 వేల కోట్లు వసూలు చేస్తుందని ప్రొడ్యూసర్ గర్వంగా చెప్పాడు. కానీ.. అతను అంచనా వేసిన వసూళ్లలో కనీసం 10 శాతం కూడా ఈ మూవీ రాబట్టలేకపోయింది .
Fri, 06 Dec 202401:15 PM IST
Pushpa 2 Day 1 collections: భారత సినీ చరిత్రలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ ఇప్పటి వరకూ ఆర్ఆర్‌ఆర్ సినిమా పేరిట ఉండగా.. అల్లు అర్జున్ పుష్ప 2 ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసేసింది.
Fri, 06 Dec 202411:40 AM IST
Allu Arjun Fans: పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో విడుదలైంది. మూడేళ్ల నుంచి ఈ సినిమా కోసం ఎదురుచూసిన అభిమానులు..?
Fri, 06 Dec 202410:10 AM IST
Naga Chaitanya Sobhita Dhulipala post wedding: రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల బుధవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి తొలిసారి గుడికి వెళ్లారు.
Fri, 06 Dec 202410:00 AM IST
- Allu Arjun All Movies Budget And Collection Over Pushpa 2: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ అన్ని సినిమాల బడ్డెట్, కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.
Fri, 06 Dec 202409:04 AM IST
Action Thriller OTT: మార్టిన్ మూవీ తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా తెలుగులో మరో ఓటీటీలోకి ఈ మూవీ వచ్చింది. శుక్రవారం ఆహా ఓటీటీలో మార్టిన్ రిలీజైంది. ధృవ్ సర్జా హీరోగా నటించిన ఈ మూవీ ఈ ఏడాది కన్నడంలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.
Fri, 06 Dec 202409:02 AM IST
Pushpa 2 background music: పుష్ప 2 బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రీ క్లైమాక్స్‌లో అల్లు అర్జున్ నటనకి బీజీఎం మరింత బలం చేకూర్చిందని కితాబులు వస్తున్నాయి. దాంతో.. ?
Fri, 06 Dec 202408:15 AM IST
- Nindu Noorella Saavasam December 6th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 6 ఎపిసోడ్‌లో యముడు, చిత్రగుప్త మాటలు విన్న అరుంధతి ఏమైందో చెప్పమని ఒట్టు వేయించుకుంటుంది. దాంతో పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని, ఏం చేయలేని పరిస్థితి అని గుప్త నిజం చెబుతాడు. ఏదోటి చేయమని, తాను యమలోకానికి వస్తానంటుంది.
Fri, 06 Dec 202408:13 AM IST
Small Budget Movies: ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిన్న సినిమాలు వండర్స్ క్రియేట్ చేశాయి. కంటెంట్‌ను నమ్మి తెరకెక్కిన లిమిటెడ్ బడ్జెట్ మూవీస్ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించాయి. పెట్టిన పెట్టుబడికి రెండు, మూడింతల లాభాలను తెచ్చిపెట్టాయి.
Fri, 06 Dec 202407:45 AM IST
- Bigg Boss Telugu 8 December 6 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8లో మరోసారి నిఖిల్, గౌతమ్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. దీనికి సంబంధంచిన బిగ్ బాస్ 8 తెలుగు డిసెంబర్ 6 ఎపిసోడ్ ప్రోమో వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఓట్ అప్పీల్ టాస్క్ జరిగే క్రమంలో నిఖిల్, గౌతమ్‌కు పెద్ద వాగ్వాదం జరిగింది.
Fri, 06 Dec 202406:57 AM IST
- Producer Bellamkonda Suresh On Boyapati Srinu: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఓ స్టార్ నిర్మాత కథ నచ్చి, బ్లాంక్ చెక్ ఇచ్చారని ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత బెల్లంకొండ సురేష్. డిసెంబర్ 5న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
Fri, 06 Dec 202406:22 AM IST
Telugu Serials: తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో స్టార్ మా సీరియల్స్ అదరగొట్టాయి. కార్తీక దీపం 2 మిగిలిన సీరియల్స్‌కు అందనంత ఎత్తులో నిలిచింది.11.96 రేటింగ్‌ను దక్కించుకుంది. జీ తెలుగు సీరియల్స్‌లో మేఘ సందేశం టాప్ ప్లేస్‌లో నిలిచింది.
Fri, 06 Dec 202406:09 AM IST
- Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు నుంచి 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో 12 చాలా స్పెషల్‌గా ఉంటే, అందులో కేవలం ఐదు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవన్నీ హారర్, క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ మూవీస్‌గా ఉన్నాయి.
Fri, 06 Dec 202405:22 AM IST
AHA OTT: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన చిన్న సినిమా నరుడి బ్రతుకు నటన శుక్రవారం ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డ్రామా థ్రిల్లర్ మూవీలో శివ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న హీరోలుగా కనిపించారు.
Fri, 06 Dec 202405:00 AM IST
- Deepak Saroj Comments In New Movie Launch: సిద్ధార్థ్ రాయ్ వంటి బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీతో అలరించిన యంగ్ హీరో దీపక్ సరోజ్ చేస్తున్న మరొ కొత్త సినిమా ప్రారంభమైంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవంలో దీపక్ సరోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Fri, 06 Dec 202403:18 AM IST
Pushpa 2 The Rule Day 1 Worldwide Box Office Collection: పుష్ప 2 ది రూల్ ఇండియా బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా రికార్డ్ కొట్టనుందని ట్రేడ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టనుందని, రాజమౌళి సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Fri, 06 Dec 202403:10 AM IST
Trinayani Serial: జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్ రన్నింగ్ తెలుగు టీవీ సీరియల్ త్రినయనికి త్వరలోనే ఎండ్ కార్డ్ పడబోతుంది. ఈ నెల 21తో ఈ సీరియల్ ముగియబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీరియల్‌లో ఆషికా పదుకొణే, చందు గౌడ కీలక పాత్రల్లో నటించారు.
Fri, 06 Dec 202402:20 AM IST
- Brahmamudi Serial December 6th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 6 ఎపిసోడ్‌లో సీతారామయ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉంటుంది. కావ్యను పిలిచి తన ఆఖరి కోరిక అని మాట తీసుకుంటాడు. మరోవైపు అప్పు ఎస్సై ట్రెనింగ్‌కు సెలెక్ట్ అయినట్లు లెటర్ వస్తుంది. ఆ సంతోషంతో పోలీస్ పెళ్లాం, పాటల మొగుడు అని అంటుంది.
Fri, 06 Dec 202402:10 AM IST
- Karthika Deepam 2 Today Episode December 6: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. యాక్సిడెంట్ గురించి జ్యోత్స్నకు పశ్నలు వేస్తాడు శివన్నారాయణ. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళతాడు.
Fri, 06 Dec 202402:00 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు డిసెంబర్ 6 ఎపిసోడ్‌లో తన ఆపరేషన్ కోసం బాలు కారు అమ్మేసి క్లీనర్‌గా జాబ్ చేస్తూ అవమానాలు పడటం సత్యం సహించలేకపోతాడు. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి బాలు కారును అతడికి తిరిగి ఇవ్వాలని అనుకుంటాడు. ప్రభావతి అందుకు ఒప్పుకోదు...
Fri, 06 Dec 202412:58 AM IST
- Bigg Boss Telugu 8 December 5th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ రేస్‌లో నిఖిల్‌తోపాటు గౌతమ్ కూడా ఉన్నాడు. అయితే, మొదటి నుంచి గౌతమ్ విషయంలో బిగ్ బాస్ 8 తెలుగు టీమ్ అన్యాయం చేస్తోందని తెలుస్తోంది. దాంతో గౌతమ్‌కు అసలైన శత్రువుగా బీబీ టీమ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
Fri, 06 Dec 202412:29 AM IST
OTT Telugu: తెలుగు బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటిస్తోన్న లీలా వినోదం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. డిసెంబర్ 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. విలన్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మలయాళ నటి అనఘా అజిత్ హీరోయిన్‌గా నటిస్తోంది.