బిచ్చగాడిగా ధనుష్.. మనీ పవర్ చూపించాలనుకునే నాగార్జున.. ఇంట్రెస్టింగ్ గా కుబేర ట్రైలర్-kubera trailor dhanush as begger nagarjuna shows power as rich man rashmika mandanna sekhar kammula ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బిచ్చగాడిగా ధనుష్.. మనీ పవర్ చూపించాలనుకునే నాగార్జున.. ఇంట్రెస్టింగ్ గా కుబేర ట్రైలర్

బిచ్చగాడిగా ధనుష్.. మనీ పవర్ చూపించాలనుకునే నాగార్జున.. ఇంట్రెస్టింగ్ గా కుబేర ట్రైలర్

కుబేరా ట్రైలర్: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన కుబేర ట్రైలర్ రిలీజైంది. ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

కుబేర మూవీలో ధనుష్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ తదితరులు నటించిన ‘కుబేర’ ట్రైలర్‌ను ఆదివారం (జూన్ 15) రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలోని ధనిక, పేద వర్గాలకు మధ్య ఉన్న డిఫరెన్స్.. మనీ పవర్ చుట్టూ కుబేర సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

బిచ్చగాడిగా

కుబేర ట్రైలర్ ధనుష్‌తో ప్రారంభమవుతుంది. అతను ఒక బిచ్చగాడి క్యారెక్టర్ చేశారు. కోటాను కోట్ల విలువ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చరిత్ర చెబుతున్న ప్రకారం ఈ దేశంలో నీతి, న్యాయం కాదు డబ్బు, పలుకుబడి పనిచేస్తాయని చెప్పే నాగార్జున పవర్ ఫుల్ రిచ్ పర్సన్ గా కనిపించారు. ధనుష్‌కు అండగానే నాగార్జున ఉన్నప్పటికీ దాని వెనుక ఏదో కారణం ఉంటుంది. నాగార్జున గ్రే షేడ్ లనూ కనిపిస్తారు. రష్మిక పాత్ర ధనుష్ నమ్మే వ్యక్తిలా ఉంది.

ధనవంతులే

ధనవంతులు, శక్తిమంతులు ఎల్లప్పుడూ ప్రపంచాన్ని ఏలుతారని రష్మిక మంధాన క్యారెక్టర్ నమ్ముతుంది. ఒక బిచ్చగాడు ప్రభుత్వాన్ని ఎలా ప్రమాదంలో పడేశాడని ఒక పాత్ర ఆశ్చర్యపోతుంది. ధనుష్ కోసం నాగార్జున వెతకడంతో ట్రైలర్ మరింత ఇంటెన్స్ గా మారుతుంది. ధనుష్ సమాజానికి సవాలు విసరడంతో ఇది ముగుస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే శేఖర్ కమ్ముల మరోసారి తన డైెరెక్షన్ తో స్క్రీన్ పై మ్యాజిక్ చేసేలా కనిపిస్తున్నారు.

రెండు రోజుల ఆలస్యంగా

అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా కుబేర ఈవెంట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కుబేరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మొదట జూన్ 13న జరగాల్సి ఉండగా, అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం కారణంగా వాయిదా పడింది. సినిమా బృందం ప్రకటన చేస్తూ.. “రేపు జరగాల్సిన కుబేరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా వాయిదా వేశాం. బాధిత కుటుంబాలకు మేము అండగా ఉంటాము” అని ప్రకటించారు. జూన్ 15న హైదరాబాద్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఆ రోజే రిలీజ్

కుబేర మూవీ జూన్ 20న విడుదల కానుంది. అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సునీల్ నారంగ్. పుస్కుర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సినిమాలో బిచ్చగాడి పాత్ర పోషించిన ధనుష్ గంటల తరబడి డంప్‌యార్డ్‌లో షూటింగ్ చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. పిప్పి పిప్పి డుమ్ డుమ్ పాట విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “ప్రపంచంలోని మరో భాగాన్ని చూడటానికి, మీరు చూడని ఒక దృశ్యాన్ని చూడటానికి... మీరు ఎల్లప్పుడూ మీ కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. మీకు అనుకూలమైనది మాత్రమే చేస్తారు, మీరు రక్షించబడతారు. నేను చాలా సాధారణ నేపథ్యం నుండి వచ్చాను” అని అన్నారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం