Krishnamma Collection: కృష్ణమ్మ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్- సత్యదేవ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్- ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Krishnamma Box Office Collection: హీరో సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ సినిమాకు తొలి రోజు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఇవి సత్యదేవ్ సినీ కెరీర్‌లో ది బెస్ట్ ఓపెనింగ్స్ కలెక్షన్స్‌గా రికార్డ్‌కు ఎక్కాయి. మరి కృష్ణమ్మ సినిమాకు తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయనే లెక్కల్లోకి వెళితే..
Krishnamma Box Office Collection: వెర్సటైల్ హీరో సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం కృష్ణమ్మ. వీవీ గోపాలకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దేవర సినిమా డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. అనేక విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేశారు.

సత్యదేవ్‌లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన చిత్రంగా కృష్ణమ్మ మనన్నలు అందుకుంటోంది. సినిమాలో సత్యదేవ్ రగ్డ్ లుక్, రస్టిక్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. సత్యదేవ్ సినీ కెరీర్‌లో కృష్ణమ్మ సినిమా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి రోజునే రూ. 1 కోటి గ్రాస్ వసూళ్లను సినిమా రాబట్టుకుంది. సత్యదేవ్ కెరీర్‌లో ఏ సినిమాకు ఓపెనింగ్ డే ఇలాంటి కలెక్షన్స్ రాలేదు.
అలాగే కృష్ణమ్మ సినిమాకు తొలి రోజు సుమారు రూ. 70 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక రెండు రోజుల్లో ఈ సినిమాకు రూ. 1.08 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు రూ. 50 లక్షలు, రెండో రోజున రూ. 58 లక్షల నెట్ కలెక్షన్స్ ఉన్నట్లుగా అంచనా వేశాయి.
కాగా ఓ వైపు ఎన్నికలు, మరో వైపు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ నేపథ్యంలో విడుదలైన కృష్ణమ్మ చిత్రానికి మంచి కలెక్షన్స్ రాబట్టుకోవటం మంచి పరిణామం అని మేకర్స్ చెబుతున్నారు. సత్యదేవ్ కెరీర్‌లో బెస్ట్ మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇవే అని తెలిపారు. కాగా కృష్ణమ్మ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా రూ. 3 కోట్లు ఉంది.
కృష్ణమ్మ సినిమాకు ఇటు ప్రేక్షకుల నుంచే కాదు, అటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నట్లు మేకర్స్ తెలిపారు. మంచి మౌత్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంది. మే నెలాఖరు వరకు పెద్దగా రిలీజెస్ లేనందున కృష్ణమ్మ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రేక్షకులను చక్కటి యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటూ థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది కృష్ణమ్మ. కృష్ణమ్మ సినిమాలో స్నేహం, ప్రేమ వంటి అంశాలతో మిళితమైన యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తున్నాయి. సత్యదేవ్‌తో పాటు లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, అతీరా రాజ్ కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించారు.