13 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో హిస్ట‌రీ.. ఆస్కార్‌కు అఫీషియ‌ల్ ఎంట్రీ.. లాప‌తా లేడీస్‌ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?-laapataa ladies ott platform 13 filmfare awards official oscar entry laapataa ladies streaming on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  13 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో హిస్ట‌రీ.. ఆస్కార్‌కు అఫీషియ‌ల్ ఎంట్రీ.. లాప‌తా లేడీస్‌ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

13 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో హిస్ట‌రీ.. ఆస్కార్‌కు అఫీషియ‌ల్ ఎంట్రీ.. లాప‌తా లేడీస్‌ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

2024లో రిలీజైన ఓ బాలీవుడ్ మూవీ ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమా గురించే డిస్కషన్ జరుగుతోంది. తాజాగా 13 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకోవడమే కారణం. ఇండియా నుంచి ఆస్కార్ కు అఫీషియల్ ఎంట్రీ కూడా సాధించిన లాపతా లేడీస్ సినిమా ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.

లాపతా లేడీస్ ఓటీటీ

కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ ఇప్పుడు వైరల్ గా మారింది. 2024లో థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తో అదరగొట్టిన ఈ హిందీ కామెడీ డ్రామా ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. 2025 ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఈ మూవీ ఏకంగా 13 అవార్డులు గెలుచుకోవడమే అందుకు కారణం. ఓ ఏడాది ఫిల్మ్ ఫేర్ లో అత్యధిక అవార్డులు గెలిచిన మూవీగా రికార్డును ఇది సమం చేసింది.

లాపతా లేడీస్ ఓటీటీ

ఫిల్మ్ ఫేర్ 2025లో 13 అవార్డులు గెలుచుకున్న లాపతా లేడీస్ అధికారికంగా ఆస్కార్ 2025 కు నామినేట్ కూడా అయింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది. ఈ హిందీ మూవీ ఇంగ్లీష్, అరబిక్, స్పానిష్, చైనీస్, బ్రెజిలియన్ పోర్చుగీస్ సబ్ టైటిల్స్ తో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 2 నిమిషాలు.

థియేటర్లో ఇలా

2024 మార్చి 1న లాపతా లేడీస్ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇందులో నితాన్షి గోయెల్, ప్రతిభా రాంతా, స్పర్శ్ శ్రీవాస్తవ, రవి కిసాన్, ఛాయా కదమ్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఇండియాలోని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఇద్దరు వధువులు ఫూల్, అనుకోకుండా రైలు ప్రయాణంలో తమ ప్లేస్ లను మార్చుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిండ్లింగ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన లాపతా లేడీస్ కు కిరణ్ రావు దర్శకత్వం వహించారు.

లాపతా లేడీస్ కలెక్షన్లు

లాపతా లేడీస్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.25 కోట్లు వసూలు చేసింది. 5 రెట్లు అధికంగా కలెక్షన్లు సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్ ను షేక్ చేసింది లాపతా లేడీస్ మూవీ. అప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన లాపతా లేడీస్ సినిమా ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఏకంగా 13 పురస్కారాలు సొంతం చేసుకుంది. ఈ మూవీ ఏప్రిల్ 26, 2024 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికీ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం