Kushi Third Song: ఖుషి నుంచి మరో మెలోడీ సాంగ్.. ప్రోమో రిలీజ్.. ఫుల్ సాంగ్‍కు డేట్ ఫిక్స్
Kushi Third Song: ఖుషి చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్‍ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
Kushi Third Song: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న ఖుషి సినిమా పాటలతో మంచి పాపులర్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు లిరికల్ సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. ‘నా రోజా నువ్వే’, ‘ఆరాధ్య’ పాటలు మెలోడియస్‍గా ఉంటూ వీక్షకుల మనసులను దోచుకున్నాయి. ఖుషి చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు. రెండు పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాక ఇప్పుడు మూడో సాంగ్ రానుంది. ఖుషి టైటిల్ సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ నేడు (జూలై 27) విడుదల చేసింది. రేపు (జూలై 28) పూర్తి లిరికల్ సాంగ్ రానుంది. ఖుషి టైటిల్ సాంగ్ వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
“ఖుషి.. నువ్వు కనపడితే - ఖుషి.. నీ మాట వినపడితే” అంటూ ఖుషి టైటిల్ సాంగ్ ఉంది. ఈ మూడో సింగిల్ పూర్తి లిరికల్ సాంగ్ రేపు (జూలై 28) రానుంది. ఈ విషయాన్ని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. “ఎంతగానో ఎదురుచూస్తున్న మెలోడీ గ్లింప్స్ ఇదే. ఖుషి టైటిల్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. ఫుల్ సాంగ్ రేపు వస్తుంది” అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.
ఖుషి టైటిల్ సాంగ్‍ను కూడా మెలోడియస్‍గా స్వరపరిచాడు హేషమ్ అబ్దుల్ వాహబ్. తెలుగులో ఈ పాటను అబ్దుల్ వాహబ్ స్వయంగా పడాడు. ఈ సాంగ్‍కు తెలుగులో రిలిక్స్ అందించాడు దర్శకుడు శివ నిర్వాణ. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ టైటిల్ సాంగ్ కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రానుంది. ఆయా భాషలకు తగ్గట్టు లిరిక్ రైటర్స్, సింగర్స్ వేర్వేరుగా ఉన్నారు.
సెప్టెంబర్ 1వ తేదీన ఖుషి చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లు కాగా.. జయరామ్, సచిన్ కేడకర్, మురళి శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, యలమంచలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది లైగర్ మూవీ పరాజయం పాలవటంతో విజయ్ దేవరకొండకు ఖుషి చిత్రం చాలా కీలకంగా ఉంది.