Telugu Cinema News Live August 19, 2024: Thalapathy Vijay: దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాలు చేస్తాడా? అతడు నవ్వుతూ ఇలా..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Mon, 19 Aug 202405:01 PM IST
- Thalapathy Vijay: దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాడా? లక్షలాది మంది అభిమానులను వేధిస్తున్న ఈ ప్రశ్నకు ది గోట్ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు సమాధానం ఇచ్చాడు. ఇదే ప్రశ్న తాను అడిగితే అతడు నవ్వుతూ ఇలా అన్నాడంటూ విజయ్ చెప్పిన విషయం గుర్తు చేసుకున్నాడు.
Mon, 19 Aug 202404:20 PM IST
- Telugu Suspance Thriller OTT: ఓటీటీలోకి ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే వరుణ్ సందేశ్ నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం. మరి ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
Mon, 19 Aug 202402:07 PM IST
- Pindam TV Premier Date: వణికించే హారర్ మూవీ 9 నెలల తర్వాత టీవీ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు టీవీలోనూ రాబోతోంది. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Mon, 19 Aug 202411:39 AM IST
- Horror Comedy OTT: ఓ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ ఓటీటీలోకి కాకుండా నేరుగా టీవీ ప్రీమియర్ కు సిద్ధమవుతుండటం విశేషం. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే.. మూవీ మాత్రం నేరుగా టీవీ ప్రీమియర్ డేట్ కూడా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది.
Mon, 19 Aug 202410:57 AM IST
Aay 4 Days Worldwide Collection: జూనియర్ ఎన్టీఆర్‌కు వరసకు బావమరిది అయ్యే నార్నే నితిన్ హీరోగా నటించిన సినిమా ఆయ్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలైన ఆయ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ములేపుతోంది. 300 రెట్ల కలెక్షన్స్ పెరిగిన ఆయ్ సినిమాకు 4 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Mon, 19 Aug 202410:27 AM IST
Bigg Boss Sivaji: దాదాపు 19 ఏళ్ల తర్వాత శివాజీ, లయ జోడీ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. వీరిద్దరు హీరోహీరోయిన్లుగా తెలుగులో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఈ సినిమాకు శివాజీ స్వయంగా నిర్మించబోతున్నాడు.
Mon, 19 Aug 202410:23 AM IST
- Spy Thriller OTT: ఓ స్పై థ్రిల్లర్ మూవీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. గతేడాది జియో మామీ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయిన ఈ మూవీ.. థియేటర్లలో రిలీజ్ వద్దనుకొని నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకే రానుండటం విశేషం. మరి ఈ సినిమాను ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
Mon, 19 Aug 202409:24 AM IST
Raghu Thatha OTT: కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ రఘు తాత తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ కామెడీ డ్రామా మూవీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నది. సెప్టెంబర్ 14 నుంచి రఘు తాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చెబుతోన్నారు.
Mon, 19 Aug 202409:20 AM IST
Double Ismart 4 Days Worldwide Collection: రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన కమర్షియల్ యాక్షన్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. కానీ, కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ 4 రోజుల కలెక్షన్స్ ఎంతో చూద్దాం.
Mon, 19 Aug 202408:49 AM IST
- Shraddha Kapoor: ఈ మధ్యే స్త్రీ2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తన ఫస్ట్ క్రష్ గురించి మాట్లాడింది. ఓ హీరోపై మనసు పడి ప్రపోజ్ చేస్తే అతడు రిజెక్ట్ చేశాడని ఆమె చెప్పడం విశేషం. ఇంతకీ ఆ హీరో ఎవరు? శ్రద్ధా ఫస్ట్ లవ్ స్టోరీ కథేంటో చూడండి.
Mon, 19 Aug 202408:31 AM IST
Brahma anandam Glimpse: టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న బ్రహ్మా ఆనందం గ్లింప్స్ సోమవారం రిలీజైంది. ఈ కామెడీ మూవీలో బ్రహ్మానందం, రాజా గౌతమ్ తాతమనవళ్లుగా నటించబోతున్నారు.
Mon, 19 Aug 202408:13 AM IST
- OTT Thriller Web Series: ఓటీటీలోకి ఇప్పుడు మరో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్లేన్ హైజాక్ గా భావించే కాందహార్ హైజాక్ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్ ట్రైలర్ సోమవారం (ఆగస్ట్ 19) రిలీజ్ అయింది.
Mon, 19 Aug 202408:08 AM IST
Anasuya Ari Mangli Chinnari Kittayya Song Release: యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించిన లేటెస్ట్ మూవీ అరి నుంచి ఇటీవల చిన్నారి కిట్టయ్య అనే పాటను విడుదల చేశారు. సింగర్ మంగ్లీ వెర్షన్‌గా రిలీజ్ అయిన ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.
Mon, 19 Aug 202406:54 AM IST
OTT Movies Releases This Week: ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలిపి మొత్తంగా 18 వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కేవలం రెండు మాత్రమే చాలా స్పెషల్ కానున్నాయి. వాటిలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ కూడా ఉంది. దీంతోపాటు మరో 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏ ఓటీటీలో రిలీజ్ కానున్నాయో లుక్కేద్దాం.
Mon, 19 Aug 202406:46 AM IST
Rajinikanth: రజనీకాంత్ వెట్టైయాన్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ సోమవారం అనౌన్స్‌చేశారు. అక్టోబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదేరోజు సూర్య కంగువ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య, రజనీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
Mon, 19 Aug 202405:45 AM IST
Kaalarathri Review: మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ నల్ల నిళవుల రాత్రి...తెలుగులో కాళరాత్రి పేరుతో డబ్ అయ్యింది. డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
Mon, 19 Aug 202405:39 AM IST
Ankith Koyya About Allu Arjun And OLX Ad: అల్లు అర్జున్‌తో ఓఎల్ఎక్స్ యాడ్ చేసినట్లు ఆయ్, మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాల నటుడు అంకిత్ కొయ్య చెప్పాడు. అల్లు ఫ్యామిలీ పుట్టా.. అల్లు అర్జున్ మా అన్నయ్య అని చెప్పే రోల్‌లో తాను నటించినట్లు అంకిత్ కొయ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mon, 19 Aug 202403:19 AM IST
Trending OTT Movies This Week In Netflix: ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోని ఈవారం టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. వీటిలో బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ నుంచి స్పై యాక్షన్ మూవీస్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.
Mon, 19 Aug 202402:57 AM IST
OTT Suspense Thriller: తెలుగు థ్రిల్లర్ మూవీస్ డెడ్‌లైన్, మహిషాసురుడు ఒకే రోజు ఓటీటీలోకి వచ్చాయి. ఎక్స్‌ట్రీమ్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. డెడ్‌లైన్‌లో మూవీలో అజయ్ ఘోష్, అపర్ణ మాలిక్ ప్రధాన పాత్రలు పోషించారు. మహిషాసురుడు మూవీలో రిచా, ధరణి రెడ్డి నటించారు.
Mon, 19 Aug 202402:24 AM IST
Brahmamudi Serial August 19th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 19వ తేది ఎపిసోడ్‌లో రాజ్‌ను కంపెనీ బాధ్యతల నుంచి తప్పించి వాటిని రాహుల్‌కు కట్టబెడతాడు సీతారామయ్య. స్వప్న కోసమే ఇలా చేస్తున్నట్లు సీతారామయ్య చెబుతాడు. మరోవైపు కల్యాణ్ తన మొదటి జీతం అందుకుంటాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్లో..
Mon, 19 Aug 202402:08 AM IST
Guppedantha Manasu August 19th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 19 ఎపిసోడ్‌లో మను, మహేంద్ర తండ్రీకొడుకులు అనే నిజం భర్త రిషికి చెబుతుంది వసుధార. వారి మాటలను చాటి నుంచి మహేంద్ర వింటాడు. రిషి తన కన్నకొడుకు అనే నిజం తెలిసి షాకవుతాడు.
Mon, 19 Aug 202401:35 AM IST
- Karthika deepam 2 serial today august 19th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న ద్వారా దాసును ఇంటికి తీసుకురావాలని పారిజాతం అనుకుంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం దాసు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. తండ్రిని అసహ్యించుకుంటుంది.
Mon, 19 Aug 202401:05 AM IST
Jani Master About Heroes In Felicitation Ceremony: ఇటీవల జరిగిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ దక్కించుకున్న తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైదరాబాద్‌లో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Mon, 19 Aug 202412:43 AM IST
Zee Telugu Serials: సీరియల్ లవర్స్‌కు జీ తెలుగు గుడ్‌న్యూస్ వినిపించింది. ఇకపై తమ ఛానెల్‌లో ఆదివారం కూడా సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయని ప్రకటించింది. టీఆర్‌పీ రేటింగ్ పరంగా టాప్‌లో ఉన్న సీరియల్స్‌ను ఆదివారం కూడా చూడొచ్చని చెప్పింది.