Telugu Cinema News Live August 13, 2024: OG Movie: సరిపోదా శనివారం ఈవెంట్‍లో ‘ఓజీ’ హోరు.. నిర్మాత ఏమన్నారంటే..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Tue, 13 Aug 202404:50 PM IST
- OG Movie: నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. అయితే, ఈవెంట్‍లో పవన్ కల్యాణ్ చేస్తున్న ఓజీ సినిమా పేరు హోరెత్తింది. ఒక్కసారి ప్రేక్షకులు భారీగా ఓజీ.. ఓజీ అంటూ అరిచారు. దీంతో నిర్మాత స్పందించారు.
Tue, 13 Aug 202403:11 PM IST
Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ వచ్చేసింది. యాక్షన్ మోడ్‍లో నాని అదరగొట్టారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చూపించిన ఎలివేషన్స్ దుమ్మురేపేలా ఉన్నాయి. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అదిరిపోయింది.
Tue, 13 Aug 202402:26 PM IST
- OMG OTT Release Date: తెలుగు హారర్ కామెడీ సినిమా ఓఎంజీ ఓటీటీలోకి వస్తోంది. వెన్నెల కిశోర్ మెయిన్ రోల్ చేసిన ఈ చిత్రం ఈవారంలోనే స్ట్రీమింగ్‍కు రానుంది. స్ట్రీమింగ్ డేట్‍ను ఆహా ఓటీటీ నేడు వెల్లడించింది.
Tue, 13 Aug 202411:39 AM IST
- Grrr Survival Comedy Movie OTT Date: గర్ర్ (Grrr) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. సర్వైవల్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం రూపొందింది. థియేటర్లలో రిలిజైన రెండు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
Tue, 13 Aug 202410:33 AM IST
- Ram Charan on Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవుతోంది. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఈ మూవీపై చాలా మంది సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ నేడు ఈ చిత్రం గురించి ట్వీట్ చేశారు.
Tue, 13 Aug 202410:20 AM IST
- KBC Quiz Show: పాపులర్ క్విజ్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి మళ్లీ వచ్చేసింది. 16వ సీజన్ తొలి రోజు సోమవారం (ఆగస్ట్ 12) ఉత్కర్ష్ అనే కంటెస్టెంట్ రూ.25 లక్షల విలువైన మహాభారతంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. మీరు చెప్పగలరా?
Tue, 13 Aug 202409:46 AM IST
- Konjam Pesinaal Yenna: తమిళ మూవీ ‘కొంజమ్ పెసినాల్ ఎన్న’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు 80 రోజుల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ మూవీ వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానుందంటే..
Tue, 13 Aug 202409:12 AM IST
- Janhvi Kapoor in Tirupati: శ్రీదేవి జయంతి రోజున బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన బాయ్‌ఫ్రెండ్ తో కలిసి తిరుపతి వచ్చింది. మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్న ఆమె.. మంగళవారం (ఆగస్ట్ 13) శ్రీవారి దర్శనం చేసుకుంది.
Tue, 13 Aug 202408:43 AM IST
- Veeranjaneyulu Viharayatra OTT: వీరాంజనేయులు విహారయాత్ర సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. రేపే (ఆగస్టు 13) స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో కాకుండా ఈ కామెడీ డ్రామా మూవీ నేరుగా ఓటీటీలోనే ఎంట్రీ ఇస్తోంది.
Tue, 13 Aug 202407:55 AM IST
- Committee Kurrollu Box Office Collection: నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి రావడం విశేషం.
Tue, 13 Aug 202407:03 AM IST
సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ దార్కారీ ఎమ్ఎమ్ 2 మూవీతో రైటర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు. మ్యాడ్‌లో కీలక పాత్ర పోషించిన రవి ఆంథోనీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
Tue, 13 Aug 202406:53 AM IST
- OTT Hollywood Action Movie: ఓటీటీలోకి సూపర్ హిట్ హాలీవుడ్ యాక్షన్ కామెడీ మూవీ వచ్చేస్తోంది. ఇన్నాళ్లూ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ మూవీ.. ఇప్పుడు మరో ఓటీటీలోకి ఫ్రీగా వస్తుండటం విశేషం.
Tue, 13 Aug 202406:20 AM IST
- Director Hero Fight: సెట్‌లోనే ఓ హీరో షర్ట్ చించేసి, అతనికి కనీసం తిండి కూడా పెట్టకుండా వేధించిన డైరెక్టర్ గురించి ఎప్పుడైనా విన్నారా? బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన హీరో, డైరెక్టర్ ఫైట్ గా పేరుగాంచిన ఈ ఘటన 35 ఏళ్ల కిందట జరిగింది.
Tue, 13 Aug 202406:09 AM IST
Crime Thriller OTT: ట్వెల్త్ ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మస్సే త్వరలో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించబోతున్నాడు. సెక్టార్ 36 పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ సెప్టెంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Tue, 13 Aug 202405:08 AM IST
- OTT Malayalam Romantic Comedy: సూపర్ హిట్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. బుధవారం (ఆగస్ట్ 13) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Tue, 13 Aug 202405:05 AM IST
Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్‌కు మేకర్స్ షాకిచ్చారు. సీరియల్‌ను అర్థాంతరంగా ముగించేశారు. గుప్పెడంత మనసు సీరియల్‌కు శుభం కార్డు పడినట్లు నటుడు సాయికిరణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
Tue, 13 Aug 202403:28 AM IST
Guppedantha Manasu August 13th Episode: గుప్పెడంత మనసు ఆగస్ట్ 13 ఎపిసోడ్‌లో ఎండీ సీట్ చేపట్టబోతున్న ఆనందంలో ఉంటాడు శైలేంద్ర. కానీ అతడికి సరోజ, పాండు ఒకరి తర్వాత మరొకరు ట్విస్ట్‌లు ఇస్తారు. సరోజ విషయంలో రిషిపై వసుధార అలుగుతుంది.
Tue, 13 Aug 202403:19 AM IST
- KBC 16 Amitabh Bachchan: ఇండియా ఫేవరెట్ క్విజ్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి కొత్త సీజన్ మొదలైంది.ఈ సందర్భంగా ఈ షో హోస్ట్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ అవుతున్న వీడియో వైరల్ గా మారింది.
Tue, 13 Aug 202402:02 AM IST
Brahmamudi August 13th Episode: బ్రహ్మముడి ఆగస్ట్ 13 ఎపిసోడ్‌లో కళ్యాణ్, అప్పులను తిరిగి ఇంటికి తీసుకురమ్మని రాజ్‌ను బతిమిలాడుతాడు ప్రకాశం. కళ్యాణ్ ఒంటరిగానే తిరిగిరావాలని, అప్పును ఇంట్లో అడుగుపెట్టనిచ్చేది లేదని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. అప్పును కోడలిగా ఒప్పుకోనని అంటుంది.
Tue, 13 Aug 202401:56 AM IST
- NNS 13th August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (ఆగస్ట్ 13) ఎపిసోడ్లో రణ్వీర్ సైలెంట్ గా ఉండటం చూసి మనోహరి తెగ వణికిపోతుంటుంది. అటు అమర్ ను నిలదీయడానికి పిల్లలు సిద్ధమవుతుండగా.. తన గురించి తెలిసిపోతుందంటూ అరుంధతి ఆలోచనలోపడుతుంది.
Tue, 13 Aug 202401:40 AM IST
- Karthika deepam 2 serial today august 13th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప, కార్తీక్ కి సంబంధం లేదని అనసూయ కోర్టులో కుండబద్ధలు కొట్టినట్టు చెప్తుంది. తల్లీకూతుళ్లను విడదీయొద్దని వేడుకుంటుంది. దీంతో దీపకు విడాకులు వస్తాయి.
Tue, 13 Aug 202412:40 AM IST
Jana Senani Movie: తెలుగు మూవీ జనసేనాని థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్టర్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ అవుతోంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో హరీష్ పేరడి కీలక పాత్రలో నటించాడు.