థియేటర్లలో రిలీజ్ కు సిద్ధమవుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘కుబేర’ ఒకటి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ధనుష్, నాగార్జున మల్టీస్టారర్.. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మంధాన కాంబినేషన్ అంచనాలు పెంచేస్తోంది. ఇక ఫీల్ గుడ్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అనే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ నెలకొందని తెలిసింది.
ధనుష్, నాగార్జున ‘కుబేర’ మూవీ ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ తో డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్ లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ హక్కులు దక్కించుకుందని తెలిసింది. అది కూడా రూ.50 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుందన్నది ట్రేడ్ వర్గాల మాట.
కుబేర మూవీ మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుందని తెలిసింది. కుబేరుడు అంటేనే సంపద దేవుడు. ఈ నేపథ్యంలో కుబేర మూవీలో ధనుష్, నాగార్జున మధ్య సీన్స్ అలరించే అవకాశముంది. ధనవంతుడిగా మారేందుకు పేదవాడు వేసిన ఎత్తులు ఈ మూవీలో హైలైట్ గా నిలుస్తాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు వరుసగా పాన్ ఇండియా సినిమాల సూపర్ హిట్లతో జోరుమీదున్న రష్మిక మంధాన కూడా ఈ మూవీలో కీలకం.
ఫీల్ గుడ్ సినిమాలతో మెప్పించే డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సారి ‘కుబేర’తో ప్రయోగం చేశారనే చెప్పొచ్చు. సోషల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ హిట్ పై ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లకు రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు కలిసి కుబేరను నిర్మించాయి.
ప్రముఖ నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవల రిలీజైన ‘పోయిరా మావ’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మూవీ గ్లింప్స్ కూడా అంచనాలు పెంచేశాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రెడీ అవుతున్న ఈ మూవీ కోసం రూ.120 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం ఓ రేంజ్ లో జరుగుతోంది.
సంబంధిత కథనం