L2 Empuraan OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన సూపర్ స్టార్ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?-l2 empuraan ott streaming platform is disney plus hotstar buys l2e ott rights mohanlal l2 empuraan movie review telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  L2 Empuraan Ott: ఓటీటీలోకి నిన్న రిలీజైన సూపర్ స్టార్ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

L2 Empuraan OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన సూపర్ స్టార్ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

L2 Empuraan OTT Streaming Platform: ఓటీటీలోకి నిన్న (మార్చి 27) థియేటర్లలో రిలీజ్ అయిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మూవీ ఎల్2 ఎంపురాన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వివరాలు తెలిశాయి. మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఎల్2 ఎంపురాన్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి నిన్న రిలీజైన సూపర్ స్టార్ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

L2 Empuraan OTT Release Platform: మలయాళంలో 2019లో రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా లూసిఫర్. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా చేస్తే.. మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

కాంబో రిపీట్

అయితే, లూసిఫర్ సీక్వెల్ కోసం ఆడియెన్స్, అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. దాంతో 2019 తర్వాత ఆరేళ్లకు లూసిఫర్ సీక్వెల్‌తో మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబో రిపీట్ అయింది. లూసిఫర్‌ను ఒక ట్రయాలజీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో సినిమాగా ఎల్2 ఎంపురాన్ సినిమాను చిత్రీకరించారు.

దర్శకత్వం-కీలక పాత్ర

మరోసారి స్టీఫెన్ నెడుంపల్లి పాత్రలో కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ నటించగా.. ఎల్2కి కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. అలాగే, ఇందులో కీలక పాత్రలో నటించాడు. దీనికి సంబంధించిన ట్రైలర్, టీజర్ మూవీపై భారీ అంచనాలను నెలకొల్పాయి. మురళీ గోపి కథ అందించిన ఎల్2ను ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు.

లూసిఫర్ క్లైమాక్స్ నుంచి

మార్చి 27న వరల్డ్ వైడ్‌గా మలయాళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఎల్2 ఎంపురాన్ రిలీజ్ అయింది. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు బ్యానర్‌లో విడుదల చేశారు. నిన్న థియేటర్లలో విడుదలైన ఎల్2 ఎంపురాన్‌కు టాక్ బాగానే వస్తోంది. లూసిఫర్ సినిమా క్లైమాక్స్ నుంచే ఎల్2 ఎంపురాన్ స్టార్ట్ అవుతుంది.

భారీ అవినీతికి పాల్పడే తమ్ముడు

ఐయూఎఫ్ పార్టీలో సమస్యలన్ని సద్దుమణుగిపించిన స్టీఫెన్ నెడుంపల్లి (తెలుగులో గట్టుపల్లి) అజ్ఞాతంలోకి వెళ్తాడు. పార్టీ పగ్గాలు, అధికారం చేతికొచ్చిన తర్వాత జతిన్ రామ్‌దాస్ (టొవినో థామస్) భారీగా అవినీతి చేస్తాడు. తన సోదరుడు చేస్తున్న అవినీతిని ఎదిరించడానికి స్టీఫెన్ రంగంలోకి దిగాడా లేదా అన్నదే కథ.

డ్రగ్స్ మాఫియా చుట్టూ

లూసిఫర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కితే ఎల్2 ఎంపురాన్ రాజకీయ అంశాలతోపాటు ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాను టచ్ చేసి తెరకెక్కించారు. ఇదిలా ఉంటే, మంచి రివ్యూలు అందుకున్న ఎల్2 ఎంపురాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇంట్రెస్ట్ నెలకొంది. ఎల్2 ఎంపురాన్ ఓటీటీ హక్కులను భారీ ధరకు జియోహాట్‌స్టార్ కొనుగోలు చేసిందని పింక్ విల్లా తెలిపింది.

ఎల్2 ఎంపురాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్

అలాగే, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ప్లాట్‌ఫామ్‌లో ఎల్2 ఎంపురాన్ ఓటీటీ రిలీజ్ కానుందని ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ పింక్ విల్లా వెల్లడించింది. ఇక సుమారు 4 నుంచి 7 వారాల వ్యవధిలో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ వంటి 5 భాషల్లో ఎల్2 ఎంపురాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం