Krishna Mukunda Murari Today Episode: మురారి ప్లాన్ వ‌ర్క‌వుట్ - కృష్ణ ఆనందానికి అవ‌ధులు లేవుగా!-krishna mukunda murari today episode krishna mukunda murari may 26th episode
Telugu News  /  Entertainment  /  Krishna Mukunda Murari Today Episode Krishna Mukunda Murari May 26th Episode
కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

Krishna Mukunda Murari Today Episode: మురారి ప్లాన్ వ‌ర్క‌వుట్ - కృష్ణ ఆనందానికి అవ‌ధులు లేవుగా!

26 May 2023, 9:40 ISTHT Telugu Desk
26 May 2023, 9:40 IST

Krishna Mukunda Murari Today Episode: మురారికి కృష్ణ రోజురోజుకు ద‌గ్గ‌ర‌వుతోండ‌టం, కుటుంబ‌స‌భ్యుల మెప్పును పొందుతూ మంచి పేరు తెచ్చుకోవ‌డం ముకుంద స‌హించ‌లేక‌పోతుంది. కృష్ణ ను మురారికి దూరం చేయ‌డానికి ముకుంద ఏం చేయ‌నుందంటే...

Krishna Mukunda Murari Today Episode: మురారితో ప్రేమ‌లో పూర్తిగా ప‌డిపోతుంది కృష్ణ‌. మ‌ధుక‌ర్ రీల్ వీడియో ద్వారా అత‌డికి త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తుంది. త‌న‌పై ఆమెకున్న ప్రేమ చూసి మురారి కూడా మురిసిపోతాడు. మ‌రోవైపు ఆ రీల్ వీడియోలో కృష్ణ న‌ట‌న బాగుందంటూ మ‌ధుక‌ర్ చెప్పిన మాట‌ల‌కు రేవ‌తితో పాటు ఫ్యామిలీ మెంట‌ర్స్ అంద‌రూ ఆనంద‌ప‌డిపోతారు. ఆమెకు కంగ్రాట్స్ చెబుతుంటారు.

వారంద‌రూ కృష్ణ‌ను పొగుడుతుంటే ముకుంద మాత్రం స‌హించ‌లేక‌పోతుంది. రోజురోజుకు కృష్ణ‌, మురారి ద‌గ్గ‌ర‌వుతుండ‌టంతో ఆమెలో భ‌యం మ‌రింత పెరుగుతుంది. ఆమె కంగారును మురారి గ్ర‌హిస్తాడు. త‌న‌ను ముకుంద అస‌హ్యించుకునేలా చేయాల‌నే ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని అనుకుంటాడు. ఆ డోస్ మ‌రింత పెంచాల‌ని నిర్ణ‌యించుకుంటాడు.

ఆనందంలో కృష్ణ‌...

త‌న జీవితంలోని క‌ష్ట‌సుఖాల్ని తండ్రితోనే మొద‌ట పంచుకునే కృష్ణ....మురారిని ప్రేమిస్తోన్న విష‌యాన్ని అత‌డికే చెబుతుంది. తండ్రి ఫొటో ముందు నిల‌బ‌డి తాను మురారిని ప్రేమిస్తోస్తోన్నాన‌ని అంటుంది. మురారికి ఐ ల‌వ్ యూ చెప్పిన ఆనందంలో ఆమె మ‌న‌సు తేలిపోతుంది. కృష్ణ సంతోషం చూసి మురారిలో జోష్ వ‌స్తుంది. అగ్రిమెంట్ ముగిసినా కృష్ణ ను త‌న‌తోనే ఉండిపొమ్మ‌ని మురారి న ఏటి ఎపిసోడ్‌లో కోర‌నున్న‌ట్లు తెలుస్తోంది. మురారి ఆఫ‌ర్‌కు కృష్ణ ఏమ‌ని స‌మాధాన‌మిస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ముకుంద క‌ఠిన నిర్ణ‌యం…

రోజురోజుకు మురారి త‌న‌కు దూరం కానుండ‌టంతో, అత‌డి మ‌న‌సు క‌ఠినంగా మారిపోతుండ‌టం ముకుంద‌కు అంతుప‌ట్ట‌దు. కృష్ణ వెళ్లిపోగానే మురారిని ఎలాగైనా పెళ్లి చేసుకొని తీరాల‌ని నిశ్చ‌యించుకుంటుంది. మురారితో చేసిన ఛాలెంజ్‌లో నెగ్గ‌డం కోసం ముకుంద ఓ క‌ఠిన నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఆ నిర్ణ‌యం మురారి, ముకుంద జీవితాల్ని ఏ మ‌లుపులు తిప్ప‌నుంద‌న్న‌ది నేటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే. ముకుంద ప్లాన్స్‌ను మురారి అడ్డుకుంటాడా? లేదా? అన్న‌ది కూడా నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్‌లో తేల‌నుంది.