Telugu Cinema News Live August 10, 2024: Bollywood: అలాంటి దుస్తుల వల్ల షారుఖ్ సినిమాకు నో చెప్పా: బాలీవుడ్ నటి
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 10 Aug 202404:45 PM IST
- Raveena Tandon: షారుఖ్ ఖాన్‍తో సినిమా అవకాశాన్ని తాను గతంలో వదులుకున్నానని బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ వెల్లడించారు. దుస్తుల విషయంలో అభ్యంతరాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తాజాగా వెల్లడించారు. మరిన్ని విషయాలను పంచుకున్నారు.
Sat, 10 Aug 202401:57 PM IST
- Saripodhaa Sanivaaram Trailer date: సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ రిలీజ్‍కు డేట్ ఖరారైంది. నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్‍కు రెండు వారాల ముందే ట్రైలర్ వచ్చేస్తోంది.
Sat, 10 Aug 202401:12 PM IST
- Maharaja OTT Streaming: మహారాజ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రం భారీ వ్యూస్‍తో దూసుకెళుతోంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో వ్యూస్‍లో బాలీవుడ్ మూవీ సైతాన్‍ను దాటేసింది. ఆ వివరాలు ఇవే.
Sat, 10 Aug 202410:52 AM IST
- Naga Chaitanya - Sobhita Sobhita Dhulipala Engagement: హీరో నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల ఎంగేజ్‍మెంట్ ఇప్పుడు హాట్‍టాపిక్‍గా మారింది. ముందుగా ప్రకటించకుండానే ఈ వేడుక జరిగింది. అయితే, హడావుడిగా ఎంగేజ్‍మెంట్ ఎందుకు చేశారో వెల్లడించారు నాగార్జున.
Sat, 10 Aug 202410:03 AM IST
Kalki 2898 AD 44 Days Worldwide Collection: ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇంకా విజయవంతంగా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో కల్కి సినిమాకు 44 రోజుల్లో, 44వ రోజున ఇండియా అండ్ వరల్డ్ వైడ్‌గా వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసుకుందాం.
Sat, 10 Aug 202409:51 AM IST
- Rakshana OTT Streaming: రక్షణ సినిమా తాజాగా ఓటీటీలో ఓ మైల్‍స్టోన్ దాటింది. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ చిత్రం ఓటీటీలో బాగా పర్ఫార్మ్ చేస్తోంది. హీరోయిన్ పాయర్ రాజ్‍పుత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.
Sat, 10 Aug 202408:50 AM IST
- D Block Telugu OTT Streaming: డీ బ్లాక్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంలో రిలీజైన రెండేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..
Sat, 10 Aug 202408:33 AM IST
Trigun Bilingual Movie Sweety Naughty Crazy Movie Launch: ముగ్గురు హీరోయిన్లతో తెలుగు హీరో త్రిగుణ్ నటిస్తున్న ద్విభాష చిత్రం స్వీటీ నాటీ క్రేజీ. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ రాధ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Sat, 10 Aug 202408:05 AM IST
Weapon Review: సత్యరాజ్, వసంత్‌రవి, తాన్యహోప్ ప్రధాన పాత్రల్లో నటించిన వెపన్ మూవీ ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే?
Sat, 10 Aug 202407:46 AM IST
Bhagyashri Borse Comments On Ravi Teja Mr Bachchan: రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ హీరోయిన్, న్యూ నేషనల్ క్రష్ భాగ్యశ్రీ బోర్సే తెలుగు భాషపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు భాష, రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్, తెలుగు డబ్బింగ్‌పై భాగ్యశ్రీ బోర్సే పలు వ్యాఖ్యలు చేసింది.
Sat, 10 Aug 202406:35 AM IST
Abhishek Bachchan Aishwarya Rai Divorce Reason: హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌కు హీరో అభిషేక్ బచ్చన్ విడాకులు ఇవ్వనున్నట్లు గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఐశ్వర్యకు అభిషేక్ విడాకులు ఇవ్వడానికి కారణం ఓ డాక్టర్ అని బాలీవుడ్ మీడియా చెబుతొంది.
Sat, 10 Aug 202405:54 AM IST
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా మరో ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సిరీస్‌కు ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్ అనే టైటిల్ ఖరారు చేశారు.
Sat, 10 Aug 202405:09 AM IST
Murari Re Release Collection: మహేష్‌బాబు మురారి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రీ రిలీజ్ సినిమాల్లో టాప్ త్రీలో ఒకటిగా నిలిచింది.
Sat, 10 Aug 202404:47 AM IST
Avatar 3 Title Announced As Avatar Fire And Ash: వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఫ్రాంఛైజీ అవతార్ నుంచి మూడో సినిమా రానుంది. ఈ అవతార్ 3 మూవీ టైటిల్‌ను తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అవతార్ మూడో పార్ట్ "అవతార్: ఫైర్ అండ్ యాష్" అనే టైటిల్‌తో రానుంది. అవతార్ 3 రిలీజ్ డేట్ ప్రకటించారు.
Sat, 10 Aug 202403:13 AM IST
Double Ismart Movie First Review In Telugu: డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మరో యాక్షన్ సినిమా డబుల్ ఇస్మార్ట్. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా చేసిన ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. అయితే, ఈ మూవీ చూసేసిన సెన్సార్ సభ్యులు డబుల్ ఇస్మార్ట్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు.
Sat, 10 Aug 202402:52 AM IST
- కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కోర్టులో నరసింహకు దీప అదిరిపోయే ఝలక్ ఇస్తుంది. శోభను రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్పడంతో లాయర్ వీవీ కూడా ఆశ్చర్యపోతాడు.
Sat, 10 Aug 202402:47 AM IST
Manamey OTT: శర్వానంద్ మనమే మూవీ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మనమే మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
Sat, 10 Aug 202402:16 AM IST
Brahmamudi Serial August 10th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 10వ తేది ఎపిసోడ్‌లో కావ్య, రాజ్ గొడవ పడతారు. కోపంగా ఉన్న రాజ్ ఏం తినడు. మరోవైపు అప్పు కల్యాణ్ ఇద్దరూ కలిసి తొలిసారి పడుకుంటారు. ఆస్తి మొత్తం లాక్కునేందుకు రుద్రాణి స్కెచ్ వేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్లో..
Sat, 10 Aug 202401:49 AM IST
Guppedantha Manasu August 10th Episode: గుప్పెడంత మనసు ఆగస్ట్ 10 ఎపిసోడ్‌లో తన కుటుంబానికి అన్యాయం చేసింది శైలేంద్రనేనా కాదా అన్నది తెలుసుకోవాలని రిషి ఫిక్సవుతాడు. శైలేంద్రను మాటల్లో పెట్టి గుట్టు లాగాలని అనుకుంటాడు.
Sat, 10 Aug 202401:14 AM IST
Bhagyashri Borse About New National Crush: రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే చేసింది. ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది భాగ్యశ్రీ బోర్సే. ఇందులో తాను కొత్త నేషనల్ క్రష్ అనే కామెంట్‌పై రియాక్ట్ అయింది.
Sat, 10 Aug 202412:30 AM IST
- NNS 10th August Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 10) ఎపిసోడ్లో మంగళకి మనోహరి వార్నింగ్ ఇస్తుంది. అటు అమర్ ఇంటికి రణ్వీర్ రావడంతో మనోహరి నిజ స్వరూపం గురించి అందరికీ తెలిసిపోనుంది.