L2 Empuraan Collections Record: రికార్డు సృష్టించిన ఎంపురాన్ సినిమా.. కానీ కలెక్షన్లలో డ్రాప్!-l2 empuraan box office collections record mohanlal movie is fastest 100 grosser in malayalam industry but saw drop ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  L2 Empuraan Collections Record: రికార్డు సృష్టించిన ఎంపురాన్ సినిమా.. కానీ కలెక్షన్లలో డ్రాప్!

L2 Empuraan Collections Record: రికార్డు సృష్టించిన ఎంపురాన్ సినిమా.. కానీ కలెక్షన్లలో డ్రాప్!

L2 Empuraan Collections Record: ఎల్2: ఎంపురాన్ చిత్రం అప్పుడే మైల్‍స్టోన్ దాటేసింది. ఓ రికార్డు క్రియేట్ చేసింది. అయితే, రెండో రోజు కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

L2 Empuraan Collections Record: మరో రికార్డు సృష్టించిన ఎంపురాన్ సినిమా.. కానీ కలెక్షన్లలో డ్రాప్!

మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన ఎల్2: ఎంపురాన్ భారీ అంచనాలతో వచ్చింది. స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమార్ ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించటంతో పాటు ఓ కీలకపాత్ర పోషించారు. ఈ వారమే మార్చి 27న రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. 2019లో వచ్చిన బ్లాక్‍బస్టర్ లూసిఫర్‌కు సీక్వెల్‍గా ఈ చిత్రం వచ్చింది. ఎల్2: లూసిఫర్ చిత్రం రెండు రోజుల్లోనే ఓ మైల్‍స్టోన్ దాటి రికార్డు సృష్టించింది.

రూ.100కోట్ల క్లబ్‍లోకి..

ఎల్2: ఎంపురాన్ చిత్రం రెండో రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసిన ఆశీర్వాద్ సినిమాస్ ప్రకటించింది. “48 గంటల్లోనే ఎంపురాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ అధిగమించింది. సినిమాటిక్ హిస్టరీలో కొత్త బెంచ్‍మార్క్ సెట్ చేసింది” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైంది.

రికార్డు ఇదే

మలయాళం ఇండస్ట్రీలో అత్యంత వేగంగా రూ.100కోట్ల మార్క్ సాధించిన చిత్రంగా ఎల్2: ఎంపురాన్ రికార్డు సృష్టించింది. పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఆడుకాలం తొమ్మిది రోజుల్లో రూ.100 కోట్ల మార్కును సాధించి ఇప్పటి వరకు టాప్‍లో ఉండగా.. ఎంపురాన్ దాన్ని దాటేసింది. రెండో రోజుల్లోనే రూ.100కోట్ల గ్రాస్ సాధించి మలయాళ ఇండస్ట్రీలో రికార్డు సృష్టించింది.

ఎల్2: ఎంపురాన్ మూవీకి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.67 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వచ్చాయి. మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ దక్కించుకుంది. అయితే, ఈ మూవీకి రెండో రోజు సుమారు రూ.40 కోట్ల గ్రాస్ సొంతమైనట్టు తెలుస్తోంది. దీంతో ఫాస్టెస్ట్ రూ.100కోట్ల మలయాళ చిత్రంగా మరో రికార్డు దక్కింది. కానీ ఫస్ట్ డేతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది. అయితే, శని, ఆదివారాల్లో వసూళ్లు పుంజుకునే ఛాన్స్ ఉంది. ఎల్2: ఎంపురాన్ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.

ఎల్2: ఎంపురాన్ చిత్రం మలయాళ ఇండస్ట్రీ నుంచి హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా వచ్చింది. ఈ చిత్రానికి సుమారు రూ.150కోట్ల బడ్జెట్ అయినట్టు అంచనా. ప్రమోషన్లకు కూడా మూవీ టీమ్ బాగా ఖర్చు చేసింది. ఈ చిత్రంలో ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్, డైరెక్షన్, యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అయితే, నరేషన్ స్లోగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మూవీని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీగోకులం మూవీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి ప్రొడ్యూజ్ చేశాయి. మోహన్‍లాల్, పృథ్విరాజ్‍తో పాటు టొవినో థామస్, అభిమన్యు సింగ్, మంజు వారియర్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. దీపక్ దేవ్ మ్యూజిక్ ఇచ్చారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం