OTT Mystery Thriller: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. వరుసగా అమ్మాయిల మరణాలు.. మిస్టరీ ఏంటి! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-kushee ravi kannada mystery thriller ayyana mane will be streaming on zee5 ott this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Mystery Thriller: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. వరుసగా అమ్మాయిల మరణాలు.. మిస్టరీ ఏంటి! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Mystery Thriller: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. వరుసగా అమ్మాయిల మరణాలు.. మిస్టరీ ఏంటి! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Mystery Thriller: ఓటీటీలోకి ‘అయ్యన మనే’ థ్రిల్లర్ సిరీస్ వచ్చేస్తోంది. ఓ భవనంలో మిస్టరీతో సిరీస్ సాగనుంది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడొస్తుందంటే..

OTT Mystery Thriller: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్

కన్నడ నటి ఖుషి రవి ప్రధాన పాత్ర పోషించిన అయ్యన మనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా ఈ సిరీస్ రూపొందింది. ఈ కన్నడ సిరీస్‍కు రమేశ్ ఇందిర దర్శకత్వం వహించారు. రీసెంట్‍గా వచ్చిన ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్ పెంచేసింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా రివీల్ అయింది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

అయ్యన మనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 25వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. కన్నడలో రూపొందిన ఈ సిరీస్ ఇతర భాషల డబ్బింగ్‍లోనూ వస్తుందేమో చూడాలి.

అయ్యన మనే స్టోరీలైన్

1990ల బ్యాక్‍డ్రాప్‍లో అయ్యన మనే వెబ్ సిరీస్ సాగుతుంది. చిక్కమాగళూరూలోని ఓ పూర్వికుల భవనంలో అయ్యన మనే కుటుంబం ఉంటుంది. ఆ ఇంటికి కోడళ్లుగా వచ్చిన ముగ్గురు అమ్మాయిలు వరుసగా మరణిస్తారు. వారు చనిపోయిన విషయాన్ని ఆ కుటుంబం దాచేస్తుంది. పెళ్లి చేసుకొని అదే ఇంటికి కోడలిగా వస్తుంది జాజీ (ఖుషీ రవి). అనుమానాస్పదంగా చనిపోయిన అమ్మాయిల మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. నిజాలను బయటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయిలు ఎందుకు చనిపోయారు? ఈ మిస్టరీని జాజీ ఛేదిస్తుందా? అనే విషయాలు అయ్యన మనే సిరీస్‍లో ఉంటాయి.

అయ్యన మనే సిరీస్‍లో ఖుషీ రవితో పాటు అక్ష్య నాయక్, మానసి సుధీర్, విజయ్ శోభరాజ్, రమేశ్ ఇందిర కీలకపాత్రలు పోషించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‍ను తెరకెక్కించారు డైరెక్టర్ రమేశ్ ఇందిర. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఈ సిరీస్‍ను శృతి నాయుడు నిర్మించారు. ఏప్రిల్ 25 నుంచి ఈ సిరీస్‍ను జీ5లో చూడొచ్చు.

జీ5 ఓటీటీలో గత వారం కింగ్‍స్టన్ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించారు. థియేటర్లలో మార్చి 7న రిలీజైన ఈ మూవీ పెద్దగా కలెక్షన్లు దక్కించుకోలేకపోయింది. జీ5 ఓటీటీలో తమిళం, తెలుగు భాషల్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం