Krithi Shetty: తల్లి పాత్రలో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి.. క్లారిటీ ఇచ్చిన బేబమ్మ!
Krithi Shetty Mother Role In Manamey Movie: ఉప్పెన బ్యూటి బేబమ్మ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న సరికొత్త సినిమా మనమే. శర్వానంద్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టిది మదర్ క్యారెక్టర్ అని సమాచారం. దీనిపై తాజాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది బేబమ్మ కృతి శెట్టి.
Krithi Shetty Mother Role In Manamey: ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు రాష్ట్ర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది బ్యూటిఫుల్ కృతి శెట్టి. వరుస ఫ్లాప్ మూవీస్ తర్వాత కృతి శెట్టి హీరోయిన్గా చేస్తున్న సినిమా మనమే. ఇందులో హీరోగా శర్వానంద్ చేస్తున్నాడు. డైనమిక్ హీరో శర్వానంద్ కెరీర్లో 35వ మూవీగా వస్తోంది ఈ మనమే. ఈ హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్‌గా మనమే సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. జూన్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న మనమే సినిమా విశేషాలను హీరోయిన్ కృతి శెట్టి మూవీ విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
'మనమే'లో మీ క్యారెక్టర్ ఎలా ఉండనుంది ?
ఇందులో నా క్యారెక్టర్ పేరు సుభద్ర. ఇప్పటి వరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ, ఈ క్యారెక్టర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. షూటింగ్ సమయంలో డైరెక్టర్ శ్రీరామ్ గారిని ఇంత స్ట్రిక్ట్‌గా ఉంటుందా? అని చాలా సార్లు అడిగాను. ఆయన అంత స్ట్రిక్ట్‌గా కావాలని చెప్పారు. ఆయన విజన్‌ని ఫాలో అయ్యాను.
సుభద్ర పాత్రకు మీకు పోలికలు ఉన్నాయా ?
పర్సనల్‌గా నాకు పెద్దగా కోపం రాదు. పెద్దగా అరవను. చాలా కామ్‌గా ఉంటాను. సుభద్ర క్యారెక్టర్ నాకు పూర్తిగా కొత్త.
టీజర్లో బేబీ కనిపిస్తోంది. ఇందులో మదర్‌గా కనిపిస్తారా?
అది తెలీదు. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది (నవ్వుతూ). సినిమా చూసినప్పుడే నా క్యారెక్టర్ ఏమిటనేది పూర్తిగా తెలుస్తుంది.
డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారు కథ చెప్పినపుడు మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏంటీ?
మనమే స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్ ఉన్న ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఇందులో వండర్ఫుల్ కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉంది. అది గ్లోబల్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మా ముగ్గురి క్యారెక్టర్స్ చుట్టూ ఉంటుంది. అందుకే మనమే అనే పేరు పెట్టాం. ఇది పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రతి సీన్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.
ఉప్పెనలో బేబమ్మ క్యారెక్టర్‌కి వచ్చిన రెస్పాన్స్, ఇందులో సుభద్ర క్యారెక్టర్‌కి వస్తుందా?
రావాలనే కోరుకుంటున్నాను. అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపైనే ఉంటుంది. ఉప్పెన రస్టిక్ లవ్ స్టొరీ. మనమే ఒక రొమ్-కాం. మనమే లో నా క్యారెక్టర్ లో మంచి ఎమోషన్ ఉంది. అది ప్రేక్షకులుకి నచ్చుతుందనే ఆశిస్తున్నాను.
మనమేలో మ్యూజిక్ ఎలా ఉంటుంది?
హేశం అబ్దుల్ వహాబ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. టప్పా టప్పా మంచి డ్యాన్స్ నెంబర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది.
టాపిక్