Telugu Cinema News Live December 27, 2024: TV Serial Actor: తెలుగు టీవీ సీరియల్ నటుడు అరెస్ట్.. నటిపై లైంగిక వేధింపులు.. ఆ ఫొటోలు బయటపెడతానంటూ..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Fri, 27 Dec 202404:05 PM IST
TV Serial Actor arrest: తెలుగుతోపాటు కన్నడ టీవీ సీరియల్స్ లో నటించే చరిత్ బాలప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ టీవీ సీరియల్ నటిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణల నేపథ్యంలో అతన్ని శుక్రవారం (డిసెంబర్ 27) బెంగళూరులో అరెస్ట్ చేయడం గమనార్హం.
Fri, 27 Dec 202403:42 PM IST
- SSMB 29 Heroine: మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ఫిమేల్ లీడ్ గా గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంకా చోప్రా అంటూ వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియాలోనే కాదు పాన్ వరల్డ్ లెవెల్లో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఈ కొత్త అప్డేట్ అభిమానులను ఆకర్షిస్తోంది.
Fri, 27 Dec 202401:57 PM IST
- All We Imagine As Light OTT release: ఓ అవార్డు విన్నింగ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. పాయల్ కపాడియా డైరెక్ట్ చేసిన, ఫెస్టివల్ డి కేన్స్ గ్రాండ్ ప్రి అవార్డు గెలిచిన ఈ మూవీ పేరు ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్.
Fri, 27 Dec 202412:27 PM IST
- Allu Arjun: అల్లు అర్జున్ పై టాలీవుడ్ నిర్మాతలు సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ్ తీవ్రంగా మండిపడ్డారు. అతని ఒక్కడి వల్ల ఇండస్ట్రీ మొత్తం సీఎం ముందు తలదించుకోవాల్సి వచ్చిందని వాళ్లు అనడం గమనార్హం. బన్నీ సంధ్య థియేటర్ ఘటన, తర్వాత జరిగిన పరిణామాలపై వాళ్లు మాట్లాడారు.
Fri, 27 Dec 202411:56 AM IST
Drinker Sai Movie Review And Rating In Telugu: టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగు న్యూ మూవీ డ్రింకర్ సాయి. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. బోల్డ్ డైలాగ్స్, రా సీన్స్‌తో సాగే ఈ మూవీ ఎలా ఉందో డ్రింకర్ సాయి రివ్యూలో తెలుసుకుందాం.
Fri, 27 Dec 202410:52 AM IST
- Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. 51వ వారానికిగాను ఈ రేటింగ్స్ ను రిలీజ్ చేయగా.. టాప్ ప్లేస్ కోసం రెండు సీరియల్స్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అటు జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ కూడా మెరుగయ్యాయి.
Fri, 27 Dec 202409:01 AM IST
Squid Game 2 Review: స్క్విడ్ గేమ్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
Fri, 27 Dec 202408:57 AM IST
- Salman Khan: అల్లు అర్జున్, ఆమిర్ ఖాన్ లాంటి వాళ్లు వద్దనుకున్న సినిమా.. సల్మాన్ ఖాన్ కెరీర్లోనే అతిపెద్ద హిట్ గా నిలిచిన విషయం తెలుసా? అంతేకాదు ఈ సినిమాకు కథ అందించింది కూడా మన దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కావడం విశేషం.
Fri, 27 Dec 202408:50 AM IST
- New Year 2025 Special Zee Telugu Serial Chamanthi: న్యూ ఇయర్ 2025 సందర్భంగా రెండు స్పెషల్స్‌తో జీ తెలుగు డబుల్ ధమాకా అందించనుంది. బుల్లితెర ప్రభాకర్ కీలక పాత్రలో నటించిన సరికొత్త సీరియల్ చామంతి న్యూ ఇయర్ రోజునే ప్రారంభం కానుండగా మరో స్పెషల్ ఈవెంట్ ప్రసారం చేయనున్నారు.
Fri, 27 Dec 202407:59 AM IST
- Manmohan Singh Biopic The Accidental Prime Minister OTT: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మూవీ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీ బడ్జెట్, వరల్డ్ వైడ్ కలెక్షన్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరాలపై లుక్కేద్దాం.
Fri, 27 Dec 202407:15 AM IST
Mufasa Collections: వాల్ట్ డిస్నీ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ఫస్ట్ వీక్‌లో 74 కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు మహేష్‌బాబు వాయిస్ ఓవర్ అందించగా...హిందీ వెర్షన్‌కు షారుఖ్‌ఖాన్ గళం అందించారు. వీరిద్దరి క్రేజ్ ఈ మూవీకి కలిసివచ్చింది.
Fri, 27 Dec 202405:58 AM IST
- Bigg Boss Aditya Om Solved Water Problem: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న హీరో ఆదిత్యం ఓం గిరిజనుల నీటి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చాడు. తెలంగాణలోని ఓ గ్రామంలో స్వచ్ఛమైన మంచి నీటిని అందిస్తానని ఆదిత్య ఓం ప్రతిజ్ఞ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Fri, 27 Dec 202405:02 AM IST
- Nindu Noorella Saavasam December 27th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 27 ఎపిసోడ్‌లో అరుంధతి ఫొటోకోసం అమర్ రూమ్‌లో వెతికిన మిస్సమ్మకు దొరకదు. దాంతో అమ్ము దగ్గరికి వెళ్లి అడుగుతుంది. మరోవైపు అరుంధతి అస్థికల కోసం స్మశానంకు వెళ్తుంది మనోహరి. అక్కడికి అమర్, రాథోడ్ వస్తారు.
Fri, 27 Dec 202404:58 AM IST
OTT Thriller: కోలీవుడ్ సీరియల్ కిల్లర్ మూవీ వైట్ రోజ్ ఓటీటీలోకి వచ్చింది. ఆనంది హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో జాంబీరెడ్డి, బస్ స్టాప్, శ్రీదేవి సోడా సెంటర్‌తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది ఆనంది.
Fri, 27 Dec 202403:28 AM IST
- Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తే వాటిలో ఏకంగా 9 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అందులోనూ నాలుగు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవన్నీ హారర్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, ఫ్యామిలీ కామెడీ వంటి అన్ని రకాల జోనర్స్‌లో ఉన్నాయి.
Fri, 27 Dec 202403:19 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 27 ఎపిసోడ్‌లో మౌనిక పెళ్లిని అడ్డుకునేందుకు సంజును కిడ్నాప్ చేయాలని అనుకుంటాడు బాలు. మరోవైపు మౌనిక పెళ్లికి రవి, శృతిని ఆహ్వానిస్తుంది ప్రభావతి. తాము పెళ్లికి రామని అత్తయ్య ముఖం మీదే చెప్పేస్తుంది శృతి.
Fri, 27 Dec 202402:33 AM IST
- Brahmamudi Serial December 27th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 27 ఎపిసోడ్‌లో కావ్య తిట్టడంతో స్వప్న ఫీల్ అవుతుంటే రుద్రాణి, రాహుల్ వెళ్లి పుల్లలు పెట్టేందుకు చూస్తారు. కానీ, వారికి షాక్ ఇస్తుంది. తర్వాత కావ్యకు రివర్స్ అవుతుంది స్వప్న. ఆస్తి రాగానే మారిపోయావని, నిజ స్వరూపం బయటపడిందని స్వప్న అంటుంది.
Fri, 27 Dec 202401:56 AM IST
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం డిసెంబర్ 27 ఎపిసోడ్‌లో తాతయ్య పలుకుబడి ఉపయోగించి కార్తీక్‌కు జాబ్ రాకుండా చేస్తుంది జ్యోత్స్న. కార్తీక్ జాబ్ కోసం వెతుకుతున్నాడని తెలిసిన శ్రీధర్ అతడిని తన ఆఫీస్‌కు పిలిపించుకుంటాడు. తండ్రి జాబ్ ఆఫర్‌ను కార్తీక్ రిజెక్ట్ చేస్తాడు.
Fri, 27 Dec 202401:21 AM IST
- Venkatesh Singing Song For Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ మరోసారి తన గాత్రం వినిపించనున్నాడు. 2017లో వచ్చిన గురు మూవీలో వెంకటేష్ తన గొంతుతో పాట పాడి అలరించాడు. ఇప్పుడు ఏడేళ్లకు మరోసారి సంక్రాంతికి వస్తున్నాంలో స్పెషల్ సాంగ్ పాడి సింగర్‌గా అలరించనున్నాడు.
Fri, 27 Dec 202412:40 AM IST
Comedy Thriller OTT: ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా నటించిన తమిళ కామెడీ మూవీ జాలీ ఓ జింఖానా ఓటీటీలోకి వస్తోంది. ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ బ్లాక్ కామెడీ మూవీలో ప్రభుదేవా హీరోగా నటించాడు.
Fri, 27 Dec 202412:00 AM IST
People Did Strange Things Who Inspired From Movies: ఇటీవల లక్కీ భాస్కర్ మూవీ చూసి నలుగురు విద్యార్థులు హాస్టల్ గోడ దూకి పారిపోయిన విషయం తెలిసిందే. అలా సినిమాలు చూసి మోటివేట్ లేదా ప్రభావితం అయి చేసిన కొన్ని వింత పనులను ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో ఐపీఎస్ అవ్వడం నుంచి బ్యాంక్ దొంగతనం వరకు ఉన్నాయి.