OTT Thriller Movies: మలయాళం స్టార్ హీరోల్లో ఒకడు కుంచకో బొబన్ (Kunchako Boban). అతడు నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వచ్చింది. ఫిబ్రవరిలో రిలీజై సంచలన విజయం సాధించిందీ మూవీ. మరి కుంచకో నటించిన మరిన్ని థ్రిల్లర్ మూవీస్ కూడా ఓటీటీలో ఉన్నాయి. అవేంటో చూడండి.
కుంచకో బొబన్ గతంలో వైరస్, 2018, బౌగేన్‌విల్లే, నిజల్, నాయట్టు, అంజామ్ పతీరా లాంటి థ్రిల్లర్ సినిమాల్లో నటించాడు. ఈ మూవీస్ ప్రస్తుతం సోనీ లివ్, జీ5, ఆహా వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి.
నాయట్టు ఓ తప్పుడు హత్య కేసులో ఇరుక్కొన్న ముగ్గురు పోలీసుల చుట్టూ తిరిగే స్టోరీ. ఇందులో కుంచకోతోపాటు జోజు జార్జ్, నిమిషా సజయన్ కూడా నటించారు. తమను తప్పుడు కేసులో ఇరికించారని తెలుసుకొని పారిపోయే ఈ ముగ్గురు పోలీసులు చివరి వరకూ ఎలా తప్పించుకుంటారన్నది ఈ థ్రిల్లర్ మూవీలో చూడొచ్చు. తెలుగులో ఆహా వీడియోలో చుండూరు పోలీస్ స్టేషన్ పేరుతో ఈ సినిమా ఉంది.
కేరళలో 2018లో వచ్చిన నిపా వైరస్ ఆధారంగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఇది. ఈ వైరస్ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఈ వైరస్ ఆటకట్టించడానికి కేరళలోని వైద్య నిపుణులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు ఎలా కలిసి పనిచేశారన్నది కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో డాక్టర్ సురేష్ రాజన్ అనే పాత్రలో కుంచకో నటించాడు.
2018 కూడా ఓ అద్భుతమైన మలయాళం థ్రిల్లర్ మూవీ. ఆ ఏడాది కేరళలో వచ్చిన వరదల వల్ల అక్కడి ప్రజలు ఎలాంటి అష్టకష్టాలు పడ్డారో ఈ సినిమాలో చూపించారు. ఇందులో కుంచకోతోపాటు టొవినో థామస్ కూడా నటించాడు. మంజుమ్మెల్ బాయ్స్ కంటే ముందు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.
అంజామ్ పతీరా ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. సన్ నెక్ట్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇందులో ఓ క్రిమినాలజిస్ట్ గా కుంచకో నటించాడు. పోలీసులకు సవాలుగా మారిన ఓ సీరియల్ కిల్లర్ ను అతడు తన తెలివితేటలతో ఎలా పట్టించాడన్నది ఇందులో చూడొచ్చు.
బౌగేన్‌విల్లే గతేడాది కుంచకో బొబన్ లీడ్ రోల్లో నటించిన ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో అతని నటన మరో లెవెల్ అని చెప్పొచ్చు. ఫహాద్ ఫాజిల్ కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇందులో నటించాడు. సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమా చూడొచ్చు.
నిజల్ 2021లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఇందులో కుంచకో ఓ మెజిస్ట్రేట్ పాత్రలో నటించాడు. నయనతార కూడా నటించిన సినిమా ఇది. ఓ ప్రమాదం నుంచి కోలుకుంటూ మళ్లీ తన విధులు మొదలుపెట్టిన మెజిస్ట్రేట్.. ఓ 8 ఏళ్ల బాలుడి కేసును చూస్తుంటాడు. అతడు చెప్పే మర్డర్ స్టోరీలు మెజిస్ట్రేట్ ను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.
సంబంధిత కథనం