Telugu Cinema News Live August 30, 2024: Samantha: తెలంగాణ ప్రభుత్వానికి సమంత రిక్వెస్ట్ ఇదీ.. అలా చేయాలంటూ సలహా.. ఇన్‌స్టా స్టోరీ వైరల్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Fri, 30 Aug 202405:09 PM IST
- Samantha: సమంత రుత్ ప్రభు తెలంగాణ ప్రభుత్వానికి ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ తన రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో సమంత చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందో చూడండి.
Fri, 30 Aug 202403:08 PM IST
- Kangana Ranaut: చంపేస్తామని బెదిరిస్తున్నారని అధికార పార్టీ ఎంపీ, నటి అయిన కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ దేశంలోని పరిస్థితులు చూసి బాధేస్తున్నట్లు ఆమె చెప్పడం గమనార్హం. తన సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ ఇంకా రాకపోవడంపై ఆమె ఇలా స్పందించింది.
Fri, 30 Aug 202401:36 PM IST
- OTT Telugu Thriller Movie: లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీ ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చింది. ఆగస్ట్ 1న రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోనే రెండు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ కు రావడం విశేషం. శుక్రవారం (ఆగస్ట్ 30) నుంచి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Fri, 30 Aug 202401:15 PM IST
- Committee Kurrollu OTT: ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ తెలుగు రూరల్ కామెడీ డ్రామా వచ్చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఈటీవీ విన్ ఓటీటీయే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.
Fri, 30 Aug 202409:09 AM IST
Bad Newz OTT Streaming: ఓటీటీలోకి బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీ బ్యాడ్ న్యూజ్ సడెన్‌గా వచ్చేసింది. యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, అమీ విర్క్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు.
Fri, 30 Aug 202408:49 AM IST
- Mathu Vadalara 2 Teaser: మత్తు వదలరా మూవీకి సీక్వెల్ గా వస్తున్న మత్తు వదలరా 2 టీజర్ శుక్రవారం (ఆగస్ట్ 30) రిలీజైంది. ఈ సినిమా మరింత ఫన్, థ్రిల్ పంచుతూ సాగనున్నట్లు టీజర్ చూస్తేనే స్పష్టమవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
Fri, 30 Aug 202408:18 AM IST
- OTT Action Thriller: ఓటీటీలోకి ఇండియాలోనే మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ శుక్రవారం (ఆగస్ట్ 30) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Fri, 30 Aug 202408:02 AM IST
Salman Khan Rib Injury: సికిందర్ సినిమాలో నటిస్తున్న సల్మాన్ ఖాన్ షూటింగ్‌లో గాయపడ్డాడా? పక్కటెముకల నొప్పితో కనీసం కుర్చీలో నుంచి కూడా లేవడానికి ఇబ్బందిపడుతున్న బాలీవుడ్ కండల వీరుడు. అసలు ఏం జరిగింది?
Fri, 30 Aug 202408:01 AM IST
Biggest Flop Movie In India: అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిస్తే వచ్చే నష్టం, బాధ కానీ మాములుగా ఉండదు. అందుకు ఉదాహరణే 300 కోట్ల బడ్జెట్ మూవీ. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద వచ్చిన కలెక్షన్స్, టాక్ చూసి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అగ్ర హీరో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు.
Fri, 30 Aug 202406:10 AM IST
New OTT Releases Friday: ఓటీటీల్లో శుక్రవారం (ఆగస్ట్ 30) నాడు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 10 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఏకంగా 6 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే వాటిలో రెండు హారర్, అడ్వెంచర్ సినిమాలతోపాటు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఉంది. అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాయంటే..
Fri, 30 Aug 202405:40 AM IST
Prabhas Kalki Sequel: ప్రభాస్ కల్కి మూవీ సీక్వెల్ గురించి ఎట్టకేలకి ఆ సినిమా నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఏడాది జూన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.
Fri, 30 Aug 202404:58 AM IST
Saripodhaa Sanivaaram Day 1 Worldwide Collection: నేచురల్ స్టార్ నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ సరిపోదా శనివారం సినిమా ఆగస్ట్ 29న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దీంతో మూవీకి తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చినట్లు సమాచారం. సరిపోదా శనివారం మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే..
Fri, 30 Aug 202402:50 AM IST
Guppedantha Manasu Serial August 30th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 30వ తేది ఎపిసోడ్‌లో మహేంద్రను కిడ్నాప్ చేస్తాడు శైలేంద్ర. మహేంద్రతో రిషిపై అటాక్ నుంచి జగతిని చంపడం వరకు అన్ని చెబుతాడు. మరోవైపు ఫణీంద్రకు అన్ని నిజాలు చెబుతుంది వసుధార. రిషి, మహేంద్ర వచ్చి సాక్ష్యాలు చూపిస్తారు.
Fri, 30 Aug 202402:37 AM IST
#MeToo ఉద్యమం మాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. సీనియర్ల నుంచి జూనియర్ ఆర్టిస్ట్‌ల వరకు ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని షేర్ చేస్తున్నారు. 32 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ మీడియా ముందుకు వచ్చి అప్పట్లో తాను వేధింపులకి గురైనట్లు చెప్పుకొచ్చింది.
Fri, 30 Aug 202401:47 AM IST
Brahmamudi Serial August 30th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 30వ తేది ఎపిసోడ్‌లో రాహుల్ దొంగబంగారం కొంటున్నట్లు నిరూపిద్దామనుకుంటారు అక్కాచెల్లెళ్లు కావ్య స్వప్న. కానీ, రాహుల్ నిర్దోషి అని తేలుతుంది. కావ్యపై ఫైర్ అయిన రాజ్ ఇంటిని ముక్కలు చేద్దామనుకుంటున్నావా అని మాటలు అంటాడు.
Fri, 30 Aug 202401:28 AM IST
- Karthika deepam 2 serial today august 30th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాశీ దీపతో ముందుగా రాఖీ కట్టించుకున్నాడని తెలిసి జ్యోత్స్న గొడవ చేస్తుంది. ఆ రాఖీ తీసేయమని వాదిస్తుంది. కానీ కార్తీక్ అక్కడే ఉండటంతో చేసేదేమి లేక అయిష్టంగానే రాఖీ కడుతుంది.
Fri, 30 Aug 202401:25 AM IST
Director Om Raut: డైరెక్టర్ ఓం రౌత్‌ను ఆదిపురుష్ చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతున్నాయి. ప్రభాస్‌ను పొగడాలని ప్రయత్నించిన ఓం రౌత్ మళ్లీ ప్రభాస్ ఫ్యాన్స్‌కి అడ్డంగా దొరికిపోయాడు.
Fri, 30 Aug 202412:38 AM IST
Ram Gopal Varma About Udvegam Movie: ఉద్వేగం మూవీ తెలుగు చిత్ర పరిశ్రమలో వండర్ క్రియేట్ చేయనుందని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేశారు. తాజాగా ఉద్వేగం టీజర్‌ను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉద్వేగం సినిమా, టీజర్‌కు సంబంధించిన విశేషాలపై ఆర్జీవీ కామెంట్స్ చేశారు.
Fri, 30 Aug 202412:30 AM IST
Bigg Boss Telugu Winners Remuneration: బిగ్ బాస్ షోకు ఎంత క్రేజ్ ఉంటుందో అందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు వచ్చే రెమ్యునరేషన్, ఫైనల్ విన్నర్స్‌కు అందే పారితోషికం ఎంత అనేది ఎప్పుడూ క్యూరియాసిటీగానే ఉంటుంది. మరి బిగ్ బాస్ ద్వారా లైమ్ లైట్‌లో లేని సెలబ్రిటీలు, సాధారణ వ్యక్తుల దశ మారిపోతుందా?