Telugu Cinema News Live August 18, 2024: Indra Re-Release Advance Bookings: చిరంజీవి ఇంద్ర రీరిలీజ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డుల మోత
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 18 Aug 202404:57 PM IST
- Indra Re-Release Advance Bookings: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ రీరిలీజ్ లోనూ రికార్డులు తిరగరాస్తోంది. అతని పుట్టిన రోజు సందర్భంగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
Sun, 18 Aug 202403:26 PM IST
- Lokesh Kanagaraj Aamir Khan Movie: లోకేష్ కనగరాజ్, ఆమిర్ ఖాన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ మధ్య టాప్ బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేస్తున్న క్రమంలో ఓ మంచి హిట్ కోసం చూస్తున్న ఆమిర్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Sun, 18 Aug 202402:53 PM IST
- NNS 19th August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (ఆగస్ట్ 19) ఎపిసోడ్లో అరుంధతికి మిస్సమ్మ వాయనం ఇస్తుంది. పూజ చాలా బాగా జరిగిందంటూ అమర్ కుటుంబం ఆనందంలో ఉంటుంది. అటు మనోహరి ఎలాగైనా అరుంధతి ఆత్మను కనిపెట్టాలని ప్రయత్నిస్తుంది.
Sun, 18 Aug 202412:39 PM IST
Prabhas Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు స్టార్ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ. ఈ సినిమాలో ప్రభాస్ ఓ జోకర్ లా కనిపించాడని అతడు అనడం గమనార్హం. అతన్ని ఎందుకలా చూపించారో అర్థం కావడం లేదని అర్షద్ అన్నాడు.
Sun, 18 Aug 202412:14 PM IST
- OTT Raksha Bandhan Movies: రాఖీ పండుగనాడు ఓటీటీల్లో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు కలిసి చూసేందుకు తెలుగులో చాలా సినిమాలే ఉన్నాయి. పవన్ కల్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాలు రక్షా బంధన్ రోజు చూడదగినవే.
Sun, 18 Aug 202411:34 AM IST
- Thangalaan Box Office Collection: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.50 కోట్లకుపైగా వసూలు చేయడం విశేషం.
Sun, 18 Aug 202410:20 AM IST
- Horror Comedy Movie Box Office: ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజైన హారర్ కామెడీ మూవీ స్త్రీ 2 బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు చేరవవుతున్న ఈ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది.
Sun, 18 Aug 202410:08 AM IST
Ravi Teja: రవితేజ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన నేనింతే మూవీ పదిహేనేళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. త్వరలో ఈ మూవీ రీ రిలీజ్ కాబోతోంది. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా రీ రిలీజ్ కావడం ఆసక్తికరంగా మారింది.
Sun, 18 Aug 202409:15 AM IST
Psychological Thriller OTT:వరలక్షి శరత్ కుమార్ శబరి మూవీ థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత లోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఆహా ఓటీటీలలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీతో అనిల్ కాట్జ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Sun, 18 Aug 202408:49 AM IST
- OTT Survival Thriller Movie: ఓటీటీలోకి ఓ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన ఏడు నెలల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి రావడం విశేషం. నలుగురు మెడికల్ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే సస్పెన్స్ డ్రామా మూవీ ఇది.
Sun, 18 Aug 202408:37 AM IST
Sunny Leone: బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో రెండేళ్ల తర్వాత సన్నీలియోన్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. క్యూజీ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ త్వరలో థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్యూజీ మూవీలో ప్రియమణి, సారా అర్జున్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
Sun, 18 Aug 202407:16 AM IST
Telugu OTT: శివరామచంద్రవరపు, శరణ్య శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న తెలుగు కామెడీ డ్రామా మూవీ బాలుగాని టాకీస్ డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తెలుగు ఇండియన్ ఐడల్ షోలో ప్రకటించారు.
Sun, 18 Aug 202406:34 AM IST
Imanvi: ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడి హిస్టారికల్ లవ్ స్టోరీ శనివారం మొదలైంది. ఈ మూవీలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఓపెనింగ్ ఈవెంట్‌లో ప్రభాస్‌తో ఇమాన్వీ దిగిన ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఈ బ్యూటీ గురించి తెగ వెతుకుతున్నారు.
Sun, 18 Aug 202404:12 AM IST
బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో ఆస్తుల మీద మోజుతోనే కళ్యాణ్ తిరిగి ఇంటికి రావడం లేదని కావ్యను అనుమానిస్తాడు రాజ్. భర్త మాటలతో కావ్య షాకవుతుంది. మరోవైపు బావను తనకు దూరం చేసిన వసుధారపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధపడినట్లు గుప్పెడంత మనసు ప్రోమోలో చూపించారు.
Sun, 18 Aug 202402:52 AM IST
Kalki Producer: కల్కి 2898 ఏడీ లాంటి భారీ బడ్జెట్ మూవీ తర్వాత ఓ చిన్న సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు నిర్మాత అశ్వనీదత్. ఛాంపియన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తోన్నాడు. శనివారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
Sun, 18 Aug 202401:52 AM IST
OTT Suspense Thriller: కన్నడ హారర్ థ్రిల్లర్ మూవీ కంగారూ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఆదిత్య, రజిని రాఘవన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది మేలో రిలీజైన ఈ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
Sun, 18 Aug 202412:49 AM IST
Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు ఫేమ్ ముఖేష్ గౌడ అలియాస్ రిషి ప్రియమైన నాన్నకు పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తోన్నాడు. సినిమా పోస్టర్‌ను ముఖేష్ గౌడ అభిమానులతో పంచుకున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ప్రియమైన నాన్నకు మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ముఖేష్ గౌడ ప్రకటించాడు.