Label OTT Release date: జర్నీ హీరో నయా వెబ్ సిరీస్ 'లేబుల్' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!-label ott release date jai starrer legal drama set to stream from november 10 on disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Label Ott Release Date: జర్నీ హీరో నయా వెబ్ సిరీస్ 'లేబుల్' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Label OTT Release date: జర్నీ హీరో నయా వెబ్ సిరీస్ 'లేబుల్' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 29, 2023 09:03 PM IST

Label OTT Release date: ‘లేబుల్’ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. జర్నీ ఫేమ్ జై ఈ సిరీస్‍లో న్యాయవాదిగా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ సహా మరిన్ని వివరాలివే..

Label OTT Release date: జర్నీ హీరో నయా వెబ్ సిరీస్ 'లేబుల్' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Label OTT Release date: జర్నీ హీరో నయా వెబ్ సిరీస్ 'లేబుల్' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Label OTT Release date: లేబుల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. జర్నీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన తమిళ హీరో జై ఈ సిరీస్‍లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. లీగల్ డ్రామాగా ఈ సిరీస్ రూపొందింది. అరుణ్‍రాజా కామరాజ్ ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. తాజాగా, ఈ ‘లేబుల్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ను డిస్నీ+ హాట్‍స్టార్ వెల్లడించింది.

లేబుల్ వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నవంబర్ 10వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఇటీవలే ఈ సిరీస్ ట్రైలర్‌ను హాట్‍స్టార్ తీసుకొచ్చింది. ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది. నవంబర్ 10వ తేదీన లేబుల్ వెబ్ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, హిందీ, మలయాళంలోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. పాటల రచయితగా ఫేమస్ అయిన అరుణ్ రాజా ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు.

లేబుల్ సిరీస్‍లో ఓ నిబద్ధత కలిగిన లాయర్ పాత్ర పోషిస్తున్నారు జై. కొందరు ప్రజల జీవితాలను మార్చేందుకు ఆయన కష్టపడతారు. చెన్నైలోని ఓ ప్రాంతానికి చెందిన కొందరిని ఎలా చిన్నచూపు చూస్తారన్నది కూడా ఈ సిరీస్‍లో చూపించనున్నారు. ఆర్టికల్ 20 గురించి ఈ సిరీస్‍లో ఉండనుందని తెలుస్తోంది.

ఈ లేబుల్ సిరీస్‍లో జై ప్రధాన పాత్ర పోషించగా.. తాన్య హోప్, మాస్టర్ మహేంద్రన్, సురేశ్ చక్రవర్తి, శ్రీమాన్ కీలకపాత్రల్లో నటించారు. ఈ సిరీస్‍కు శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు. జయచంద్ర హష్మి కథను అందించగా.. దినేశ్ కృష్ణన్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ ఆసక్తికరంగా సాగడంతో ఈ సిరీస్‍పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

జై చివరగా ‘తీర కాదల్’ చిత్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. రాబిన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది మేలో రిలీజ్ అయింది.

Whats_app_banner