Telugu Cinema News Live December 30, 2024: Squid Game 2: చరిత్ర సృష్టించిన కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్అందుబాటులో ఉన్న ప్రతి దేశంలోనూ టాప్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Mon, 30 Dec 202404:07 PM IST
- Squid Game 2: కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 (Squid Game 2) చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో ఉన్న మొత్తం 93 దేశాల్లోనూ ఈ వెబ్ సిరీసే టాప్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.
Mon, 30 Dec 202402:26 PM IST
- OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి మరో తెలుగు కామెడీ మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు వస్తోంది. కథా కమామీషు అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని సోమవారం (డిసెంబర్ 30) ఆహా వీడియో తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది.
Mon, 30 Dec 202401:04 PM IST
- Pawan Kalyan on OG: పవన్ కల్యాణ్ ఓజీ, హరి హర వీరమల్లుతోపాటు తన నెక్ట్స్ సినిమాలపై స్పందించాడు. అన్ని మూవీస్ ని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని అతడు స్పష్టం చేశాడు. మీడియాతో మాట్లాడిన అతడు.. అల్లు అర్జున్ ఇష్యూపై కూడా తొలిసారి స్పందించాడు.
Mon, 30 Dec 202412:05 PM IST
- Blockbuster Pongal Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తో సంక్రాంతికే వస్తున్న మూవీ ఇది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన రెండు పాటలూ ఇన్‌స్టాంట్ హిట్ కాగా.. తాజాగా బ్లాక్‌బస్టరు పొంగలు అంటూ మూడో పాట్ కూడా అదిరిపోయే బీట్‌తో ఉర్రూతలూగిస్తోంది.
Mon, 30 Dec 202411:21 AM IST
- OTT Thriller Web Series: థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటే మీకు ఇష్టమా? ఈ ఇయర్ ఎండ్ ను మంచి థ్రిల్ తో ముగించాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను అస్సలు మిస్ కావద్దు. జీ5 ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన వెబ్ సిరీస్ అది.
Mon, 30 Dec 202410:45 AM IST
- OTT Web Series Sequels 2025: కొన్ని వెబ్ సిరీస్‍ల సీక్వెల్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వాటిలో కొన్ని పాపులర్ సిరీస్‍లు సీక్వెల్స్ 2025లో అడుగుపెట్టనున్నాయి. వాటిలో 5 మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ ఏవో ఇక్కడ చూడండి.
Mon, 30 Dec 202410:31 AM IST
Best Actors of 21st century: ఈ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా? 60 మందితో రూపొందిన ఈ జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ యాక్టర్ కు చోటు లభించింది. ది ఇండిపెండెంట్ ఈ జాబితాను తయారు చేసింది.
Mon, 30 Dec 202409:23 AM IST
- OTT: ఈ ఏడాది ఓ బాలీవుడ్ మూవీ అత్యధికంగా ప్రశంసలు పొందింది. రూ.5కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం మామూలు ప్రేక్షకుల నుంచి ప్రముఖుల వరకు చాలా మంది హృదయాలను గెలిచింది. ఓటీటీలోకి వచ్చాక ఈ చిత్రం మరింత ఎక్కువ పాపులర్ అయింది. ఆ వివరాలు ఇవే..
Mon, 30 Dec 202408:49 AM IST
- Salman Khan: సల్మాన్ ఖాన్ తో పెళ్లి, వెడ్డింగ్ కార్డులు కూడా ప్రింటైన విషయం నిజమే అని చెప్పింది టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్లానీ. సోనీలో ప్రసారమయ్యే ఇండియన్ ఐడల్ షోకి వచ్చిన ఆమె.. ఓ కంటెస్టెంట్ అడిగిన ప్రశ్నకు రియాక్ట్ అవుతూ.. ఈ విషయాన్ని కన్ఫమ్ చేసింది.
Mon, 30 Dec 202408:21 AM IST
- Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు వచ్చేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఓకే చెప్పారు. ఈవెంట్ డేట్, వేదికను కూడా మేకర్స్ దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Mon, 30 Dec 202408:14 AM IST
Dil Raju About Game Changer And Chiranjeevi Reaction: రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ తన ఫోన్‌లో ఉందని నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే, చిరంజీవి వాళ్లు సినిమా చూశారని, దానిపై మెగాస్టార్ ఇచ్చిన రియాక్షన్‌ను దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఆయన ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.
Mon, 30 Dec 202407:30 AM IST
The Sabarmati Report OTT Streaming Platform: ఓటీటీలోకి రాశీ ఖన్నా, 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే నటించిన థ్రిల్లర్ డ్రామా మూవీ ది సబర్మతి రిపోర్ట్ స్ట్రీమింగ్ కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన ది సబర్మతి రిపోర్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్, రిలీజ్ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Mon, 30 Dec 202406:27 AM IST
- Nindu Noorella Saavasam December 30th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 30 ఎపిసోడ్‌లో అరుంధతి అస్థికల కోసం వచ్చిన మనోహరిపై అమర్ కోప్పడుతాడు. కానీ, ఏదో కట్టుకథ చెప్పి తప్పించుకుంటుంది మనోహరి. మరోవైపు యముడికి అరుంధతిపై గుప్తా చాడీలు చెబుతుంటాడు. అరుంధతికి ఇన్నాళ్లు దాచిన రహస్యం బయటపడనుందనంటాడు.
Mon, 30 Dec 202405:40 AM IST
- Vishwak Sen As Sonu Model Laila Song Released: విశ్వక్ సేన్ నటించిన కొత్త సినిమా లైలా. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ సోను మోడల్‌గా కనిపించనున్నాడు. తాజాగా లైలా ఫస్ట్ సింగిల్ సోను మోడల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు విశ్వక్ సేన్ లిరిక్స్ రాయడం విశేషం.
Mon, 30 Dec 202405:23 AM IST
- Salaar: ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్‍కు జోడీగా మాళవిక మోహనన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అయితే, ముందు తనకు సలార్ చిత్రంలోనే అవకాశం వచ్చిందని తాజాగా ఆమె వెల్లడించారు. మరిన్ని విషయాలను చెప్పారు.
Mon, 30 Dec 202403:57 AM IST
Gunde Ninda Gudi Gantalu Serial December 30 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 30 ఎపిసోడ్‌లో సంజు ఇంటికి మౌనిక పెళ్లికోసం సత్యం ఫ్యామిలీ అంతా వెళ్తుంది. కారులో నుంచి నమస్తే మామయ్య అంటూ మాస్ ఎంట్రీ ఇస్తాడు బాలు. అది చూసి షాక్ అవుతాడు నీలకంఠం. సంజు దగ్గరికి వెళ్లి బాలు గురించి చెబుతాడు నీలకంఠం.
Mon, 30 Dec 202403:08 AM IST
Gunde Ninda Gudi Gantalu Actress On Directors And Exposing: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో శ్రుతిగా అలరిస్తోంది విహారిక చౌదరి. సీరియల్స్ కంటేముందు పలు సినిమాలు, యూట్యూబ్ వెబ్ సిరీసులు చేసిన విహారిక చౌదరి. ఎమోషనల్ సీన్స్‌లో కూడా డైరెక్టర్స్ నడుము చూపించమంటారు అని కామెంట్స్ చేసింది.
Mon, 30 Dec 202402:55 AM IST
- OTT January 2025 Top Movies: 2025 జనవరిలో కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేయనున్నాయి. వాటిలో టాప్-5 మూవీ ఓటీటీ రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.
Mon, 30 Dec 202402:16 AM IST
- Brahmamudi Serial December 30th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 30 ఎపిసోడ్‌లో రాజ్ కావ్య చేసే పనులకు పొంతన లేకుండా ఉన్నాయని అనుమానించిన రుద్రాణి అసలు ఏం జరుగుతుందో నిజం బయటపెడతానని, నీ హెల్ప్ కావాలని ధాన్యలక్ష్మీతో అంటుంది. మారిపోయావ్, మర్చిపోయావ్, చిన్నిల్లు పెట్టావా అని కల్యాణ్‌ను అంటుంది అప్పు.
Mon, 30 Dec 202401:57 AM IST
- Karthika Deepam Today Episode December 30: కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఎపిసోడ్‍లో.. టిఫిన్ సెంటర్ మొదలెట్టేసింది దీప. లుంగీ కట్టుకొని మాస్ ఎంట్రీ ఇచ్చాడు కార్తీక్. దీపపై మళ్లీ నోరు పారేసుకున్న జ్యోత్స్నపై కౌంటర్లు వేశాడు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
Mon, 30 Dec 202412:50 AM IST
- Nagarjuna Thanks To Prime Minister Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి కింగ్ నాగార్జున థ్యాంక్స్ చెప్పారు. ఐకానిక్ లెజెండ్ అయిన అక్కినేని నాగేశ్వరరావును గౌరవించినందుకు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..