Telugu Cinema News Live December 31, 2024: Anurag Kashyap: బాలీవుడ్ పుష్పలాంటి సినిమా తీయలేదు.. ముంబై వదిలి సౌత్‌కి వెళ్లిపోతున్నా: డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Tue, 31 Dec 202403:37 PM IST
- Anurag Kashyap: బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక సౌత్ ఇండస్ట్రీలోనే నటించడానికి తాను ముంబైని వదిలేస్తున్నానని చెప్పాడు. బాలీవుడ్ ఎప్పటికీ బాగుపడదు అని, పుష్పలాంటి సినిమా కూడా తీయలేదని అతడు అనడం గమనార్హం.
Tue, 31 Dec 202402:47 PM IST
- ETV Win Web Series: ఈటీవీ విన్ ఓటీటీ మరో ఒరిజినల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుందంటూ.. టీజర్ రిలీజ్ విషయాన్ని వెల్లడించింది. ఇది కూడా యువతను ఆకట్టుకునేలా నేటితరం ర్యాంకర్స్ చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది.
Tue, 31 Dec 202412:34 PM IST
- OTT Romantic Comedy: సిద్ధార్థ్ నటించిన మిస్‍యూ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఏదో సమాచారం బయటికి వచ్చింది. స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
Tue, 31 Dec 202411:15 AM IST
- Sankranthi Movies Ticket Prices: సంక్రాంతి సినిమాల టికెట్ల ధరలను భారీగా పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఒక్కో సినిమాకు ఒక్కోలా టికెట్ల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.
Tue, 31 Dec 202410:37 AM IST
- Prabhas: డ్రగ్స్ నిర్మూలన కోసం ఓ అవగాహన వీడియో చేశారు ప్రభాస్. డ్రగ్స్ వద్దంటూ సందేశం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు ఈ వీడియో చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Tue, 31 Dec 202409:51 AM IST
- Biggest Box-office Disasters 2024: ఈ ఏడాది రెండు సినిమాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రెండు చిత్రాలు తలా రూ.200కోట్లకుపైగా లాస్ అయ్యాయి. ఆ వివరాలు ఇవే..
Tue, 31 Dec 202409:05 AM IST
- Naga Vamsi: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నాగ వంశీపై మండిపడ్డాడు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా. సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో అతడు మాట్లాడిన విధానాన్ని తప్పుబడుతూ సంజయ్ ట్వీట్ చేశాడు. ఎవరీ చండాలమైన వ్యక్తి అంటూ తీవ్రంగా స్పందించాడు.
Tue, 31 Dec 202408:59 AM IST
- Janhvi Kapoor: బ్లాక్బస్టర్ అయిన తమిళ మూవీని ఓటీటీలో ఆలస్యంగా చూశారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. హార్ట్ బ్రేకింగ్ చిత్రం అంటూ రివ్యూతో ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇవే..
Tue, 31 Dec 202408:39 AM IST
OTT Horror: తమిళ్ హారర్ మూవీ ఆరగన్ ఓటీటీలోకి వస్తోంది. జనవరి 3 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ హారర్ మూవీలో మైఖేల్ తంగదురై, కవిప్రియ మనోహరన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.4 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
Tue, 31 Dec 202408:10 AM IST
- OTT Malayalam Movie: ఓటీటీలోకి 9 నెలల తర్వాత ఓ హిట్ మలయాళం కామెడీ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 26న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మొత్తానికి మంగళవారం (డిసెంబర్ 31) డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం.
Tue, 31 Dec 202407:43 AM IST
Brahmaji: లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తోన్నాడు బ్రహ్మాజీ. బాపు పేరుతో ఓ డార్క్ కామెడీ మూవీ చేస్తోన్నాడు. బాపు మూవీ ఫస్ట్ లుక్‌ను ఇటీవల రానా రిలీజ్ చేశాడు. దయా దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తోన్నారు.
Tue, 31 Dec 202407:14 AM IST
- Unstoppable 4 OTT: బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‍స్టాపబుల్ 4 టాక్ షోకు రామ్‍చరణ్ వచ్చారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ నేడు జరిగింది. చెర్రీని ఆహ్వానిస్తూ కాస్త ఆట పట్టించారు బాలయ్య. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tue, 31 Dec 202407:04 AM IST
అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొడ్యూసర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. షేరింగ్ బేసిస్ మీద రిలీజ్ చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు చెల్లించే రెవెన్యూలో భారీగా కోత పెట్టింది. గంటకు నాలుగు రూపాయల నుంచి రెండు రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
Tue, 31 Dec 202406:25 AM IST
- OTT Top Movies December: డిసెంబర్‌లో చాలా సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ హిట్స్ ఉంటే.. మరికొన్ని డిజాస్టర్లు కూడా అడుగుపెట్టాయి. ఓ పాపులర్ సిరీస్ రెండో సీజన్ కూడా వచ్చింది. ఈనెలలో ఓటీటీల్లో టాప్ 7 రిలీజ్‍లు ఏవంటే..
Tue, 31 Dec 202405:29 AM IST
Malayalam OTT: ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో మూవీ మలయాళంలో వంద కోట్ల వసూళ్లను రాబట్టింది. ఏ రేటింగ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న మలయాళం మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది.
Tue, 31 Dec 202404:19 AM IST
- OTT Evergreen Telugu movies: ప్రత్యేకమైన సందర్భాల్లో ఫ్యామిలీ, స్నేహితులతో ఎవర్‌గ్రీన్ సినిమాలు చూడాలని చాలా మంది అనుకుంటారు. సరదా సినిమాలను ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ న్యూఇయర్ కోసం కూడా ఆలోచిస్తుంటే.. ఈ పది చిత్రాలు బెస్ట్ ఆప్షన్స్. అవేవంటే..
Tue, 31 Dec 202403:30 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 31 ఎపిసోడ్‌లో మౌనిక పెళ్లి ఆపేందుకు సంజును కిడ్నాప్ చేస్తాడు బాలు. కారు డిక్కీలో అతడిని దాచేసి ఫామ్‌హౌజ్ నుంచి జంప్ అవుతాడు. మీనాకు చెప్పే బాలు ఈ కిడ్నాప్ చేశాడని కోడలిపై ప్రభావతి చిందులు తొక్కుతుంది.
Tue, 31 Dec 202402:48 AM IST
- Naga Vamsi to Boney Kapoor: హిందీ నిర్మాత బోనీ కపూర్ ముందే బాలీవుడ్‍ను విమర్శించారు నాగవంశీ. వారి ఫిల్మ్ మేకింగ్‍ను ప్రశ్నించారు. బడా ప్రొడ్యూజర్ ముందే హిందీ సినిమాలను ఏకేశారు. ఇది ఇప్పుడు వైరల్‍గా మారింది.
Tue, 31 Dec 202402:09 AM IST
- Karthika Deepam 2 Today Episode December 31: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. అవమానించేందుకు ప్రయత్నించిన జ్యోత్స్న దీప దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సుమిత్ర కూడా జోపై మళ్లీ ఆగ్రహిస్తుంది. నిజం చెప్పేస్తానంటూ దాసు కూడా సిద్ధమవుతాడు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
Tue, 31 Dec 202401:58 AM IST
Brahmamudi December 31st Episode: బ్రహ్మముడి డిసెంబర్ 31 ఎపిసోడ్‌లో ఓ కాంట్రాక్ట్ వర్క్ పూర్తిచేయడానికి ఐదు కోట్లు డబ్బు అవసరం కావడంతో రాజ్ తెగ టెన్షన్ పడతాడు. కానీ కావ్య తెలివిగా అడ్వాన్స్ రూపంలో ఆ డబ్బు వచ్చేలా చేస్తుంది. ఆనందం పట్టలేక కావ్యను ఎత్తుకొని గిరగిర తిప్పేస్తాడు రాజ్.
Tue, 31 Dec 202412:30 AM IST
- NNS 31st December Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (డిసెంబర్ 31) ఎపిసోడ్లో హాల్లో అరుంధతి ఫొటోను పెట్టకుండా ఆపుతుంది మనోహరి. మరోవైపు ఆరు అస్థికలు మనోహరికి దొరకకుండా కొత్త ప్లాన్ వేస్తుంది మిస్సమ్మ.
Tue, 31 Dec 202412:27 AM IST
Mura Review: మలయాళం మూవీ మురా తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు, హ్రిదూ హరున్ కీలక పాత్రల్లో నటించారు.
Tue, 31 Dec 202412:00 AM IST
- OTT Movies Telugu To Watch This 31st December: ఓటీటీలో ఉన్న ఎన్నో సినిమాల్లో ఈ డిసెంబర్ 31కి బెస్ట్ మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ తెలుగు చిత్రాలు మంచి ఆప్షన్. డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కిన ఈ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్ మాత్రం కామన్‌గా ఉంది. ఇవన్నీ ఒక్క ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.