Manchu Lakshmi: హాలీవుడ్‍లో అలా.. ఇండియాలో ఇలా: మంచు లక్ష్మి కామెంట్లు-lakshmi manchu compares culture on sets between hollywood and india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Lakshmi: హాలీవుడ్‍లో అలా.. ఇండియాలో ఇలా: మంచు లక్ష్మి కామెంట్లు

Manchu Lakshmi: హాలీవుడ్‍లో అలా.. ఇండియాలో ఇలా: మంచు లక్ష్మి కామెంట్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 29, 2024 10:40 PM IST

Manchu Lakshmi: షూటింగ్ సెట్‍ల విషయంలో హాలీవుడ్, భారత సినీ ఇండస్ట్రీల మధ్య తేడాను చెప్పారు మంచు లక్ష్మి. సెట్స్‌లో అనవసరంగా చాలా మంది ఉంటున్నారని అన్నారు. మరిన్ని కామెంట్లు చేశారు.

Manchu Lakshmi: హాలీవుడ్‍లో అలా.. ఇండియాలో ఇలా: మంచు లక్ష్మి కామెంట్లు
Manchu Lakshmi: హాలీవుడ్‍లో అలా.. ఇండియాలో ఇలా: మంచు లక్ష్మి కామెంట్లు

Manchu Lakshmi: తెలుగు నటి మంచు లక్ష్మి.. హాలీవుడ్ ద్వారానే తెరంగేట్రం చేశారు. ముందుగా మూడు ఇంగ్లిష్ చిత్రాల్లో ఆమె నటించారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చేసి తెలుగు, తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. సినిమా షూటింగ్ సెట్స్ విషయంలో హాలీవుడ్, భారత సినీ ఇండస్ట్రీల మధ్య తేడాలు ఏంటో మంచు లక్ష్మి తాజాగా చెప్పారు. అలాగే, ఇండియాలో స్టార్ ఎంకరేజ్‍మెంట్ ఎక్కువగా ఉంటోందని అన్నారు.

yearly horoscope entry point

అంత మంది ఎందుకు?

ఇండియాలో సినిమా షూటింగ్ సెట్లలో చాలా మంది ఉంటారని మంచు లక్ష్మి చెప్పారు. హాలీవుడ్‍లో నటులు వారి కుర్చీలను వారే లాక్కుంటారని అన్నారు. ఇండియలో మాత్రం చాలా మంది వ్యక్తిగత అసిస్టెంట్లు ఉంటారని అన్నారు. “ఇంత మంది ఎవరికి అవసరం అని నేను అనుకుంటాను. సెట్స్‌లో ఏమీ చేయని నలుగురి నుంచి ఐదుగురిని ప్రతీ యాక్టర్ వెంట తెచ్చుకుంటారు. హెయిర్ పర్సన్‍కు కూడా అసిస్టెంట్ ఉంటారు. ఏం జరుగుతోంది?” అని మంచు లక్ష్మి అన్నారు. ఒక్కో యాక్టర్‌కు మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, స్పాట్ బాయ్స్ ఇలా ఉంటారని ఆమె ఇండియన్ ఎక్స్‌ప్రెస్‍తో చెప్పారు. హాలీవుడ్ షూటింగ్ సెట్లలో పరిమితంగానే మంది ఉంటారని అన్నారు.

అప్పట్లో క్యారవాన్ లేదు

తన తండ్రి మంచు మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో క్యారీ వ్యాన్లు లేవని మంచు లక్ష్మి గుర్తు చేసుకున్నారు. “మాకు అప్పట్లో క్యారవాన్ లేదు. పొదల కోసం చూసేవాళ్లం. ఇప్పుడు ఎక్కడైనా మన వద్ద అందమైన క్యారవాన్ ఉంటోంది. అయితే, సినిమా కోసం ఉన్న ప్యాషన్, ప్రేమ పట్ల హాలీవుడ్, ఇండియా మధ్య చాలా పోలికలు ఉన్నాయి. హాలీవుడ్‍లో ఆర్టిస్టును బట్టి కేరింగ్ ఉంటుంది” అని మంచు లక్ష్మి చెప్పారు.

దక్షిణాదిలో సీనియర్ యాక్టర్లకు గౌరవం ఎక్కువగా ఉంటుందని, హాలీవుడ్‍లో అలా ఉండదని చెప్పారు. “యాక్టర్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి నేను వచ్చా. అమెరికన్ కంటే ఇండియన్ సెట్లలోనే నేను ఎక్కువగా ఉండేదాన్ని. ఎవరైనా పెద్ద యాక్టర్ వస్తే నేను లేచినిలబడితే అందరూ నవ్వేవారు (హాలీవుడ్‍లో). ఇక్కడ దక్షిణాదిలో ఓ సీనియర్ యాక్టర్ సెట్‍లోకి వస్తే.. మేం నిలబడి వారిని పలుకరిస్తుటాం. నేను అమెరికాలో ఎప్పుడైనా ఎలా చేస్తే.. ఇంకోసారి ఇలా చేస్తే నా రూమ్‍కే రానని చెప్పేవారు” అని మంచు లక్ష్మి వెల్లడించారు.

మంచు లక్ష్మి కెరీర్

2008లో ది ఓడ్ అనే హాలీవుడ్ చిత్రంతో మంచు లక్ష్మి తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మరో రెండు హాలీవుడ్ చిత్రాల్లో కనిపించారు. 2010లో ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్‍లోకి అడుగుపెట్టారు. అనగనగా ఓ ధీరుడు మూవీలో నెగెటివ్ రోల్ చేశారు. ఆ తర్వాత కూడా వరుసగా చిత్రాల్లో నటించారు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు లక్ష్మి కొంతకాలానికే సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువగా సపోర్టింగ్ పాత్రలే చేశారు మంచు లక్ష్మి. తమిళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. మాన్‍స్టర్ చిత్రంతో 2022లో మలయాళ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టారు. మంచు లక్ష్మి కీలక పాత్ర పోషించిన యక్షిణి వెబ్ సిరీస్ జూన్ నెలలోనే డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

Whats_app_banner