Telugu Cinema News Live August 15, 2024: Aay Twitter Review: ‘ఆయ్’ అదిరింది!: ఎన్టీఆర్ బావమరిది మూవీకి నెటిజన్ల రెస్పాన్స్ ఎలా ఉందంటే..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 15 Aug 202404:40 PM IST
- Aay Movie Twitter Review: నార్నే నితిన్ హీరోగా నటించిన ఆయ్ సినిమా ప్రీమియర్ షోలు నేడు (ఆగస్టు 15) పడ్డాయి. ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రీమియర్ షోలు చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ స్పందనే వస్తోంది.
Thu, 15 Aug 202403:00 PM IST
- Harish Shankar: మిస్టర్ బచ్చన్ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై డైరెక్టర్ హరీశ్ శంకర్ నేడు స్పందించారు. మిస్టర్ బచ్చన్ సక్సెస్ మీట్‍లో ఆయన మాట్లాడారు. అలాగే, ఈ చిత్రానికి సంబంధించిన వైరల్ అవుతున్న ఓ ఫొటోపై కూడా వివరణ ఇచ్చారు.
Thu, 15 Aug 202402:11 PM IST
- Kolkata Rape, Murder: కోల్‍కతాలో ఓ యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది సినీ సెలెబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్, ఆలియా ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Thu, 15 Aug 202410:57 AM IST
- Bollywood: బాలీవుడ్‍లో నేడు మూడు సినిమాలు బాక్సాఫీస్ క్లాష్‍కు దిగాయి. స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేద చిత్రాలు విడుదలయ్యాయి. హారర్ కామెడీ సీక్వెల్‍గా వచ్చిన స్త్రీ 2 సినిమా అడ్వాన్డ్స్ బుకింగ్‍ల్లో అదరగొట్టడంతో పాటు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇండిపెండెన్స్ డే పోటీలో ఈ మూవీ డామినేట్ చేస్తోంది.
Thu, 15 Aug 202410:00 AM IST
- Samantha Instagram Post: సమంత చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు ఈ ఫొటోతో ఆమె ఏం చెప్పాలనుకుంటోంది? ఈ ప్రశ్నకు ఫ్యాన్స్ సమాధానం ఇచ్చేశారు. నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ కు లింకు పెడుతూ కొందరు చేస్తున్న కామెంట్స్ అది నిజమేనేమో అనిపించేలా చేస్తున్నాయి.
Thu, 15 Aug 202409:47 AM IST
- Vijay Deverakonda - Geetha Govindam: గీతగోవిందం సినిమా ఆరేళ్లు పూర్తి చేసుకుంది. విజయ్ దేవరకొండకు ఈ మూవీని ఇప్పటికే హైయ్యెస్ట్ కలెక్షన్ల చిత్రంగా ఉంది. ఈ మూవీ తర్వాత విజయ్‍కు ఆ స్థాయి హిట్ దక్కలేదు. గీతగోవిందం చిత్రం చాలా మందికి ఫేవరెట్ మూవీగానూ నిలిచిపోయింది.
Thu, 15 Aug 202408:58 AM IST
- OTT Telugu Movies This week: ఈ వారం ఓటీటీల్లోకి నాలుగు తెలుగు సినిమాలు వచ్చేశాయి. వివిధ జానర్ల చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. రెండు సినిమాలు నేరుగా ఓటీటీలోకే ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో ఓ బోల్డ్ థ్రిల్లర్ కూడా స్ట్రీమింగ్‍కు వచ్చింది. నాలుగు చిత్రాల్లో రెండు ఆహా ఓటీటీలోనే అందుబాటులోకి వచ్చాయి.
Thu, 15 Aug 202408:51 AM IST
OTT Crime Comedy: తెలుగు క్రైమ్ కామెడీ మూవీ పేక మేడలు ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో వినోద్ కిషన్, అనూష కృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. బాహుబలిలో కీలక పాత్ర చేసిన రాకేష్ వర్రే ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
Thu, 15 Aug 202408:24 AM IST
Double Ismart Review రామ్ హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ గురువారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Thu, 15 Aug 202408:23 AM IST
- Bazooka Teaser: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా గురువారం (ఆగస్ట్ 15) రిలీజైంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ కానుంది.
Thu, 15 Aug 202406:32 AM IST
- OTT Telugu Bold Movie: ఓటీటీలోకి మరో తెలుగు బోల్డ్ మూవీ వచ్చేసింది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండానే నేరుగా డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. గురువారం (ఆగస్ట్ 15) నుంచే ఈ బోల్డ్ రొమాంటిక్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎందులో చూడాలంటే?
Thu, 15 Aug 202405:44 AM IST
Double Ismart OTT: రామ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోన్నట్లు సమాచారం. సెప్టెంబర్ నెలాఖరున డబుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా దర్శకుడు పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్‌ను రూపొందించాడు.
Thu, 15 Aug 202405:20 AM IST
- OTT Malayalam Horror Web Series: ఓటీటీలోకి సరికొత్త మలయాళం హారర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. అయితే స్ట్రీమింగ్ డేట్ ఇంకా వెల్లడించకపోయినా.. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
Thu, 15 Aug 202404:45 AM IST
Thangalaan Twitter Review: విక్రమ్, డైరెక్టర్ పా రంజిత్ కలయికలో వచ్చిన తంగలాన్ టీజర్స్, ట్రైలర్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో పార్వతి, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. గురువారం తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ మూవీ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
Thu, 15 Aug 202404:45 AM IST
- OTT Releases: ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలుగు, తమిళం, హిందీల్లో రిలీజైన టాప్ మూవీస్ ఓటీటీ పార్ట్‌నర్స్ ఖరారయ్యాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, రఘు తాతా, స్త్రీ2, తంగలాన్ లాంటి సినిమాలు ఏ ఓటీటీల్లో రాబోతున్నాయో తేలిపోయింది. బాక్సాఫీస్ రన్ ముగిసిన తర్వాత ఈ మూవీస్ వచ్చే ఓటీటీలు ఇవే.
Thu, 15 Aug 202403:47 AM IST
Guppedantha Manasu August 15th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 15 ఎపిసోడ్‌లో మను తండ్రి మహేంద్రనే అనే నిజాన్ని శైలేంద్ర బయటపెడతాడు. కానీ శైలేంద్ర మాటలను మను నమ్మడు. మరోవైపు కొత్త ఎండీగా రిషిని ప్రకటిస్తుంది వసుధార.
Thu, 15 Aug 202403:44 AM IST
- Independence Day Movie: స్వతంత్ర భారతదేశంలో రిలీజైన తొలి సినిమా ఏదో తెలుసా? ఈ మూవీ సరిగ్గా ఆగస్ట్ 15, 1947న రిలీజైంది. దేశం రెండు వందల ఏళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న సమయంలో వచ్చిన ఈ సినిమా గురించి ఇప్పుడు 78వ ఇండిపెండెన్స్ రోజు గుర్తు చేసుకుందాం.
Thu, 15 Aug 202402:33 AM IST
- Mr Bachchan Twitter Review: రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీకి సోషల్ మీడియాలో మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. బొమ్మ బ్లాక్‌బస్టర్ అని ఓవైపు.. ఇదేం సినిమా రా అయ్యా అని మరోవైపు ప్రేక్షకులు రివ్యూలు ఇవ్వడం విశేషం.
Thu, 15 Aug 202402:19 AM IST
Brahmamudi August 15th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 15 ఎపిసోడ్‌లో కళ్యాణ్, అప్పు తిరిగి ఇంటికి రావడానికి ఒప్పుకోకపోవడంతో ధాన్యలక్ష్మి రచ్చ రచ్చ చేస్తుంది. ఆస్తిని ముక్కలు చేయాల్సిందేనని పట్టుపడుతుంది.
Thu, 15 Aug 202402:00 AM IST
- NNS 15th August Episode: నిండు నూరేళ్ల సావాసం గురువారం (ఆగస్ట్ 15) ఎపిసోడ్లో అరుంధతే మంగళ గౌరీ వ్రతం చేస్తుంది. ఆమెకు అమ్మవారి ప్రత్యేక వరం ఉండటం చూసి మనోహరి షాక్ లో ఉండగా.. అమర్ కుటుంబం సంబరాలు చేసుకుంటుంది.
Thu, 15 Aug 202401:41 AM IST
- Karthika deepam 2 serial today august 15th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. రెస్టారెంట్ లో జ్యోత్స్న తన కన్నతండ్రి దాసు చెంప పగలగొడుతుంది. అది చూసి పారిజాతం విలవిల్లాడిపోతుంది. ఎందుకు కొట్టావని గట్టిగా నిలదీస్తుంది.
Thu, 15 Aug 202412:54 AM IST
Double Ismart Twitter Review: రామ్ హీరోగా పూరి జగనాథ్ దర్శకత్వంలో రూపొందిన డబుల్ ఇస్మార్ట్ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
Thu, 15 Aug 202411:55 PM IST
Mr Bachchan Review: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ గురువారంథియేటర్లలో రిలీజైంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.