Krishna Mukunda Murari November 13th Episode: ప్రేమ ప‌రీక్ష‌లో కృష్ణ విన్ - భార్య‌కు మురారి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్-krishna mukunda murari november 13th episode murari presents surprise gift to krishna mukunda shocks ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari November 13th Episode: ప్రేమ ప‌రీక్ష‌లో కృష్ణ విన్ - భార్య‌కు మురారి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్

Krishna Mukunda Murari November 13th Episode: ప్రేమ ప‌రీక్ష‌లో కృష్ణ విన్ - భార్య‌కు మురారి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్

Nelki Naresh Kumar HT Telugu
Nov 13, 2023 09:30 AM IST

Krishna Mukunda Murari November 13th Episode: మురారిపై ఎవ‌రి ప్రేమ గొప్ప‌దో తెలుసుకోవ‌డానికి కృష్ణ‌, ముకుంద ఓ ప‌రీక్ష పెట్టుకుంటారు. ఆ ప‌రీక్ష‌లో కృష్ణ విజ‌యం సాధిస్తుంది. ఆ త‌ర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...

కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌
కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌

Krishna Mukunda Murari November 13th Episode: మురారి ప్ర‌మాదం గురించి తెలిసి నందు, గౌత‌మ్ అత‌డిని చూడ‌టానికి వ‌స్తారు. కృష్ణ‌తో మాట్లాడొద్ద‌ని వారికి చెబుతుంది భ‌వానీ.మురారి రూపంతో పాటు అత‌డి జీవితాన్ని మార్చిన కృష్ణ‌పై జాలి చూపిస్తే అది మ‌న త‌ప్పే అవుతుంద‌ని నందు, గౌత‌మ్‌ల‌కు స‌ల‌హా ఇస్తుంది భ‌వానీ. ఆమె మాట‌లు విని గౌతమ్‌, నందు షాక‌వుతారు. కృష్ణ‌ను భ‌వానీ ద్వేషించ‌డం రేవ‌తి, మ‌ధుక‌ర్ స‌హించ‌లేక‌పోతారు. కానీ భ‌వానీ మాట‌ల‌కు ఎదురుచెప్ప‌లేక మౌనంగా ఉండిపోతారు.

yearly horoscope entry point

ముకుంద‌కు షాక్‌...

మురారి, ముకుంద షాపింగ్ వెళ‌తారు. మ‌ధుక‌ర్ ద్వారా ఆ విష‌యం తెలుసుకున్న కృష్ణ అదే షాపింగ్ మాల్‌కు వెళుతుంది. కాక‌తాళీయంగానే అక్క‌డికి వ‌చ్చిన‌ట్లు మురారిని న‌మ్మిస్తుంది. కృష్ణ అక్క‌డ క‌నిపించ‌డంతో ముకుంద కంగుతింటుంది. కృష్ణ‌ను అక్క‌డి నుంచి పంపించేందుకు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తుంది.

మురారి గ‌తంలో నువ్వు ఉన్నావు...కానీ నీతో పాటు ఆ గ‌తాన్ని మొత్తం మురారి మ‌ర్చిపోయాడ‌ని కృష్ణ‌పై సెటైర్ వేస్తుంది ముకుంద‌. నేను మురారి వ‌ర్త‌మానంలో ఉన్నాన‌ని అంటుంది. మురారి ప్ర‌జెంట్‌, ఫ్యూచ‌ర్ అంత నేనే అని చెబుతుంది.

మురారి నీకు ద‌క్క‌డ‌ని తెలిసి కూడా ఎందుకు ఎగిరిప‌డుతున్నావంటూ కృష్ణ‌పై కోప్ప‌డుతుంది ముకుంద‌. తాను ఎగిరిప‌డ‌టం లేద‌ని స‌హ‌నంతో ఉన్నాన‌ని ముకుంద‌కు ధీటుగా బ‌దులిస్తుంది కృష్ణ‌.

కృష్ణ రివ‌ర్స్‌...

ఏసీపీ సార్ న‌న్ను ఇష్ట‌ప‌డుతున్నాడ‌ని ముకుంద‌తో అంటుంది కృష్ణ‌. అదంతా నీ భ్ర‌మ అంటూ కృష్ణ మాట‌ల్ని ముకుంద కొట్టిప‌డేస్తుంది. భ‌వానీ అండ‌తో మురారిని త‌న సొంతం చేసుకుంటాన‌ని చెబుతుంది. కొంత‌మందికి మాట‌ల‌తో చెబితే అర్థం కాద‌ని చేత‌ల‌తోనే చెప్పాల‌ని కృష్ణ రివ‌ర్స్ అవుతుంది. నిన్ను నేను కొట్ట‌న‌ని భ‌వానీ చేతే కొట్టిస్తాన‌ని ముకుంద‌తో ఛాలెంజ్ చేస్తుంది కృష్ణ‌. అబ‌ద్ధానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంద‌ని భ‌య‌పెట్టిస్తుంది.

ప్రేమ ప‌రీక్ష‌...

మురారిపై ఎవ‌రి ప్రేమ గొప్ప‌దో టెస్ట్ చేయ‌డానికి కృష్ణ‌, ముకుంద‌ ప‌రీక్ష పెట్టుకుంటారు. మురారి కోసం ఇద్ద‌రు చెరో ష‌ర్ట్‌ కొంటారు. మురారిని పిలిచి ఏది బాగుందో చెప్ప‌మ‌ని అంటారు. తొలుత ముకుంద కొన్న ష‌ర్ట్‌ ప‌ట్టుకుంటాడు మురారి. అది చూసి ముకుంద‌ హ్యాపీగా ఫీల‌వుతుంది. కానీ ఆ ష‌ర్ట్‌ను ప‌క్క‌న‌ప‌డేసి కృష్ణ ష‌ర్ట్ బాగుంద‌ని సెలెక్ట్ చేస్తాడు. అత‌డి మాట‌ల‌తో కృష్ణ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోతాయి. తాను ఓడిపోవ‌డంతో ముకుంద షాక్ అవుతుంది.

రేవ‌తి కంగారు...

కృష్ణ అవుట్‌హౌజ్‌లో క‌నిపించ‌క‌పోవ‌డంతో రేవ‌తి కంగారు ప‌డుతుంది. మురారి, ముకుంద షాపింగ్ వెళ్లిన సంగ‌తి తానే కృష్ణ‌కు చెప్పి ఆమెను కూడా షాపింగ్‌కు పంపించాన‌ని మ‌ధుక‌ర్ చెబుతాడు. అత‌డి మాట‌ల‌తో రేవ‌తి హ్యాపీగా ఫీల‌వుతుంది.

షాపింగ్ మాల్‌లో మురారి త‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ముకుంద హ‌ర్ట్ అవుతుంది. కృష్ణ‌ను అక్క‌డి నుంచి పంపించేస్తే త‌న లైన్ క్లియ‌ర్ అవుతుంద‌ని అనుకుంటుంది. అదే మాట కృష్ణ‌తో చెబుతుంది. కానీ కృష్ణ ఇంటికి వెళ్ల‌కుండా మురారి ఆపేస్తాడు. క‌లిసే షాపింగ్ పూర్తిచేసుకొని వెళ్దామ‌ని చెబుతాడు.

ఆదర్శ్ ఆచూకీ…

షాపింగ్ మాల్‌లో కృష్ణ‌ను కేశ‌వ్ అనే వ్య‌క్తి క‌లుస్తాడు. మీ వ‌ద్దే నా కూతురు ట్రీట్‌మెంట్ తీసుకుంద‌ని అంటాడు. మీరు ఆర్మీలో తెలిసిన వాళ్ల హెల్ప్ కావాల‌ని అడిగారు క‌దా..ఆ స‌హాయం ఏమిట‌ని కృష్ణ‌ను అడుగుతాడు కేశ‌ల్‌. అత‌డి మాట‌లు ముకుంద కంగారు ప‌డుతుంది. ఆద‌ర్శ్ గురించి కృష్ణ ఎక్క‌డ చెప్పేస్తుందో అని కంగారుగా మురారిని అక్క‌డి నుంచి ప‌క్క‌కు తీసుకెళ్తుంది. ఆద‌ర్శ్ సంగ‌తి మురారికి తెలిస్తే త‌న ఛాప్ట‌ర్ క్లోజ్ అవుతుంద‌ని భ‌య‌ప‌డుతుంది.

మురారి, కృష్ణ భార్యాభ‌ర్త‌లు...

మురారి షాపింగ్‌లో కృష్ణ హెల్ప్ చేస్తుంది. మురారి చాలా ష‌ర్ట్‌లు ట్రై చేసినా కూడా ఒక్క‌టి న‌చ్చ‌లేద‌ని అంటాడు. పెళ్లాల‌కు ఏది న‌చ్చ‌వు. పెళ్లాంతో షాపింగ్ చేయ‌డం అంత బుద్ధి త‌క్కువ ప‌ని ఇంకోటి ఉండ‌దు అని ఓ వ్య‌క్తి మురారికి స‌ల‌హా ఇస్తాడు. కృష్ణ‌, మురారిల‌ను భార్యాభ‌ర్త‌లుగా ఆ వ్య‌క్తి భ్ర‌మ‌ప‌డ‌తాడు.

అత‌డి మాట‌ల‌ను కృష్ణ అడ్డుకోక‌పోవ‌డంతో మురారిలో అనుమానం మొద‌ల‌వుతుంది. మురారి కోసం మంచి ష‌ర్ట్ సెలెక్ట్ చేస్తుంది కృష్ణ‌. నా సెలెక్ష‌న్ బాగుంటుంద‌ని అంద‌రూ అంటుంటార‌ని, కానీ నాకు న‌చ్చిన వాటిని కొంద‌రు లాగేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటార‌ని ముకుంద‌పై తెలివిగా సెటైర్ వేస్తుంది.

మురారి గిఫ్ట్‌...

మిగిలిన షాపింగ్ కంటిన్యూ చేస్తోండ‌గా ముకుంద అత‌డి ప‌క్క‌నే ఉండేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తుంది. కానీ తెలివిగా ముకుంద‌ను అడ్డుకుంటుంది కృష్ణ‌.

కృష్ణ కోసం రింగ్‌ను గిఫ్ట్‌గా తీసుకుంటాడు మురారి. ఆ గిఫ్ట్‌నే తానే స్వ‌యంగా కృష్ణ చేతికి తొడుగుతాడు. ఆ సీన్ చూసి ముకుంద షాక‌వుతుంది. అక్క‌డితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner