Krishna Mukunda Murari May 25th Episode: మురారితో ప్రేమ‌లో ప‌డ్డ కృష్ణ - ల‌వ్ ప్ర‌పోజ్‌కు ఏసీపీ సార్ ఫిదా-krishna mukunda murari may25th episode krishna express her love to murari ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari May25th Episode Krishna Express Her Love To Murari

Krishna Mukunda Murari May 25th Episode: మురారితో ప్రేమ‌లో ప‌డ్డ కృష్ణ - ల‌వ్ ప్ర‌పోజ్‌కు ఏసీపీ సార్ ఫిదా

HT Telugu Desk HT Telugu
May 25, 2023 09:39 AM IST

Krishna Mukunda Murari May 25th Episode: మురారికి క‌వితాత్మ‌కంగా త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తుంది కృష్ణ‌. రోజ్ ఫ్ల‌వ‌ర్ ఇచ్చి ప్ర‌పోజ్ చేస్తుంది. కృష్ణ ప్రేమ‌ను వ్య‌క్తం చేసిన తీరుకు మురారి ఆనంద‌ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే....

కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

Krishna Mukunda Murari May 25th Episode: కృష్ణ‌కు మురారి ల‌వ్ ప్ర‌పోజ్ చేసిన రీల్ వీడియోకు మంచి రెస్పాన్స్ రావ‌డంతో వారిద్ద‌రితో మ‌రో రీల్ ప్లాన్ చేస్తాడు మ‌ధుక‌ర్‌. అందులో కృష్ణ‌, మురారి ప్రేమికులుగా క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతాడు. మురారికి ల‌వ‌ర్‌గా క‌నిపించే అవ‌కాశం రావ‌డంతో వెంట‌నే ఒప్పేసుకోవాల‌ని కృష్ణ అనుకుంటుంది. కానీ మ‌ధుక‌ర్ ముందు కావాల‌ని బెట్టు చేస్తుంది. మ‌ధుక‌ర్‌ను బ‌తిమిలాడించుకుంటుంది.

కృష్ణ ప్రేమ‌గా అడ‌గ‌టంతో...

మురారి ఒప్పుకుంటేనే తాను న‌టిస్తాన‌ని అంటుంది. ఆ వీడియోలో మురారి న‌టించ‌డానికి ఒప్పించే బాధ్య‌తను కృష్ణ‌పైనే వేస్తాడు మ‌ధుక‌ర్‌. కృష్ణ‌గా ప్రేమ‌గా రిక్వెస్ట్ చేయ‌డంతో స‌రే అంటాడు. కృష్ణ‌, మురారి త‌న రీల్ షూటింగ్‌కు ఒప్పుకోవ‌డంతో మ‌ధుక‌ర్ ఆనందంలో మునిగిపోతాడు. త‌ల్లితో పాటు భార్య ముందు ఫోజులు కొడ‌తాడు.తాను రిచెస్ట్ ప‌ర్స‌న్ కాబోతున్న‌ట్లు నోటికివ‌చ్చిన‌ట్లు బిల్డ‌ప్ ఇస్తాడు.

క‌వితాత్మ‌కంగా ల‌వ్ ప్ర‌పోజ్‌...

షూటింగ్‌. లొకేష‌న్‌లో కృష్ణ క‌నిపించ‌క‌పోవ‌డంతో మురారి ఆమె కోసం వెతుకుతుంటాడు. ఇంత‌లోనే కృష్ణ అక్క‌డికి వ‌స్తుంది. ఆమె అందాన్ని చూసి మురారి మైమ‌ర‌చిపోతాడు మురారి. షూటింగ్ చేయ‌మంటే ఇద్ద‌రు త‌మ క్యారెక్ట‌ర్స్‌లో జీవిస్తారు. మురారికి క‌వితాత్మ‌కంగా ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తుంది కృష్ణ‌. మ‌ధుక‌ర్ ఇచ్చిన డైలాగ్స్ కాకుండా సొంత డైలాగ్స్‌ యాడ్ చేసి నిజంగానే మురారికి త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తుంది. కృష్ణ మాట‌ల‌కు మురారి ముగ్ధుడైపోతాడు.

ఇప్పుడు నేను నేను కాను. నీతో ఉండాల‌ని వ‌చ్చి నీవై పోయాన‌ని మురారితో అంటుంది కృష్ణ‌. భ‌క్తురాలి ఆత్మ భ‌గ‌వంతుడిలో లీనం అయిన‌ట్లు నేను నీలో లీనం అయిపోయాన‌ని అంటుంది. మొకాళ్ల‌పై కూర్చొని రోజ్ ఫ్ల‌వ‌ర్ మురారికి ఇచ్చి అత‌డికి ఐ ల‌వ్ యూ చెబుతుంది. షూటింగ్ అనే విష‌యాన్ని ఇద్ద‌రూ మ‌ర‌చిపోయి ప్రేమ‌లోకంలో మునిగిపోతారు.

కృష్ణ హ‌ర్ట్‌...

మ‌ధుక‌ర్ టీమ్ చ‌ప్ప‌ట్ల‌తో ఈ లోకంలోకి వ‌స్తారు. కృష్ణ‌పై మ‌ధుక‌ర్ ప్ర‌శంస‌లు కురిపిస్తాడు. అత‌డి మాట‌ల‌తో కృష్ణ ఆనంద‌ప‌డుతుంది. ఈ రీల్‌లో మురారి తిరిగి త‌న‌కు ప్ర‌పోజ్ చేసే డైలాగ్స్ లేవా అని కృష్ణ అడుగుతుంది. ఇక నేను చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చెప్పాల‌ని కూడా లేదు అని మురారి అన‌డంతో కృష్ణ హ‌ర్ట్ అవుతుంది.

ముకుంద మౌనం…

ఈ రీల్స్ ద్వారా కృష్ణ‌, మురారిల‌కు గొప్ప ల‌వ‌ర్స్‌గా పేరు వ‌స్తుంద‌ని మ‌ధుక‌ర్ భార్య అంటోన్న మాట‌లు ముకుంద చెవిన ప‌డ‌తాయి. అప్పుడే అక్క‌డ‌కు కృష్ణ‌, మురారితో పాటు మ‌ధుక‌ర్ వ‌స్తారు. అంద‌రి ముందు కృష్ణ‌ను పొగుడుతాడు మ‌ధుక‌ర్‌. కృష్ణ యాక్టింగ్ ఎలా ఉంద‌ని మురారిని రేవ‌తి అడుగుతుంది. ఇద్ద‌రు స‌మాధానం చెప్ప‌కుండా ఒక‌రి క‌ళ్ల‌ల్లోకి మ‌రొక‌రు చూస్తూ ఉండిపోతారు.

నేను నా డైలాగ్ కూడా మ‌ర్చిపోయా అంతా బాగా చేసింద‌ని అంటాడు. అంద‌రూ కృష్ణ‌కు కంగ్రాట్స్ చెబుతారు. అక్క‌డే ఉన్న ముకుంద మాత్రం ఏ మాట్లాడ‌కుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఆ త‌ర్వాత త‌న రూమ్‌లో ఉన్న తండ్రి ఫొటో ముందు నిల‌బ‌డిన ముకుంద ...మురారితో ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లుగా చెబుతుంది. అక్క‌డితో నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్(Krishna Mukunda Murari) ముగిసింది

IPL_Entry_Point