L2 Empuraan Twitter Review: మోహన్‌లాల్ లూసిఫర్ 2 ట్విట్టర్ రివ్యూ - హాలీవుడ్ లెవెల్ యాక్షన్ - ఫస్ట్ హాఫ్ ఫైర్
మోహన్‌లాల్ హీరోగా నటించిన ఎల్ 2 ఎంపురాన్ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. లూసిఫర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తూ ఓ కీలక పాత్రలో కనిపించాడు.
మోహన్‌లాల్ హీరోగా నటించిన ఎల్ 2 ఎంపురాన్ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో గురువారం రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తూ ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించాడు. లూసిఫర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఎల్ 2 ఎంపురాన్ ఎలా ఉంది? ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఏంటంటే?
పాజిటివ్ టాక్….
ఎల్ 2 ఎంపురాన్ మూవీకి పాన్ ఇండియన్ వైడ్‌గా పాజిటివ్ టాక్ లభిస్తోంది. మోహన్‌లాల్ యాక్టింగ్, పృథ్వీరాజ్ డైరెక్షన్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. విజువల్‌గా స్టన్నింగ్‌గా ఉందని, యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ స్టాండర్స్‌లో గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయని ట్వీట్స్ చేస్తోన్నారు.
ఇంటర్వెల్ ట్విస్ట్...
మోహన్‌లాల్ ఎంట్రీ ఇచ్చే సీన్స్‌కు విజువల్స్ పడటం ఖాయమని అంటున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగుందని చెబుతోన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గ్రిప్పింగ్‌గా స్టోరీని రాసుకున్నాడని ట్వీట్స్ చేస్తోన్నారు. ఫస్ట్ హాఫ్ ఫైర్‌లా, సెకండాఫ్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌కు ఎంపురాన్ మూవీ విందు భోజనంలా ఉంటుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. టోవినో థామస్‌తో పాటు మిగిలిన యాక్టర్స్ తమ నటనతో అదరగొట్టారని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
యాభై నిమిషాల తర్వాతే...
సినిమా ప్రారంభమైన యాభై నిమిషాల తర్వాతే మోహన్‌లాల్ క్యారెక్టర్ ఎంపురాన్ మూవీలో కనిపిస్తుందని అంటున్నారు. మోహన్‌లాల్ ఎంట్రీ తర్వాతే సినిమా పరుగులు పెడుతుందని కామెంట్స్ చేస్తోన్నారు. లూసిఫర్‌తో కంపేర్ చేసి చూస్తే మాత్రం కథ, ట్విస్ట్‌లు, ఎలివేషన్లు అంతగా హై ఫీలింగ్ ఇవ్వలేకపోయానని చెబుతోన్నారు.
గూస్‌బంప్స్ గ్యారెంటీ…
దీపక్ దేవ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందని కామెంట్స్ చేస్తోన్నారు. బీజీఎమ్‌కు గూస్‌బంప్స్ గ్యారెంటీ అని చెబుతోన్నారు. ఫస్ట్ డే మూవీ 50 నుంచి 80 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. మలయాళ సినీ హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్‌తో ఎల్ 2 ఎంపురాన్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సంబంధిత కథనం