Krishna mukunda murari serial climax: శుభం.. ముకుందను మార్చుకున్న ఆదర్శ్, భవానీ ఇంట వెల్లివిరిసిన ఆనందం
Krishna mukunda murari serial today june 8th climax episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ చివరి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ముకుంద రూపం మార్చుకుని వచ్చిందని ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. ఆదర్శ్ తనను మార్చుకుంటానని చెప్తాడు.
Krishna mukunda murari serial today june 8th climax episode: కృష్ణ కళ్ళు తిరిగి పడిపోవడంతో పరిమళ వచ్చి చెక్ చేస్తుంది. వారసులు కావాలని అడిగారు కదా కృష్ణ మీకు వారసులను ఇవ్వబోతుందని చెప్పడంతో భవానీ ఆనందానికి అవధులు ఉండవు. ముకుంద మాత్రం షాక్ అవుతుంది. మీరు నానమ్మ కాబోతున్నారు భవానీ గారు అని పరిమళ చెప్తుంది.
తల్లి కాబోతున్న కృష్ణ
గర్భసంచి లేకపోతే కడుపు వచ్చిందని చెప్తుంది ఏంటని ముకుంద అనుకుంటుంది. గర్భసంచి తీసేశారు కదా డాక్టర్ అది మీకు కూడ తెలుసు కదా అని కృష్ణ అడుగుతుంది. ఒక పేషెంట్ కి నెగటివ్ రిపోర్ట్ వస్తే సేఫ్ సైడ్ గా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం కదా. మరి నువ్వు ఎందుకు ఒక రిపోర్ట్ ని నమ్మావు.
కృష్ణ గర్భసంచి పోలేదా అని రేవతి అడుగుతుంది. కృష్ణ తల్లి కాబోతుందని పరిమళ చెప్పేసరికి అందరూ నమ్ముతారు. కృష్ణ పట్టరాని సంతోషంలో ఉంటుంది. వైదేహి చెప్పేసరికి సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని కృష్ణ చెప్తుంది. ఆ వైదేహి మీరాతో కలిసి డ్రామా చేసింది దాని మాటలు ఎలా నమ్మావని భవానీ అంటుంది.
ముకుంద చిన్నగా జారుకుంటుంటే భవానీ తనని ఆపుతుంది. ఎవరు నువ్వు అంటే నేను మీరాని అంటుంది. అ మాట చెప్పగానే భవానీ లాగిపెట్టి ఒకటి పీకుతుంది. అడిగేది నీ పేరు కాదు మా ఇంటి మీద పగ పట్టావు ఇంత అల్లకల్లోలం సృష్టించావు ఎవరు నువ్వు అంటుంది.
ముకుందే మీరా
కృష్ణ ఇది ఎవరో దీని బాగోతం ఏంటో నీకు మొత్తం తెలుసని నాకు తెలుసు చెప్పమని భవానీ అడుగుతుంది. నేను చెప్పడం కాదు అది తన నోటితో చెప్తేనే అన్నింటికీ ముగింపు దొరుకుతుందని అనేసరికి మీరా గట్టిగా నవ్వుతుంది. చాలా ప్రయత్నాలు చేశాను కృష్ణ కానీ ఏవి వర్కౌట్ కాలేదు.
నేను మిమ్మల్ని నమ్మించలేకపోయాను అత్తయ్య అంటుంది. ఎవరే నీకు అత్తయ్య అని ముకుంద అంటే భవానీ కొట్టేందుకు చెయ్యి లేపుతుంది. ముకుందకు మీరు అత్తయ్య కదా నాకు మీరు అత్తయ్య అని నవ్వుతుంది. కృష్ణ నేనే ముకుంద అని చెప్పిన విషయం చూపిస్తారు. అక్కడితో సీన్ కట్ చేస్తారు. మీరా కడుపులో పెరుగుతుంది మురారి వాళ్ళ బిడ్డ.
కృష్ణ కడుపులో పెరుగుతుంది వాళ్ళ బిడ్డే. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదని భవానీ తలపట్టుకుంటుంది. కృష్ణ తల్లి అవుతుందని ముకుంద కడుపులో ఉన్న బిడ్డను వదులుకోలేము కదాని రేవతి అంటుంది. ఇటు ముకుందను వద్దని అనుకోలేము, బిడ్డను వదులుకోలేమని అనుకుంటారు.
ఆదర్శ్ పశ్చాత్తాపం
మురారి ఎక్కడని భవానీ అడుగుతుంది. ఆదర్శ్ వచ్చి భవానీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు. నేను కృష్ణని ఎంత దారుణంగా అపార్థం చేసుకున్నానని పశ్చాత్తాపపడతాడు. కృష్ణకు చేతులెత్తి క్షమాపణ చెప్తాడు. మురారి నాకోసం త్యాగం చేస్తే అంటగట్టాడు అని మాట్లాడానని బాధపడతాడు.
పరిస్థితుల వల్ల అలా మాట్లాడావు చివరికి అర్థం చేసుకుంటే చాలని కృష్ణ తనని క్షమిస్తుంది. మురారి వచ్చాక ముకుంద వల్ల మళ్ళీ ఎలాంటి గొడవలు రాకూడదని అనుకుంటాడు. తాను మార్చుకుంటానని ఆదర్శ్ మాట ఇస్తాడు. ఒకరకంగా ఆలోచిస్తే ముకుంద బిడ్డను మోస్తున్న తను పవిత్రంగా ఉంది.
ముకుందను మార్చుకుంటా
తను కృష్ణ, మురారి మధ్యకు రాకుండా ఉండాలన్నా బిడ్డ క్షేమంగా ఉండాలంటే తనకు ఒక కాపలా కావాలి. ఎంత కాదన్న ముకుంద నా భార్య కదా. తన భర్తగా నేను అనకు కాపలా ఉంటాను. దానితో కలిసి ఉంటే ఏం సుఖపడతావని రేవతి బాధపడుతుంది.
నేను తప్ప తనని ఎవరూ ఆపలేరు. రూపం మారినా తన గుణం మారలేదు. తనని నేను మార్చుకుంటాను. తను మారాకే మళ్ళీ తిరిగి ఈ గడపలో కాలు పెడతానని చెప్తాడు. ఈ మాటలన్నీ ముకుంద వింటూనే ఉంటుంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు కాదు ఆదర్శ్ ఏసీపీ సర్ దగ్గరకు అంటుంది.
అందరూ కలిసి హాస్పిటల్ లో ఉన్న మురారి దగ్గరకు వెళతారు. కొడుకును చూసి భవానీ ఎమోషనల్ అవుతుంది. నేను ఏ తప్పు చేయలేదని చెప్తాడు. ముకుంద నా వల్లే తల్లి కాబోతుందని చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే కృష్ణకి గర్భసంచి లేదని చెప్పాలి.
నేను ప్రెగ్నెంట్ ఏసీపీ సర్
కృష్ణకు పిల్లలు పుట్టకపోతే ఎక్కడకు బయటకు వెళ్లగొడతారోనని భయంతో వెళ్లిపోయాను. బైక్ డ్రైవ్ చేస్తూ లారీని ఢీ కొట్టాను. కళ్ళు తెరిచే చూస్తే ముకుంద దగ్గర ఉన్నాను. పిల్లలు పుట్టకపోతే బయటకు పంపిస్తానని ఎలా అనుకున్నావ్. అయినా కృష్ణకు పిల్లలు పుడతారు.
తనకు ఇప్పుడు మూడో నెల అనేసరికి మురారి ఆశ్చర్యపోతాడు. కృష్ణ కూడ అవునని చెప్తుంది. నాకు గర్భసంచి పోలేదు తీసేయమని ముకుంద వైదేహికి చెప్పిన తీయకుండా అలాగే ఉంచింది. కానీ ముకుంద చెప్పినట్టుగా సరోగసి మాత్రం చేసింది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో మురారి చాలా సంతోషిస్తాడు.
ఆదర్శ్ మురారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాడు. నిజానిజాలు తెలుసుకోకుండా నిన్ను, కృష్ణని చాలా తప్పుగా అర్థం చేసుకున్నానని సారి చెప్తాడు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మురారి అంటాడు. ముకుందతో పాటు బిడ్డను కూడా ఇస్తున్నావ్ కదా అంటాడు.
ఆరునెలల తర్వాత..
కృష్ణకు బిడ్డ పుడుతుంది. ముకుంద మరొక బిడ్డను ఎత్తుకుని ఇంటికి వస్తుంది. మీ బిడ్డ ఎప్పటికీ మీ దగ్గరే ఉంటుందని చెప్తుంది. కృష్ణ బిడ్డను చూసి ఎమోషనల్ అవుతుంది. ఈ బిడ్డ మీ పాప తొమ్మిది నెలలు మోస్తానని బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు మీ బిడ్డను మీకు ఇచ్చేస్తున్నానని కృష్ణ చేతిలో పెడుతుంది.
మారిపోయిన ముకుంద
తనని ఎత్తుకుని కృష్ణ మురిసిపోతుంది. నేను చెప్పాను కదా కృష్ణ మార్చుకుంటాను అని అలాగే చేశాను. ఇప్పుడు ముకుంద రూపమే కాదు మనసు కూడ మారిపోయిందని ఆదర్శ్ చెప్తాడు. ప్రేమ పేరుతో మిమ్మల్ని ఎంత హింసించానో తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది.
క్షమించమని అడగటం తప్ప ఏం చేయలేను. ఇంకేప్పటికీ మీ మధ్యకు రానని చెప్పి వెళ్లిపోతుంటే వాళ్ళని మురారి ఆపుతాడు. నువ్వు మా మధ్య ఉండకూడదని కోరుకున్నామే కానీ కలిసి ఉండకూడదని కోరుకోలేదు. ఈ బిడ్డ మీద నాకు ఎంత హక్కు ఉందో నీకు అంతే ఉంది.
ఈ బిడ్డ నీదే
బిడ్డను వదులుకోవడం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. పైకి సంతోషంగా కనిపించినా ఒకప్పుడు ఏసీపీ సర్ దక్కలేదని కనిపించిన బాధ మళ్ళీ ఇప్పుడు పాపని నా చేతిలో పెట్టినప్పుడు బాధ కనిపించింది. నువ్వు ఏసీపీ సర్ మీద చూపించాలనుకున్న ప్రేమ మా బిడ్డ మీద చూపించు అనేసి పాపను కృష్ణ ముకుందకు తిరిగి ఇస్తుంది.
ముకుంద బిడ్డను ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటుంది. నేను మీకు కన్నీళ్ళు మిగిలిస్తే నువ్వు నాకు సంతోషాన్ని పంచుతున్నావని ఎమోషనల్ అవుతుంది. ఈ సంతోషం ఇప్పటికి దొరికిందని భవానీ అంటుంది. ఇద్దరి బిడ్డలను ఎత్తుకుని మురిసిపోతుంది. నేటితో కృష్ణ ముకుంద మురారి సీరియల్ కి శుభం కార్డు పడింది.