Krishna Mukunda Murari September 18th Episode: ప్రియుడితో ముకుంద హనీమూన్ ప్లాన్ - అబద్ధం చెప్పి బుక్కైన మురారి
Krishna Mukunda Murari September 18th Episode: మురారిని పెళ్లి చేసుకొని తీరుతానని రేవతితో ఛాలెంజ్ చేస్తుంది ముకుంద. కృష్ణను ఇంట్లో నుంచి పంపించివేస్తానని సవాల్ విసురుతుంది. ఆ తర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో ఏం జరిగిందంటే...
Krishna Mukunda Murari September 18th Episode: కృష్ణ విషయంలో నువ్వు చేస్తున్నది తప్పు కాదా...కృష్ణను మోసం చేస్తున్నానని నీకు అనిపించడం లేదా అని ముకుందను నిలదీస్తుంది రేవతి. అనిపించడం లేదు అని డైరెక్ట్‌గా ఆన్సర్ ఇస్తుంది ముకుంద. ఇక్కడ ఎవరిని ఎవరూ మోసం చేస్తున్నారో మీరే న్యాయం చెప్పిండి రివర్స్‌గా రేవతిపై ఎటాక్ చేస్తుంది ముకుంద. అగ్రిమెంట్ మ్యారేజీ అనే నిజం చెప్పకుండా నిజమైన భార్యాభర్తలుగా కృష్ణ, మురారి ఇన్నాళ్లు నటించడం మోసం కాదా?
త్యాగం పేరుతో కేవలం మీ కుటుంబం బాగుండాలని తన స్వార్థం కోసం నాకు నచ్చని పెళ్లి చేసుకోమని మురారి చెప్పడం అన్యాయం కాదా? అంటూ రేవతిపై ఫైర్ అవుతుంది ముకుంద. కృష్ణ, మురారి ఏం చేసినా లోక కళ్యాణం కోసం...నా ప్రేమను దక్కించుకోవడం నేను ఏం చేసినా అది మహాపరాధం అని చెప్పడం కరెక్ట్ కాదని రేవతితో కోపంగా అంటుంది ముకుంద.
ముకుంద ఛాలెంజ్…
తప్పులన్నీ మీవైపు పెట్టుకొని నన్ను ఎలా నిలదీస్తున్నారని కోపంగా అంటుంది. ఇన్నాళ్లు మీరు దాచిన నిజాన్ని భవానీ అత్తయ్యకు తెలిసేలా చేస్తానని రేవతితో ఛాలెంజ్ చేస్తుంది ముకుంద. ఏం జరిగినా తెలుసుకోవడానికి తేల్చుకోవడానికి తాను సిద్ధమని అంటుంది. కృష్ణ ఈ ఇంట్లో ఉండకూడదు. ఆదర్శ్ తిరిగి రాకూడదు. ఇదే నా అజెండా. మురారి వెడ్స్ ముకుంద ఇదే జరుగుతుంది. రాసి పెట్టకోమని రేవతిని హెచ్చరించి వెళ్లిపోతుంది ముకుంద.
పారిస్‌లో హానీమూన్...
మురారితో కలిసి హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నావని ముకుందను అడుగుతుంది అలేఖ్య. పారిస్‌కు వెళ్లాలని అనుకుంటున్నట్లు సమాధానమిస్తుంది ముకుంద. మమ్మల్ని కూడా పారిస్ తీసుకెళ్లమని ముకుందను వేడుకుంటుంది అలేఖ్య. నేను...మురారి..మేమిద్దరం తప్ప మాకు ఎవరూ అవసరం లేదని అంటుంది ముకుంద.
మురారి అబద్ధం...
ఒంటరిగా ఇంట్లో అడుగుపెడుతూ కనిపిస్తాడు మురారి. కృష్ణ ఏది అని అతడిని అడుగుతుంది భవానీ. హాస్పిటల్‌లో అర్జెంట్ ఆపరేషన్ ఉండి రాలేకపోయిందని అబద్ధం ఆడుతాడు మురారి. కృష్ణ హాస్పిటల్‌లో లేదని, ఇంట్లోనే ఉందని మధుకర్ అంటాడు. అప్పుడే కృష్ణ కూడా మెట్లు దిగుతూ హాల్‌లోకి వస్తూ కనిపిస్తుంది. అబద్ధం చెప్పి భవానీ ముందు అడ్డంగా బుక్కైపోతాడు మురారి.
కృష్ణకు ఆపరేషన్ ఉందని అబద్ధం ఎందుకు ఆడావని మురారిని నిలదీస్తుంది భవానీ. కృష్ణ సర్ధిచెబుతుంది. ఈ ఇద్దరిలో ఎవరు నిజం చెప్పారో..ఎవరు అబద్ధం చెప్పారో భవానీ తేల్చుకోలేకపోతుంది.
ఆదర్శ్ తిరిగి వస్తున్నాడనే సంతోషంలో ముకుంద వంట, ఇంటి బాధ్యతల్ని తీసుకున్నదని కృష్ణతో అంటుంది భవానీ.నిజంగా ఆదర్శ్ కోసమే ఇవన్నీ చేస్తున్నావా అంటూ ముకుందపై సెటైర్ వేస్తుంది కృష్ణ. భవానీ పక్కనే ఉండటంతో ఆదర్శ్ కోసమే అని అబద్ధం చెబుతుంది ముకుంద.
ముకుంద మాటలకు..చేతలకు...
ముకుంద మాటలకు, చేతలకు పొంతన కుదరకపోవడంతో ఇంట్లో ఏం జరుగుతుందో కనిపెట్టాలని కృష్ణ అనుకుంటుంది. మురారి, ముకుంద కలిసి ఫ్యామిలీ మొత్తాన్ని మోసం చేస్తున్నారని అనుమానపడుతుంది.
తింగరితనాన్ని కంటిన్యూ చేస్తూనే ఈ రహస్యాన్ని కనిపెట్టాలని ఫిక్స్ అవుతుంది.అప్పుడే ఆమె దగ్గరకు మురారి వస్తాడు. అతడితో మీరు భవానీ అత్తయ్యతో పాటు రేవతి దగ్గర మీరు ఏదైనా రహస్యం దాచిపెట్టారా అని అడుగుతుంది కృష్ణ. తెలిసి అడుగుతుందో, తెలియక అడుగుతుందో అర్థంకానీ కన్ఫ్యూజన్‌లోపడిపోతాడు మురారి.
నిజాయితీగా ఉండాలని డిసైడ్ అయిపోయి పెదమ్మతో పాటు తల్లి దగ్గర కొన్ని రహస్యాలు దాచిపెట్టాలనని అంటాడు. వాళ్ల దగ్గర దాచిన నిజాలు నీ దగ్గర దాయాల్సిన అవసరం లేదని, నీ దగ్గర ఆ నిజాలు చెప్పేస్తానని అంటాడు మురారి.
గుట్టు విప్పడానికి రెడీ...
కానీ ఎక్కడ విప్పాల్సిన గుట్టు అక్కడే విప్పాలి...ముందు పెద్దత్తయ్య భవానీ దగ్గర దాచిన నిజాల్ని ఆమెకు చెప్పి న్యాయం అడగండి అంటూ మురారితో చెబుతుంది కృష్ణ. ఒకవేళ ఆ నిజం ఎప్పటికీ తెలియకూడనిది అయితే ఏం చేయాలని కృష్ణను సలహా అడుగుతాడు.
మురారి తనకు నిజాన్ని చెప్పి కన్వీన్స్ చేసి ఆ తర్వాత భవానీకి వివరించాలని అనుకుంటున్నాడని కృష్ణ అర్థం చేసుకుంటుంది. తొందరపడి ఏదో ఒక తప్పు చేయడం కంటే ఆలోచించి ఆ తప్పును సరిదిద్దుకోవడం మంచిదని కృష్ణ సలహా ఇస్తుంది.
ముకుంద వంట...
ఆకలిగా ఉందని మురారి అంటాడు. ముకుంద వంట చేసిందట...కడుపు నిండా తిందరుగానీ రండి అంటూ మురారిపై సెటైర్ వేస్తుంది కృష్ణ. తమ ప్రేమ గురించి తెలిసే కృష్ణ ఈ సెటైర్ వేసిందని మురారి భయపడిపోతాడు.