ఏడాది తర్వాత ఓటీటీలోకి రజనీకాంత్ డిజాస్టర్ మూవీ..కూతురే డైరెక్టర్..డిజిటల్ స్ట్రీమింగ్ లో 12 నిమిషాల ఎక్స్‌ట్రా రన్ టైమ్-lal salaam ott release digital streaming on sun nxt after one year of theatrical release extended 12 minutes rajnikanth ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఏడాది తర్వాత ఓటీటీలోకి రజనీకాంత్ డిజాస్టర్ మూవీ..కూతురే డైరెక్టర్..డిజిటల్ స్ట్రీమింగ్ లో 12 నిమిషాల ఎక్స్‌ట్రా రన్ టైమ్

ఏడాది తర్వాత ఓటీటీలోకి రజనీకాంత్ డిజాస్టర్ మూవీ..కూతురే డైరెక్టర్..డిజిటల్ స్ట్రీమింగ్ లో 12 నిమిషాల ఎక్స్‌ట్రా రన్ టైమ్

థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత రజనీకాంత్ డిజాస్టర్ మూవీ ఓటీటీ బాట పట్టింది. ఈ రోజే (జూన్ 6) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమాకు రజనీకాంత్ కూతురే డైరెక్టర్. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

ఓటీటీలోకి రజనీకాంత్ సినిమా (x/sunnxt)

రజనీకాంత్ కీ రోల్ ప్లే చేసిన ‘లాల్ సలామ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టింది. శుక్రవారం (జూన్ 6) ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్టర్ కావడం గమనార్హం. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఈ మూవీ దారుణంగా నిరాశపర్చింది. డిజాస్టర్ గా నిలిచింది.

అదే ఓటీటీలోకి

లాల్ సలామ్’ మూవీ ఈ రోజే ఓటీటీలోకి వచ్చేసింది. స‌న్ నెక్ట్స్‌ ఓటీటీలో తమిళంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 2024 ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన లాల్ సలామ్ ఫిల్మ్ తీవ్రమైన పరాభవాన్ని ఎదుర్కొంది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. భారీ నష్టాలు చవిచూసింది.

రూ.19 కోట్లే

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన లాల్ సలామ్ థియేట్రికల్ రన్ లో రూ.19 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీ సుమారు రూ.90 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. ఈ సినిమాలో రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్ కీ రోల్స్ ప్లే చేశారు. లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.

12 నిమిషాలు

ఓటీటీ కోసం ఈ మూవీ రన్ టైమ్ ను 12 నిమిషాలు పెంచారు. అదనపు సీన్స్ యాడ్ చేశారు. థియేటర్లలో ఈ మూవీ రన్ టైమ్ 150 నిమిషాలు. ఇప్పుడు ఎక్స్ ట్రా సీన్స్ యాడ్ చేశారు. హార్డ్ డిస్క్ మిస్ కావడంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ కు ముహూర్తం కుదిరింది.

సూపర్ స్టార్ ఉన్నా

లాల్ సలామ్ మూవీలో మొయిద్దీన్ భాయ్ అనే ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో రజనీకాంత్ నటించాడు. ఓ ఊళ్లో జరిగిన మత హింసకు క్రికెట్ మ్యాచ్ ద్వారా అతడు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. అతడే సినిమాకు డైలాగులు కూడా రాశాడు. సినిమా ప్రమోషన్లను కూడా బాగానే చేశాడు. విష్ణు విశాల్, విక్రాంత్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా పనిచేయలేకపోయింది. అతని స్వాగ్ ఈ మూవీని గట్టెక్కించలేకపోయింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం