Krishna Mukunda Murari May 31st Episode: మురారి, ముకుందల ప్రేమ విషయం రేవతికి తెలిసిందా? - విఫ‌ల ప్రేమ బాధ‌లో కృష్ణ‌-krishna mukunda murari may 31st episode krishna mukunda murari today episode krishna breaks down after love failure ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari May 31st Episode Krishna Mukunda Murari Today Episode Krishna Breaks Down After Love Failure

Krishna Mukunda Murari May 31st Episode: మురారి, ముకుందల ప్రేమ విషయం రేవతికి తెలిసిందా? - విఫ‌ల ప్రేమ బాధ‌లో కృష్ణ‌

HT Telugu Desk HT Telugu
May 31, 2023 09:59 AM IST

Krishna Mukunda Murari May 31st Episode: మురారి మ‌న‌సులో మ‌రో అమ్మాయి ఉంద‌నే నిజాన్ని జీర్ణించుకోలేక‌పోతుంది కృష్ణ‌. కొద్ది రోజుల్లోనే త‌న ప్రేమ క‌ల‌లా క‌రిగిపోవ‌డంతో బాధ‌లో మునుగుతుంది. ఆ త‌ర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే....

కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌
కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌

Krishna Mukunda Murari May 31st Episode: మురారి డైరీలో అత‌డి ప్రియురాలు గురించి రాసిన వ‌ర్ణ‌నాల్ని మాత్ర‌మే చ‌దువుతుంది కృష్ణ‌. ఆ డైరీ చివ‌ర‌లో కృష్ణ ను ప్రేమిస్తోన్న‌ట్లుగా మురారి రాస్తాడు. కానీ అవి చ‌ద‌వ‌డం ఆమె మిస్ చేస్తుంది. కృష్ణ త‌న‌ను ప్రేమిస్తోన్న‌ది నిజ‌మైతే బాగుండున‌ని మ‌న‌సులోనే అనుకుంటాడు మురారి. కృష్ణ త‌ను ప్రేమిస్తోంద‌న్న నిజం చెబితేనే మిగిలిన డైరీ రాయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు.

మ‌రోవైపు మురారి మ‌న‌సులో తాను కాకుండా మ‌రో అమ్మాయి ఉంద‌నే నిజం డైరీ ద్వారా బ‌య‌ట‌ప‌డ‌టంతో కృష్ణ బాధ‌లో మునిగిపోతుంది. ఆ నిజాన్ని జీర్ణించుకోలేక క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. కృష్ణ ఇంట్లో ఎక్క‌డ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆమె గురించి వెతుకుతుంటాడు మురారి. ఇంటి బ‌య‌ట వ‌ర్షంలో త‌డుస్తూ కృష్ణ క‌నిపిస్తుంది. డైరీలో త‌న ప్రియురాలి గురించి మురారి రాసిన రాత‌ల్ని గుర్తుచేసుకుంటూ క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

ఒంట‌రిగా మిగిలిన కృష్ణ‌...

నాలో ప్రేమ పుట్ట‌గానే చ‌చ్చిపోయింద‌ని బాధ‌ప‌డుతుంది. అమ్మ‌ను ప్రేమించాను. చిన్న‌ప్పుడే న‌న్ను వ‌దిలిపెట్టివెళ్లిపోయింది. నాన్న‌ను ప్రేమించాను. ఆయ‌న నాకు దూర‌మ‌య్యాడు. జీవితంలో మొద‌టిసారిగా నా మ‌న‌సులో ప్రేమ పుట్టింది. కానీ ఆ ప్రేమ‌కు ఆయుష్షు లేదు. కొన్ని గంట‌ల్లోనే నాకు ఆ అదృష్టం లేద‌ని తెలిపోయింద‌ని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. మ‌ళ్లీ తాను ఒంట‌రిదాన్న‌యిపోయాన‌ని అనుకుంటుంది.

మ‌ళ్లీ అనాథ‌గానే మిగిలిపోయాన‌ని బాధ‌ప‌డుతుంటుంది. మురారిలో కూడా నా మీద ప్రేమ ఉంద‌ని ఆశ‌ప‌డ్డా. కానీ అత‌డి మ‌న‌సులో ఎప్పుడో మ‌రో అమ్మాయికి చోటిచ్చార‌ని తెలిసింది. ఇప్పుడు నేను ఏ హ‌క్కుతో ఉండాలి. మురారితో ఉండ‌టానికి నాకు ఏ అర్హ‌త ఉంద‌ని క‌న్నీళ్ల‌తో త‌న‌ను తానే ప్ర‌శ్నించుకుంటుంది. ఒప్పందం ప్ర‌కారం గ‌డువు తీర‌గానే వెళ్లిపోవాలా? నా అనేవాళ్లు లేని ఈ లోకంలో అనాథ‌లా మిగిలిపోవాలా అని బాధ‌ప‌డుతుంది. అస‌లు నేను ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటుంది.

మురారి షాక్‌...

క‌న్నీళ్ల‌తో వ‌ర్షంలో ఉండిపోయిన కృష్ణ‌ను చూసి మురారి ఆశ్చ‌ర్య‌పోతాడు. ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఏమైంద‌ని అడుగుతాడు. కానీ అస‌లు విష‌యం చెప్ప‌కుండా దాచేస్తుంది కృష్ణ‌. త‌ల స్నానం చేయాల‌ని అనిపించింద‌ని, అందుకే వ‌ర్షంలోకి వ‌చ్చాన‌ని అంటుంది. ఇంట్లోకి ర‌మ్మ‌ని మురారి అంటే అర్థంలేని మాట‌ల‌తో అత‌డికి స‌మాధానం ఇస్తుంది. వాన వెలిసిపోయి నా మ‌న‌సు నిర్మ‌లంగా మారిపోయిన త‌ర్వాతే ఇంట్లో వ‌స్తాన‌ని అంటుంది.

ఆమె మాట‌లు మురారికి అర్థం కావు. నా క‌ల నిజ‌మైంద‌ని అనుకున్నా. నిజ‌మే క‌ల‌గా మారింద‌ని అంటుంది. నా ద‌గ్గ‌ర బోలెడ‌న్నీ ప్ర‌శ్న‌లు ఉన్నాయి. వాటికి స‌మాధానం దొరికేలోపే నా జీవిత కాలం గ‌డిచిపోయేలా ఉంద‌ని కృష్ణ అంటుంది. ఏమైంది కృష్ణ‌. తెలియ‌కుండా నేనేమైనా బాధ‌పెట్టేనా మ‌రోసారి కృష్ణ‌ను అడుగుతాడు మురారి. అవునేమో, నిజ‌మేనేమో...మీరు పోలీస్ కాదు ఏసీపీ సార్ పెద్ద దొంగ అని అంటుంది. ఆమె మాట‌ల‌కు మురారి షాక్ అవుతాడు. అక్క‌డి నుంచి వెళ్లిపొమ్మ‌ని మురారితో క‌ఠినంగా మాట్లాడుతుంది కృష్ణ‌.

కృష్ణ కన్నీళ్లు…

ఇంత వాన కురుస్తున్నా నా గుండెలో మంట చ‌ల్లార‌డం లేద‌ని మురారితో చెబుతుంది కృష్ణ‌. త‌న‌ను ఒంట‌రిగా వ‌దిలిపెట్టి వెళ్లిపొమ్మ‌ని మ‌రోసారి అంటుంది కృష్ణ‌. నిన్ను వ‌దిలిపెట్టి ఎలా వెళ్ల‌గ‌ల‌న‌ని మురారి అన‌గానే కృష్ణ క‌న్నీరు మ‌రింత పెరుగుతుంది. ఆమె క‌న్నీరు చూసి మురారి కంగారు ప‌డ‌తాడు. ఎందుకు ఏడుస్తున్నావ‌ని అడిగితే.. ప‌ర్వాలేదు.

ఈ క‌న్నీళ్లు వాన నీటిలో కొట్టుకుపోయేవే అని స‌మాధాన‌మిస్తుంది. కృష్ణ స‌మాధానాలు చూసి మురారి భ‌య‌ప‌డిపోతాడు. ఒంట‌రిగా ప్ర‌యాణం చేయాలి. గొడుగు ప‌ట్ట‌డానికి నాన్న లేడు. త‌ల‌పై కొంగు క‌ప్ప‌డానికి అమ్మ‌లేదు. ఎన్నో క్రూర‌మృగాలు పొంచి ఉంటాయి. అందుకే నాకు భ‌య‌మేస్తుంది. బాధ‌కూడా వేస్తుంద‌ని అర్థం కాకుండా స‌మాధానం చెప్పి మురారి గుండెల‌పై వాలిపోతుంది. నేను ఉండ‌గా నువ్వు ఒంట‌రిదానికి కావ‌ని, నేను నిన్ను కాపాడుకుంటాన‌ని మురారి అంటాడు. కృష్ణ‌ను తీసుకొని ఇంటి లోప‌లికి వెళ‌తాడు.

కృష్ణ లేక‌పోతే జీవితంలేదు...

త‌ర్వాత రోజు డైరీ రాయ‌డం మొద‌లుపెడ‌తాడు మురారి. కృష్ణ‌కు ఏమైంది, త‌న మ‌న‌సులో నేను ఉన్నాన‌ని చెబుతుంద‌ని ఆశ‌ప‌డుతుంటే ఉన్న‌ట్టుండి అలా ప్ర‌వ‌ర్తించిందేమిటోన‌ని డైరీలో రాస్తుంటాడు. ఏం జ‌రుగుతుందో త‌న ఊహ‌కు అర్థం కావ‌డం లేద‌ని, కృష్ణ వెళ్లిపోతాన‌ని ఎందుకు అంటుందో అని అనుకుంటాడు. ఏది ఏమైనా కృష్ణ త‌న‌కు దూరం కాకూడ‌ద‌ని కోరుకుంటాడు. కృష్ణ లేక‌పోతే తాను బ‌త‌క‌లేన‌ని అర్థ‌మైపోయింద‌ని డైరీలో రాసుకుంటాడు.

ముకుంద‌పై సెటైర్‌...

మ‌రోవైపు కృష్ణ పూజ చేస్తోన్న ఆమెకు డైరీలో మురారి రాసిన అక్ష‌రాలే గుర్తుకొస్తుంటాయి. ఆ నిజాన్ని జీర్ణించుకునే ధైర్యాన్ని ఇవ్వ‌మ‌ని దేవుడిని కోరుకుంటుంది. ఏసీపీ సార్ భార్య‌గా ఉండాలా? ఆయ‌న ప్రేమించిన ప్రియురాలి స్థానంలో ఉండాలా? ఏమీ జ‌ర‌గ‌న‌ట్లు ఈ ఇంటి కోడ‌లిగా ఉండాలో అర్థం కావ‌డం లేద‌ని మొర‌పెట్టుకుంటుంది. ఏసీపీ సార్ ప్రేమించిన అమ్మాయి ఎవ‌రో త‌న‌కు తెలియ‌జెప్ప‌మ‌ని దేవుడిని కోరుకుంటుంది. ప్రియురాలితో మురారిని క‌ల‌పాలా ? ఏం చేయాల‌ని దేవుడిని వేడుకుంటుంది.

కృష్ణ డ‌ల్‌గా ఉండ‌టం ముకుంద క‌నిపెడుతుంది. కార‌ణం అడుగుతుంది. దేవుడిని ఏం అడుగుతున్నావ‌ని అంటుంది. మ‌న‌సుకు జ‌వాబు తెలియ‌ని ప్ర‌శ్న‌ల‌కు దేవుడే క‌దా స‌మాధానం చెప్పేది అని ముకుంద ప్ర‌శ్న‌కు కృష్ణ స‌మాధాన‌మిస్తుంది. తాను స‌హాయం చేస్తాన‌ని అంటే త‌న ప్ర‌శ్న‌ల‌కు తానే స‌మాధానాలు వెతుక్కుంటాన‌ని ఆమెపై సెటైర్ వేస్తుంది. మ‌న‌సులో ఏదో ఉంచుకొని కృష్ణ‌ బ‌య‌ట‌ప‌డ‌టం లేద‌ని ముకుంద గ్ర‌హిస్తుంది.

మురారితో సంతోషంగా...

రాత్రి వ‌ర్షంలో జ‌రిగిన‌వ‌న్నీ మ‌ర్చిపోయి మురారితో సంతోషంగా ఉంటుంది కృష్ణ‌. ఆమెను చూసి ఆశ్చ‌ర్య‌పోతాడు మురారి. నీలో ఈ తింగ‌రిత‌న‌మే నాకు న‌చ్చింద‌ని అంటాడు. . తింగ‌రిత‌న‌మే కానీ నా మ‌న‌సు న‌చ్చ‌లేదా అని మ‌న‌సులోనే అనుకుంటుంది కృష్ణ‌. ఏమైంది ఏదో కోల్పోయిన దానిలా క‌నిపిస్తున్నావ‌ని కృష్ణ‌ను అడుగుతాడు మురారి. అవును అని అంటుంది కృష్ణ‌.

పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చి కంప్లైంట్ ఇస్తే వెతికిపెడ‌తాన‌ని మురారి అంటాడు. నా ప్రేమ అని మ‌న‌సులోనే స‌మాధానం చెబుతుంది. బ‌య‌ట‌కు మాత్రం ఏదేదో చెబుతుంది. ఆ త‌ర్వాత మురారి ఆఫీస్‌కు వెళుతుండ‌గా అత‌డిని ముకుంద అడ్డుకుంటుంది. రేవ‌తికి మ‌న ప్రేమ విష‌యం

IPL_Entry_Point