ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా వచ్చే శుక్రవారం (జూన్ 20) రిలీజ్ కానుండగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ధనుష్ లాంటి స్టార్ ఉన్నా తమిళనాడులో ఈ సినిమా ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు.
కుబేర మూవీలో నాగార్జున, రష్మికతో కలిసి ధనుష్ స్క్రీన్ పంచుకోనున్నాడు. దీంతో సహజంగానే మూవీపై ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయని భావించిన మేకర్స్ కు షాక్ తగిలింది. ఇక్కడ నైజాం ఏరియాలో బుకింగ్స్ ఫర్వాలేదనిపిస్తున్నా.. తమిళనాడులో మాత్రం అసలు బజ్ లేదు.
ధనుష్ మూవీ వస్తుందంటే కనిపించే సందడి ఇప్పుడు లేదు. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత దారుణంగా ఓ ధనుష్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. రాయన్ తర్వాత ధనుష్ కనిపిస్తున్న సినిమా ఇది. ఇందులో ధనుష్ ఓ బిచ్చగాడి పాత్రలో నటించాడు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్బా తదితరులు నటించిన ‘కుబేర’ ట్రైలర్ ఈ మధ్యే రిలీజైంది. సమాజంలోని ధనిక, పేద వర్గాలకు మధ్య ఉన్న డిఫరెన్స్.. మనీ పవర్ చుట్టూ కుబేర సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
కుబేర ట్రైలర్ ధనుష్‌తో ప్రారంభమవుతుంది. అతను ఒక బిచ్చగాడి క్యారెక్టర్ చేశాడు. చరిత్ర చెబుతున్న దాని ప్రకారం ఈ దేశంలో నీతి, న్యాయం కాదు డబ్బు, పలుకుబడి పనిచేస్తాయని చెప్పే నాగార్జున పవర్ ఫుల్ రిచ్ పర్సన్ గా కనిపించాడు. ధనవంతులు, శక్తిమంతులే ఎప్పుడూ ప్రపంచాన్ని ఏలుతారని రష్మిక మందన్నా క్యారెక్టర్ నమ్ముతుంది.
మొత్తంగా ఈ మూడు ప్రధాన పాత్రల చుట్టూ కుబేర మూవీ తిరగనుంది. అంతేకాదు తొలిసారి శేఖర్ కమ్ముల సినిమాలో కమర్షియల్ హంగులు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర కుబేర ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా కుబేరపై భారీ ఆశలే పెట్టుకుంది.
సంబంధిత కథనం