Krishna mukunda murari serial january 27th: అందరి ముందు అడ్డంగా బుక్కైన ముకుంద.. శోభనం ముహూర్తం పెట్టకుండా ఆపేసిన భవానీ
Krishna mukunda murari serial january 27th episode: ముకుంద మారిపోయిందని ఆదర్శ్ తో పాటు ఇంట్లో అందరూ నమ్ముతారు. కానీ తను మాత్రం మురారిని మర్చిపోలేక ఆదర్శ్ ని జీవితంలోని ఆహ్వానించలేక ఇబ్బంది పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Krishna mukunda murari serial today january 27th: రేవతి పంతుల్ని పిలిపించి రెండు జంటలకి కార్యం జరిపించాలని అనుకుంటుంది. అప్పుడే మురారి, కృష్ణ వస్తారు. కృష్ణని చూసి నందిని, మధు నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారని అంటుంది. ఈ ప్రపంచంలో ఎవరూ నీలా ఉండలేరని మధు అంటాడు. అందుకే కదా తింగరి అనెదని మురారి కూడా ఆట పట్టిస్తాడు. తింగరి తింగరి అని నన్ను ఇంట్లో జోకర్ ని చేశారు.
నేను కూడా ఇక నుంచి పెద్దత్తయ్య లాగా సీరియస్ గా ఉంటానని కృష్ణ ఛాలెంజ్ చేస్తుంది. రెండు నిమిషాలు కూడా ఉండలేవని రేవతి అంటే లేదు ఖచ్చితంగా ఉంటానని సీరియస్ గా ఫేస్ పెట్టేసి జూనియర్ భవానీ దేవిలాగా ఉంటానని అంటుంది. అప్పుడే భవానీ వచ్చి సోఫాలో కూర్చుంటుంది. కృష్ణ కూడా భవానీ మాదిరిగా సీరియస్ గా కూర్చుంటుంది. అది చూసి అందరూ నవ్వుతారు.
జూనియర్ భవానీ దేవిలా కృష్ణ
ఏమైంది కృష్ణని ఎవరైనా ఏమైనా అన్నారా?అని అడుగుతుంది. కృష్ణ మాత్రం కదలకుండా బొమ్మలా కూర్చుని ఉంటుంది. మీలా సీరియస్ గా రెండు నిమిషాలు ఉండమని చెప్పాం అందుకే ఇలా బిగుసుకుపోయిందని మురారి చెప్తాడు. తింగరి పిల్ల నాలా నువ్వు ఉంటావా ఒకరు మరొకరిలా ఉండటం కష్టం నీలా నువ్వు ఉండమని చెప్తుంది. పంతులు వస్తాడు.
అంటే ఇప్పుడు శోభనం కోసం ముహూర్తం పెడుతున్నారా? ఇందుకోసమా రమ్మన్నదని ముకుంద మనసులో టెన్షన్ పడుతుంది. మన శోభనానికి ముహూర్తం పెట్టడానికి వచ్చారు ఈరోజు కావచ్చు రేపు కావచ్చని మురారి గుసగుసలాడతాడు. ఆదర్శ్ ముకుంద వైపు ప్రేమగా చూస్తే తను మాత్రం ఇబ్బందిగా ఫీల్అవుతుంది. మరో పది పదిహేను రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవని పంతులు చెప్పేసరికి ముకుంద సంతోషపడుతుంది. మిగతా వాళ్ళు మాత్రం షాక్ అయిపోతారు. కృష్ణ మురారి మొహం చూసి నవ్వుకుంటుంది.
మనసులోనే మథన పడుతున్న ముకుంద
హమ్మయ్య పది రోజులు ఉంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చని ముకుంద మనసులో సంతోషపడుతుంది. సరే పది రోజుల తర్వాత ముహూర్తం పెట్టమని భవానీ చెప్తుంది. మంచి ముహూర్తాలు ఉన్నాయి కదా ఎందుకు భవానీ మేడమ్ ఇప్పుడే ముహూర్తం వద్దని అన్నారని పంతులు మనసులో అనుకుంటాడు.
ముకుంద ఒంటరిగా బయట నిలబడి ఉంటుంది. ఎక్కడ ముహూర్తం పెట్టేస్తారని భయపడ్డాను. పది రోజుల వరకు ముహూర్తాలు లేవని అనేసరికి ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది కానీ పాపం ఆదర్శ్ నా మీద ఎన్నో ఆశలతో వస్తే నిరాశే మిగులుతుంది. నా వల్ల మొన్నటి వరకు మురారి కృష్ణ సఫర్ అయ్యాడు. వాళ్ళు సంతోషంగా ఉన్నారని అనుకుంటే ఇప్పుడు ఆదర్శ్ అవుతున్నాడు.
ఆదర్శ్ చెయ్యి వేయడంతో అరిచిన ముకుంద
నేను ఏది కావాలని చేయడం లేదు. నా ఇష్టం వేరొకరికి కష్టంగా మారుతుంటే నేనేం చేయను. మురారిని మర్చిపోయి బతకడం నావల్ల కావడం లేదు. అత్తయ్య నన్ను అనుమానంగానే చూస్తుంది. ఏం చేయాలి అర్థం కావడం లేదు. అప్పుడే ఆదర్శ్ ముకుందని చూస్తాడు. ముహూర్తం లేదని అనేసరికి డిసప్పాయింట్ అయ్యిందా అనుకుంటాడు.
ఇంట్లో ఇన్ని డిస్టబెన్స్ వస్తున్నా ఇంతమంది బాధపడుతున్నా నేను మాత్రం నిన్ను ఎందుకు మర్చిపోలేకపోతున్నాను. దీని వల్ల ఎదురయ్యే పరిణామాలు తెలిసి కూడా ఎందుకు మారలేకపోతున్నాను. కొన్ని జీవితాలు తారుమారు అయిపోతాయి. కుటుంబం పరువు పోతుందని తెలిసి కూడా ఎందుకు మర్చిపోలేక పోతున్నాను. ఏముంది మురారి నీలో ఎందుకు నా మనసు నిన్ను వదిలి రాణాని అంటుందని అనుకుంటుండగా ఆదర్శ్ వచ్చి భుజం మీద చెయ్యి వేస్తాడు. దీంతో ముకుంద గట్టిగా భయపడి అరుస్తుంది. దీంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా బయటకి వచ్చేస్తారు.
అబద్ధం చెప్పిన ఆదర్శ్
ఏమైందని మధు, కృష్ణ అడుగుతారు. ఏం లేదని అంటుంది. ఏం లేకపోత ఎందుకు అలా గట్టిగా అరిచావని రేవతి కూడా అడుగుతుంది. బాగా ఇరుక్కుపోయాను ఏం చెప్పి తప్పించుకోవాలి. ఆదర్శ్ భుజం మీద చెయ్యి వేశాడని అరిచానని చెప్తే అత్తయ్యకి నా మీద అనుమానం మరింత పెరిగిపోతుందని ముకుంద ఆలోచిస్తుంది. ఆదర్శ్ చెప్పబోతుంటే ముకుంద అడ్డుపడి నేను చెప్తాను మేమిద్దరం మాట్లాడుకుంటుంటే చెట్టు మీద నుంచి తొండ పడిందని అబద్ధం చెప్తుంది. ఆదర్శ్ షాక్ అయిపోయి చూస్తాడు.
భవానీ అనుమానంగా చూస్తుంది. ఆదర్శ్ అంతే కదాని ముకుంద అడిగితే ఏం చేయాలో తెలియక తల ఊపుతాడు. మధు మాత్రం నిజంగానే తొండ పడిందా అని అనుమానంగా అడుగుతాడు. మళ్ళీ ఆదర్శ్ ని కూడా నిజంగానే తొండ పడిందా అంటాడు. ఏదైతే ఏంటి ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు కదా అని భవానీ అంటుంది. అందరూ వెళ్లిపోతారు. మధు మాత్రం ఇక్కడికి తొండలు వచ్చే ఛాన్స్ లేదు ఏదో జరిగిందని మనసులో అనుకుంటాడు.
ముకుంద పూర్తిగా మారిపోయిందని నమ్ముతున్న కృష్ణ మురారి
సోరి ఆదర్శ్ మీరు చెయ్యి వేశారని అనుకోలేదు మీద ఏదో పడినట్టు అనిపించిందని ముకుంద అంటుంది. జరిగింది చెప్పకపోవడమే మంచిది అయ్యింది. నేను చెయ్యి వేసినందుకు అరిచావంటే నేనంటే ఇష్టం లేదని వాళ్ళు అనుకుంటారని ఆదర్శ్ అంటాడు. సోరి ఆదర్శ్ నేను పూర్తిగా మారిపోయానని నువ్వు అనుకుంటున్నావ్ కానీ ఈ మనసు ఎప్పటికీ మారదని నీకు ఎలా చెప్పాలి. ఒకరకంగా ఇది మోసం చేయడమే. నిన్ను మాత్రమే కాదు అందరినీ మోసం చేస్తూ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. ఈ జీవితం ఎటు పోతుందో అర్థం కావడం లేదని బాధపడుతుంది.
మురారి, కృష్ణ గదిలోకి వస్తారు. ముహూర్తం లేదని అనేసరికి బాగా ఫీల్ అయిపోయారని కృష్ణ మురారిని ఆట పట్టిస్తుంది. ఆదర్శ్ ని తీసుకొచ్చాక అన్నీ అన్నావ్ ఇప్పుడు మాట మారుస్తున్నావని మురారి అంటాడు. ఆదర్శ్ రావడమే కాదు ముకుందతో సంతోషంగా ఉండాలి కదా అప్పుడే అన్ని అంటుంది. ఒకవేళ లేకపోతే ఏంటని మురారి అంటే లేకపోతే ఇక అంతే సంగతులని అనడంతో ఇది చాలా టూ టూ మచ్ అంటాడు. ప్రేమ అంతులేని కథగా మిగిలిపోవచ్చు కానీ శోభనం అంతులేని కథగా మిగిలిపోకూడదని చెప్తాడు. ముకుంద అసలు ఆదర్శ్ ని అంగీకరిస్తుందని నమ్మకం కలగలేదు. కానీ ఇప్పుడు అలా కాదు ఆదర్శ్ వచ్చాక తను పూర్తిగా మారిపోయింది.
ఆదర్శ్ వచ్చాక ముకుంద రిసీవ్ చేసుకున్న తీరు చూస్తుంటే అనుమానం అంతా పోయింది. ఆదర్శ్ ని ఆది అని పిలుస్తుంది వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని కృష్ణ అంటుంది. మురారి వాళ్ళ ముచ్చట తర్వాత మన ముచ్చట సంగతి చూడమని చెప్తాడు.
తరువాయి భాగంలో..
మధు అందరితో కలిసి మందు కొట్టడానికి కూర్చుంటాడు. తొండ పడితే పక్కకి జరుగుతారు కానీ అలా ఏదో జరిగిపోయినట్టు అరుస్తారా ఏంటని లాజిక్ గా మధు అడుగుతాడు. అది చూసి ముకుంద పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణకి చెప్తుంది. అందరూ మందు కొడుతున్నారని అంటుంది. ఆదర్శ్ తాగిన మత్తులో ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని ముకుంద టెన్షన్ పడుతుంది.