Telugu Cinema News Live December 26, 2024: Max Movie Review: మ్యాక్స్ రివ్యూ - కిచ్చా సుదీప్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 26 Dec 202404:28 PM IST
Max Movie Review: కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మ్యాక్స్ మూవీ క్రిస్మస్ సందర్భంగా తెలుగులో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Thu, 26 Dec 202404:26 PM IST
- Allu Arjun: అల్లు అర్జున్ కు తాను కూడా పెద్ద అభిమానినే అని, అయితే తనను మాత్రం అతనితో పోల్చొద్దని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అనడం గమనార్హం. కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో ఓ కంటెస్టెంట్ ఇద్దరినీ పోలుస్తూ మాట్లాడటంపై బిగ్ బీ ఈ కామెంట్స్ చేశాడు.
Thu, 26 Dec 202403:32 PM IST
- Pushpa 2 Box Office Collection: పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా అత్యంత వేగంగా రూ.1700 కోట్లకుపైగా వసూలు చేసిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.
Thu, 26 Dec 202403:05 PM IST
- OTT Telugu Action Thriller: ఓటీటీలో ఇప్పుడో తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ దూసుకెళ్తోంది. ఈ నెల 20న ఆహా వీడియోలోకి అడుగుపెట్టిన ఆ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. దీంతో ఆరు రోజుల్లోనే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
Thu, 26 Dec 202412:32 PM IST
- Singham Again OTT Release Date: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ భారీ యాక్షన్ మూవీ రాబోతోంది. ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్లతో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 27) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Thu, 26 Dec 202412:00 PM IST
Shraddha Kapoor: బేబీ జాన్ మూవీలో హీరోగా నటించిన వరుణ్ ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్ శ్రద్ధా కపూర్ తనకు ప్రపోజ్ చేసినా తాను రిజెక్ట్ చేశానని, అందుకే తనను ముగ్గురితో కలిసి కొట్టించిందని అతడు చెప్పడం విశేషం.
Thu, 26 Dec 202410:32 AM IST
- OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి నాలుగు నెలల తర్వాత ఓ హిట్ మలయాళం కామెడీ మూవీ వస్తోంది. థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కాగా.. మొత్తానికి శుక్రవారం (డిసెంబర్ 27) ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Thu, 26 Dec 202409:51 AM IST
- Venkatesh Guest To Zee Telugu Sankranthi Event: బుల్లితెర ప్రేక్షకులను స్వయంగా కలిసి సందడి చేసేందుకు హీరో విక్టరీ వెంకటేష్ జీ తెలుగు సంక్రాంతి స్పెషల్ ఈవెంట్‌కు అతిథిగా రానున్నాడు. వెంకటేష్‌తోపాటు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా పాల్గొననున్నారు.
Thu, 26 Dec 202408:41 AM IST
Trinayani Serial: జీ తెలుగులో నాలుగేళ్లుగా టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్ త్రినయనికి ఎండ్ కార్డ్ పడబోతున్నట్లుగా కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Thu, 26 Dec 202408:30 AM IST
- OTT Horror Comedy: ఓటీటీలోకి ఈ ఏడాది లాస్ట్ వీకెండ్ లో ఓ అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమాను రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకుపైగా వసూలు చేసింది.
Thu, 26 Dec 202408:24 AM IST
- Drinker Sai Movie Director Kiran Tirumalasetty: చిన్న సినిమాల వల్లే ఇండస్ట్రీలో మనమంతా బతికేది అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్స్‌గా నటించిన తెలుగు మూవీ డ్రింకర్ సాయికి కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు.
Thu, 26 Dec 202407:41 AM IST
- Suresh Babu About OTTs In CM Revanth Reddy Meeting: అల్లు అర్జున్ పుష్ప 2 సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసు నేపథ్యంలో ఇవాళ (డిసెంబర్ 26) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీలతో సహా ఇతర అంశాలపై సీఎంతో సినీ పెద్దలు చర్చించారు.
Thu, 26 Dec 202406:25 AM IST
Anita Hassanandani Reddy Re Entry In Tollywood: సుమారు 8 ఏళ్ల తర్వాత ఉదయ్ కిరణ్ నువ్వు నేను మూవీ హీరోయిన్ అనిత హస్సానందని రెడ్డి టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే, అప్పటికి ఇప్పటికీ ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. మరి ఆ సినిమా ఏంటీ అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Thu, 26 Dec 202406:05 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరుగుతోన్న ఈ భేటీకి చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్ సహా పలువురు స్టార్ హీరోలు రాలేదు.
Thu, 26 Dec 202405:38 AM IST
- Vishwak Sen Laila Movie First Look Release: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేడి గెటప్పులో కనిపించనున్నాడు. అబ్బాయితోపాటు అమ్మాయి పాత్రలో విశ్వక్ సేన్ నటించనున్న సినిమా లైలా. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లైలా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అయితే, ఓ హిందీ సినిమాకు రీమేక్ లేదా కాపీలా అనిపిస్తోంది.
Thu, 26 Dec 202404:32 AM IST
Romantic Thriller Movie: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఈ మూవీ 4కే వెర్షన్‌ను యూట్యూబ్‌లో చూడొచ్చు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో సంజన ఆనంద్ హీరోయిన్‌గా నటించింది.
Thu, 26 Dec 202403:30 AM IST
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం డిసెంబర్ 26 ఎపిసోడ్‌లో దీప వల్లే కార్తిక్ దరిద్రాన్ని అనుభవిస్తున్నాడని జ్యోత్స్న కోపంతో ర లిగిపోతుంది. కార్తిక్ జీవితంలో నుంచి వెళ్లొపొమ్మని, అవసరమైతే ఎంత డబ్బు అయినా ఇస్తానని దీపకు వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న.
Thu, 26 Dec 202403:08 AM IST
- Rahasyam Idham Jagath OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ తెలుగు సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ రహస్యం ఇదం జగత్ రిలీజ్ అయింది. ఐఎమ్‌డీబీ నుంచి 9.2 రేటింగ్ సాధించిన నేటి నుంచి రహస్యం ఇదం జగత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతా కొత్త వాళ్లతో తెరకెక్కించిన ఈ మూవీని ఏ ఓటీటీలో చూడాలో తెలుసుకుందాం.
Thu, 26 Dec 202402:16 AM IST
Brahmamudi Serial December 26th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 26 ఎపిసోడ్‌లో స్వప్న వచ్చి పది లక్షలతో నెక్లెస్ కొనుక్కున్నట్లు, కావ్య చెక్ ఇచ్చినట్లు రుద్రాణి, ధాన్యలక్ష్మీకి చెబుతుంది. దాంతో కావ్య రాగానే గొడవ చేస్తారు. స్వప్న కావ్య మధ్య గొడవ అవుతుంది. సమాధానం చెప్పాల్సిన అవసరముందని సుభాష్ అంటాడు.
Thu, 26 Dec 202401:48 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు డిసెంబర్ 26 ఎపిసోడ్‌లో సంజుతో మౌనిక పెళ్లిని ఎలాగైనా ఆపాలని బాలు ఫిక్సవుతాడు. తాగొచ్చి సంజు ఇంటి దగ్గర గొడవ చేస్తాడు. అక్కడే ఉన్న సత్యం బాలును కొట్టి అక్కడి నుంచి పంపిచేస్తాడు.
Thu, 26 Dec 202401:07 AM IST
- Dharma About Prabhas Wishes In Drinker Sai Pre Release Event: ప్రభాస్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన కలిశారు. సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా చెప్పారు అని యంగ్ హీరో ధర్మ కామెంట్స్ చేశారు. డ్రింకర్ సాయి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మూవీతోపాటు ప్రభాస్‌పై ఇలా మాట్లాడాడు హీరో ధర్మ.
Thu, 26 Dec 202412:30 AM IST
- NNS 26th December Episode: నిండు నూరేళ్ల సావాసం గురువారం (డిసెంబర్ 26) ఎపిసోడ్లో పక్కింటి అక్కనే ఆరునేమో అని మిస్సమ్మతో అంటాడు రాథోడ్. దీంతో ఆమెలో అనుమానం మొదలవుతుంది. అటు స్వామిజీ ఆశ్రమానికి అమర్ బయలుదేరుతాడు.