Kushi fifth Song: ‘ఓసి పెళ్లామా’ అంటున్న విజయ్ దేవరకొండ.. ఖుషి ఐదో పాట ప్రోమో రిలీజ్
Kushi Fifth Song: ఖుషి సినిమా నుంచి ఐదో పాట కూడా వచ్చేస్తోంది. ఈ సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల తేదీని కూడా ప్రకటించింది.
Kushi Fifth Song: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ చిత్రంపై ఫుల్ క్రేజ్ ఉంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ ఖుషి సినిమాకు సంగీతం అందిస్తుండగా.. పాటలతోనే మంచి హైప్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే వచ్చిన నాలుగు పాటలు మంచి పాపులర్ అయ్యాయి. ఈ తరుణంలో ఐదో పాట ప్రోమోను కూడా చిత్ర యూనిట్ నేడు (ఆగస్టు 25) తీసుకొచ్చింది. ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్‍ను కూడా వెల్లడించింది. పాట వివరాలివే..
‘ఓసి పెళ్లామా’ అంటూ ఖుషి సినిమాలోని ఈ ఐదో పాట ఉంది. ఈ చిత్రంలో పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, సమంత మధ్య గొడవలు జరుగుతాయనేలా ట్రైలర్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ఫస్ట్రేషన్‍తో హీరో పాడుకునే సాంగ్‍లా ఈ ‘ఓసి పెళ్లామా’ పాట ఉంది. “కశ్మీర్‌లో ఫస్ట్ టైమ్ తనని చూసినా.. ముందెనక సూడకుండా మనసిచ్చినా” అంటూ ఈ పాట మొదలవుతుంది.
‘ఓసి పెళ్లామా’ పాటను మెలోడీలా కాకుండా కాస్త డిఫరెంట్‍గా స్వరపరిచాడు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ పాడారు. తెలుగులో ఈ పాటకు రిలిక్స్ అందించారు దర్శకుడు శివ నిర్వాణ. ‘ఓసి పెళ్లామా’ ఫుల్ లిరికల్ సాంగ్ రేపు (ఆగస్టు 26) రిలీజ్ చేయనున్నట్టు ఖుషి సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.
ఇటీవల ఖుషి చిత్ర యూనిట్ నిర్వహించిన మ్యూజిక్ కాన్సెర్టుకు మంచి స్పందన వచ్చింది. ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్‍గా నిలిచింది. ఈ చిత్రంపై హైప్ కోసం మ్యూజిక్‍ను హైలైట్ చేస్తోంది మూవీ యూనిట్.
ఖుషి సినిమాలో జయరామ్, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఖుషి రిలీజ్ కానుంది.