Laila Box Office Collection: డిజాస్టర్‌గా మిగిలిపోయిన విశ్వక్ సేన్ లైలా.. ఫస్ట్ వీకెండ్ దారుణమైన కలెక్షన్లు
Laila Box Office Collection: విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. అతని కెరీర్లోనే అతిపెద్ద బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది.

Laila Box Office Collection: టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన మూవీ లైలా. ఈ మూవీకి తొలి రోజు తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు వచ్చాయి. దీని ప్రభావం బాక్సాఫీస్ పై పడింది. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు కేవలం రూ.3 కోట్ల గ్రాస్ మాత్రమే కావడం గమనార్హం.
లైలా బాక్సాఫీస్ డిజాస్టర్
విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ అతని కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ అయింది. అత్యంత దారుణమైన రివ్యూలతో ఈ సినిమాకు తొలి షో నుంచే బాగా నెగటివ్ పబ్లిసిటీ వచ్చింది. పూర్తిగా వల్గర్ కంటెంట్ తో వచ్చిన సినిమా ఇది అంటూ సగటు ప్రేక్షకుడు కూడా రివ్యూ ఇచ్చాడు. దీంతో లైలా మూవీ తొలి మూడు రోజుల్లో కేవలం రూ.3 కోట్లు మాత్రమే రాబట్టింది. విశ్వక్ సేన్ కెరీర్లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన సినిమా ఇదే. ఈ రూ.3 కోట్ల గ్రాస్ లో షేర్ కేవలం రూ.1.3 కోట్లు మాత్రమే.
లైలా మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించాడు. ఈ సినిమాకు ఇదే హైలైట్ అని మేకర్స్ ప్రమోట్ చేసుకున్నారు. కానీ అదే మూవీని దెబ్బ తీసింది. సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరిగింది. రామ్ నారాయణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ ఫిమేల్ లీడ్ గా నటించింది. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించాడు.
లైలా మూవీ ఎలా ఉందంటే?
లైలా మూవీ స్టోరీయే మరీ చెత్తగా ఉన్నట్లు ప్రేక్షకులు రివ్యూ ఇచ్చారు. బ్యూటీ పార్లర్ నడుపుతూ అమ్మాయిలను ఆకర్షణీయంగా మార్చే సోను (విశ్వక్ సేన్) అనే వ్యక్తి ఎందుకు ఆడ వేషం వేయాల్సి వచ్చింది? స్థానికంగా ఉండే ఓ రౌడీ షీటర్, ఓ పోలీస్ అధికారి అతన్ని ఎందుకు టార్గెట్ చేశారు? అన్నదే ఈ లైలా మూవీ కథ.
గతంలో తెలుగులో హీరోలు లేడీ గెటప్ లు వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వీటిలో చాలా మూవీస్ హిట్ కూడా అయ్యాయి. అయితే లైలా మూవీ విషయంలోనూ విశ్వక్ సేన్ అదే జరుగుతుందనుకున్నా.. అది కాస్తా బోల్తా కొట్టింది. మరీ సిల్లీగా అనిపించే స్టోరీ లైన్ తో అతడు తన కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ ను అందుకున్నాడు.
దీనికితోడు మూవీ రిలీజ్ కు ముందే వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ప్రీరిలీజ్ ఈవెంట్లో యాక్టర్ పృథ్వీ వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో బాయ్‌కాట్ లైలా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీనివల్ల సినిమాకు కాస్త నెగటివ్ పబ్లిసిటీ కూడా దక్కింది.
సంబంధిత కథనం
టాపిక్