Krishna mukunda murari december 9th: బెడిసికొట్టిన భవానీ ప్లాన్, ముకుంద షాక్- కృష్ణ తన భర్త ఎవరో మురారీకి చెప్తుందా?-krishna mukunda murari serial december 9th episode bhavani plan mis fires ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari Serial December 9th Episode Bhavani Plan Mis Fires

Krishna mukunda murari december 9th: బెడిసికొట్టిన భవానీ ప్లాన్, ముకుంద షాక్- కృష్ణ తన భర్త ఎవరో మురారీకి చెప్తుందా?

Gunti Soundarya HT Telugu
Dec 09, 2023 07:51 AM IST

krishna mukund murari serial december 9th: కృష్ణకి మురారీని దూరం చేయాలనే ఉద్దేశంతో భవానీ తనకి పెళ్లి అయ్యిందనే నిజం బయట పెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

వేణి భర్త ఎవరో చెప్పమని రేవతిని అడిగిన మురారీ
వేణి భర్త ఎవరో చెప్పమని రేవతిని అడిగిన మురారీ (disney plus hot star)

Krishna mukunda murari december 9th: మురారీని కృష్ణ దగ్గరకి వెళ్ళకుండా చేయడం కోసం భవానీ వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. కృష్ణకి పెళ్లి అయ్యిందని తన భర్త క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కోనేటిలో దీపాలు వదులుతుందని భవానీ చెప్తుంది. అలా చేస్తే మురారీ కృష్ణతో చనువుగా ఉండకుండా ముకుందని పెళ్లి చేసుకుంటాడని భవానీ ఎత్తుగడ. కానీ తను ఒక రకంగా ఆలోచిస్తే అక్కడ మరొక రకంగా జరిగింది. మురారీ వేణి భర్త ఎవరు, ఎక్కడ ఉంటాడు, పెళ్లి అయితే ఇక్కడ ఎందుకు ఉంటుందని ఆలోచిస్తాడు. వేణి భర్త ఎవరో తెలుసుకోవాలని ఎంక్వైరీ మొదలు పెడతాడు.

ట్రెండింగ్ వార్తలు

మధుకర్ ని వేణి భర్త ఎవరో చెప్పమని మురారీ అడుగుతాడు. సరిగ్గా నిజం చెప్పే టైమ్ కి ముకుంద ఫోన్ చేసి ఏమి చెప్పొద్దని వార్నింగ్ ఇస్తుంది. దీంతో మధు విషయం చెప్పకుండా ఆగిపోతాడు. ముకుంద ఫోన్ చేసిన తర్వాత మధు వేణి భర్త గురించి చెప్పకుండా ఆగిపోయాడని మురారీ అనుమానపడతాడు. అటు ముకుంద మురారీకి గతం గుర్తుకు వస్తే ఎక్కడ దూరం అయిపోతుందోనని భయపడుతూ ఉంటుంది. తనకి గతం గుర్తుకు రాకూడదని దేవుడని వేడుకుంటుంది.

ముకుంద మీద బలపడుతున్న అనుమానం

ముకుందని కూడా వేణి భర్త ఎవరని అడుగుతాడు. మురారీ దగ్గర నుంచి ఇటువంటి ప్రశ్న వస్తుందని అసలు ఊహించలేదనుకుని మనసులో అనుకుంటుంది. కోపంగా ఆవిడ గురించి తనకేమి తెలియదని, అయినా తన విషయాలు ఎందుకు పట్టించుకుంటున్నావ్.. మన పెళ్లి గురించి ఆలోచించు. నాకు మళ్ళీ అన్యాయం చేయకు అని కోపంగా చెప్పేసి ముకుంద వెళ్ళిపోతుంది. దీంతో మురారీ అనుమానం మరింత బలపడుతుంది.

ముకుంద ఫోన్ చేసిన తర్వాతే మధు వేణి భర్త గురించి చెప్పకుండా ఆగిపోయాడు, ఇప్పుడు నేను అడిగితే ఇరిటేట్ అవుతుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని ఆలోచనలో పడతాడు. గదిలో దీని గురించే ఆలోచిస్తూ ఉండగా మధు వెళ్తూ కనిపిస్తాడు. తనని పిలిచి మళ్ళీ వేణి భర్త గురించి కనుక్కుండామని అనుకుంటాడు. కానీ మధు మాట్లాడుతూ ఉండగా తన తండ్రి ప్రసాద్ పిలవడంతో వెళ్ళిపోతాడు.

మమ్మల్ని ఎందుకు వేణిని అడగమన్న మధు

ఇక అందరూ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. మురారీ వచ్చి రేవతిని వేణి భర్త ఎవరని అడుగుతాడు. నేను ఒకటి అడుగుతాను అబద్ధం చెప్పకుండా నిజం చెప్తావా? అని మురారీ అడుగుతాడు. వేణి గారి భర్త ఎవరు? అతని పేరు ఏంటి? అని ప్రశ్నిస్తాడు. మురారీ అడిగిన ప్రశ్నలకు కంగారు పడుతుంది. ఎవరో కాదు నువ్వే అని చెప్పలేని పరిస్థితి తనదని రేవతి మనసులో అనుకుంటుంది. ఏం చెప్పాలో అర్థం కాక రేవతి అయోమయంగా చూస్తూ ఉంటుంది.

మురారీ కోపంగా టేబుల్ మీద ఉన్న ప్లేట్ నేలకేసి కొడతాడు. అసలు మా అందరినీ ఎందుకు అడగడం. నీకు వేణి గారు తెలియదా ఏంటి? నువ్వే నేరుగా తన దగ్గరకి వెళ్ళి అడగమని మధుకర్ చెప్తాడు. ఆ మాటకి ముకుంద, భవానీ టెన్షన్ పడతారు. మురారీ వెళ్ళి కృష్ణని తన భర్త గురించి అడిగితే నిజం చెప్తుందా? లేదంటే భవానీ మురారీని కృష్ణ దగ్గరకి వెళ్ళకుండా అడ్డుకుంటుందా? ఒక వేళ చెప్తే మురారీ నమ్ముతాడా? అనేది తెలియాలంటే ఈరోజు పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే దాక ఆగాల్సిందే.

ఆదర్శ్ వస్తున్నాడా?

ముకుంద భర్త ఆదర్శ్ తిరిగి రాబోతున్నాడు. పెళ్ళైన రోజే ముకుంద, మురారీ ప్రేమ విషయం తెలియడంతో ఆదర్శ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళ పాటు ఇంట్లో వాళ్ళకి కూడా తన ఆచూకీ తెలియదు. ఈ మధ్యకాలంలో ఆదర్శ్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఆదర్శ్ ఇంటికి రాబోతున్నాడు. దీనికి సంబంధించి వీడియోలు బయటకి వచ్చాయి. భవానీ క్యారెక్టర్ చేస్తున్న ప్రియ ఆదర్శ్ తిరిగి వస్తున్నాడు అంటూ తనతో ఉన్న వీడియో ఇన్ స్టా రీల్స్ లో పెట్టింది. అదే జరిగితే ముకుందతో మురారీ పెళ్లి ఆగిపోతుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.