OTT Action Movies: ఓటీటీల్లో యాక్షన్ సినిమాలు చూడాలనుకుంటున్నారా! లేటెస్ట్‌గా వచ్చిన నాలుగు చిత్రాలు
OTT Action Movies: ఓటీటీల్లో ఇటీవల కొన్ని యాక్షన్ చిత్రాలు అడుగుపెట్టాయి. ఈ జానర్ చిత్రాలు ఇష్టపడే వారిని మెప్పిస్తాయి. అలా లేటెస్ట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన నాలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

ఓటీటీల్లో యాక్షన్ సినిమాలు చూడాలని అనుకుంటున్న వారికి తాజాగా మంచి ఆప్షన్లు వచ్చాయి. కొన్ని యాక్షన్ చిత్రాలు లేటెస్ట్‌గా ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. ఇందులో నాలుగు పాపులర్ సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు సినిమాలు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి. లేటెస్ట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన నాలుగు యాక్షన్ సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి. చూసేందుకు ప్లాన్ చేసుకోండి.
మార్కో
వైలెంట్ యాక్షన్ మూవీగా మార్కో చాలా పాపులర్ అయింది. ఈ సినిమా గత వారం ఫిబ్రవరి 14వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో చిత్రం డిసెంబర్ 20న మలయాళంలో రిలీజై బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఆ తర్వాత తెలుగులోనూ రిలీజైంది. ఈ మూవీని ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు డైరెక్టర్ హనీఫ్ అదేనీ. మార్కో తెలుగులో ఆహా ఓటీటీలోనూ ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్‍కు రానుంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి మార్కో నచ్చేస్తుంది. అయితే, వైలెన్స్ తీవ్రంగా ఉంటుంది. వైలెన్స్ ఓకే అనుకుంటే ఈ చిత్రాన్ని చూసేయవచ్చు.
మ్యాక్స్
మ్యాక్స్ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 15న స్ట్రీమింగ్‍కు వచ్చింది. స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన ఈ కన్నడ యాక్షన్ చిత్రం తెలుగు, తమిళం మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. గత డిసెంబర్ 25న థియేటర్లలో ఈ చిత్రం రిలీజైంది. మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. మిక్స్డ్ టాకే వచ్చినా.. యాక్షన్ సీక్వెన్సులు మాత్రం ఈ చిత్రంలో ఆకట్టుకున్నాయి. మ్యాక్స్ చిత్రానికి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. యాక్షన్ కోసమైతే మ్యాక్స్ మూవీపై జీ5లో ఓ లుక్కేయవచ్చు.
భైరాతి రంగల్
హైవోల్టేజ్ కన్నడ యాక్షన్ మూవీ భైరాతి రంగల్ తాజాగా తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ గత వారం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన ఈ చిత్రం కన్నడలో గతేడాది నవంబర్ నెలలో థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పుడు ఆహా ఓటీటీలో తెలుగు డబ్బింగ్‍లో ఎంట్రీ ఇచ్చింది. ఈ భైరాతి రంగల్ మూవీలో ఓవర్ ది టాప్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. ఈ చిత్రానికి నార్థన్ దర్శకత్వం వహించారు.
మద్రాస్‍కారణ్
తమిళ యాక్షన్ మూవీ మద్రాస్‍కారణ్ ఫిబ్రవరి 7న ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో షేన్ నిగమ్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల హీరోహీరోయిన్లుగా నటించారు. కలైయారాస్ మరో లీడ్ రోల్ చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. ఆశించిన రేంజ్‍లో సక్సెస్ కాలేకపోయింది. ఆహా తమిళ్‍లో తమిళంలో మద్రాస్‍కారణ్ స్ట్రీమ్ అవుతోంది. తెలుగు వెర్షన్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. ఈ మూవీని డైరెక్టర్ వాలీ మోహన్ దాస్ తెరకెక్కించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం