Lachchimi Song Release: అదిరిపోయిన అల్లరి నరేశ్ రొమాంటిక్ సాంగ్.. ఓ సారి వినేయండి
Allari Naresh Next Movie: అల్లరి నరేశ్ నటించిన తాజా చిత్రం లచ్చిమీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ వచ్చింది. లచ్చిమీ అంటూ సాగే ఈ పాట అద్భుతంగా ఉంది.
First Single from Itlu Maredumilli Prajaneekam: కామెడీ సినిమాలు చేస్తూ తెలుగు నాట తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అల్లరి నరేశ్. అయితే వరుస ఫ్లాపుల పలకరించడంతో గతేడాది కాస్త రూటు మార్చి నాంది లాంటి వైవిధ్యభరితమైన సీరియస్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అల్లరి నరేశ్. ఆ సినిమా విజయం కావడంతో మరోసారి ఇలాంటి రొటీన్‌కు భిన్నమైన కథలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం మన అల్లరోడు నటిస్తున్న తాజా చిత్రం ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ విడుదలై సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినినిమా నుంచి మొదటి పాట విడుదల చేశారు మేకర్స్. హీరో నితిన్ చేతుల మీదుగా ఈ సాంగ్ విడుదలైంది.
ట్రెండింగ్ వార్తలు
'లచ్చిమీ' అంటూ సాగే ఈ ఆద్యంతం ఎంతో వినసొంపుగా ఉంది. ఈ మెలోడీ సాంగ్‌ను ప్రముఖ బాలీవుడ్ సింగర్ జావెద్ అలీ అద్భుతంగా ఆలపించగా.. శ్రీ చరణ్ పాకాల ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చారు. శ్రీమణి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ను చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంది. ఈ పాటలో అల్లరి నరేశ్, ఆనంది జోడీ చూడ ముచ్చటగా ఉంది. అర్ధవంతమైన సాహిత్యం, వినసొంపుగా ఉన్న ట్యూన్.. ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఈ సినిమా నవంబరు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా సీరియస్ డ్రామాగా తెరకెక్కుతోంది. అంతేకాకుండా మంచి సందేశం కూడా ఉంటుందని సమాచారం. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా చేస్తోంది. అంతేకాకుండా వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర లాంటి వారు కీలక పాత్రలు ఫోషిస్తున్నారు.
ఈ సినిమాకు అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తుండగా.. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా చేస్తున్నారు. వెంకట్ ఆర్ స్టంట్ మాస్టర్‌గా చేస్తున్నారు. ఈ ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. నాంది లాంటి సీరియస్ స్టోరీతో సూపర్ హిట్ కొట్టిన అల్లరి నరేశ్.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానికంతో మరోసారి కూడా సీరియస్ కథనే నమ్ముకున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాలి.
సంబంధిత కథనం