Sidhu Moosewala mother: ఆ సింగర్ తల్లి మళ్లీ ప్రెగ్నెంట్.. 58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధం
Sidhu Moosewala mother: దివంగత పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా తల్లి 58 ఏళ్ల వయసులో మళ్లీ ప్రెగ్నెంట్ అయిందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఐవీఎఫ్ ద్వారా గర్భవతి కావడం గమనార్హం.
Sidhu Moosewala mother: రెండేళ్ల కిందట హత్యకు గురైన పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. సిద్దూ తల్లి చరణ్ సింగ్ ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినట్లు ట్రిబ్యూన్ వెల్లడించింది. వచ్చే నెలలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. మే, 2022లో హత్యకు గురైన సిద్దూ మూసేవాలా వీళ్లకు ఏకైక సంతానంగా ఉండేవాడు.
సిద్దూ మూసేవాలా తల్లి గర్భవతి
సిద్దూ మూసేవాలా తల్లి చరణ్ సింగ్ వయసు 58 ఏళ్లు కావడం గమనార్హం. ఆ దివంగత సింగర్ కు బదులు రెండేళ్ల కిందట ఎన్నికల్లో నిల్చొనే సమయంలో తన వయసు 56 ఏళ్లుగా అఫిడవిట్ లో చరణ్ సింగ్ వెల్లడించింది.
ప్రస్తుతం ఆమె ప్రసవం కోసం సిద్ధమవుతుండటంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె సహజంగా కాకుండా ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చడంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందిగా డాక్టర్లు సలహా ఇచ్చారు.
సిద్దూ మూసేవాలా హత్య
సిద్దూ మూసేవాలా ఓ పంజాబీ సింగర్. అతన్ని మే, 2022లో పంజాబ్ లోని మాన్సా జిల్లాలో కాల్చి చంపారు. తన కజిన్, ఫ్రెండ్ తో కలిసి ఉండగా ఆరుగురు వ్యక్తులు సిద్దూని కాల్చి చంపినట్లు వార్తలు వచ్చాయి. అతని హత్య కేసులో పంజాబ్ పోలీస్ కు చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ 32 మందిని ఛార్జ్‌షీట్ లో చేర్చింది. అందులో గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయి, గోల్డీ బ్రార్, జగ్గూ భగ్వాన్‌పూరియా ఉన్నారు.
సిద్దూ మూసేవాలా హత్య అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులకు తగిన శిక్ష పడాలంటూ పంజాబ్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మరో పంజాబీ సింగర్ దిల్జిత్ దొసాంజ్ కూడా ఈ హత్యలో ప్రభుత్వ వైఫల్యం ఉందని విమర్శించాడు. సిద్దూ మూసేవాలా సో హై, సేమ్ బీఫ్, ది లాస్ట్ రైడ్, జస్ట్ లిసెన్, 295లాంటి సాంగ్స్ తో పాపులర్ అయ్యాడు.
సిద్దూ మూసేవాలాను తానే హత్య చేసినట్లు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ గతేడాది విచారణలో అంగీకరించాడు. అతడు చాలా అహంకారి అని, తగిన గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే అలా చేసినట్లు చెప్పాడు. తమ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నట్లు అప్పట్లో అతడు తెలిపాడు.