krishna mukunda murari May 20th : మురారి-కృష్ణను చూసి కుళ్లుకున్న ముకుందా-krishna mukunda murari may 20th krishna mukunda murari today episodee mukunda jealous on murari and krishna love ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari May 20th Krishna Mukunda Murari Today Episodee Mukunda Jealous On Murari And Krishna Love

krishna mukunda murari May 20th : మురారి-కృష్ణను చూసి కుళ్లుకున్న ముకుందా

HT Telugu Desk HT Telugu
May 20, 2023 10:19 AM IST

krishna mukunda murari May 20th : మురారి డల్ గా కనిపిస్తాడు. దీంతో అతడి మూడ్ మార్చేందుకు కృష్ణ ప్రయత్నిస్తుంది. మురారి మీద ప్రేమ మెుదలుకావడంతో సీరియల్ ఆసక్తికరంగా ఉంటుంది.

కృష్ణ ముకుందా మురారి
కృష్ణ ముకుందా మురారి

మురారి డల్ గా ఉండటంతో కృష్ణ కాస్త ఆలోచనల్లో పడుతుంది. ఎలాగైనా మురారి మూడ్ మార్చాలని ప్రయత్నిస్తుంది. గదిలో కృష్ణ ఫొటోలతో డెకరేషన్ చేసి లైటింగ్ పెడుతుంది. కృష్ణ తింగరి ఫొటోలు చూసి.. మురారి బాగా నవ్వుతాడు. మీరు ఇలా నవ్వి ఎంత కాలమైందో ఇక ముందు మీరు ఇలా ఉండేందుకు వీల్లేదు అంటుంది కృష్ణ. మీ మూడు బాగాలేనప్పుడు వీటిని చూసి నవ్వుకో అని చెబుతుంది. ఇద్దరూ కాసేపు సరదాగా నవ్వేసుకుంటారు. భవానీ అక్క ఇంట్లో లేకపోయేసరికి.. ముకుందలో తెగింపు పెరిగిపోతుంది.... తాను గమనిస్తున్నట్టుగా తెలిసేలా చేయాలి లేదంటే తన కొడుకు కాపురంలో చిచ్చు రేగేలా ఉందని రేవతి అనుకుంటుంది.

ఇదే సమయంలో ముకుంద వస్తుంది. ఉదయం మీ నాన్న మాట్లాడిన దానిలో తప్పేమీ అనిపించలేదు. నువ్ ఇక్కడ ఉంటే.. మీ నాన్నకి మనశ్సాంతి లేదు. ఆదర్శ్ వస్తాడని మా అందరి నమ్మకం.. తిరిగి వచ్చేసరికి నువ్వు మీ పుట్టింట్లో మీ నాన్న కళ్ల ముందు ఉంటే మనశ్శాంతిగా ఉంటుందని అభిప్రాయం చెబుతుంది.

మీరు ఎప్పుడెప్పుడు పుట్టింటికి పంపించేద్దామా అని ఎదురుచూస్తున్నారని నాకు తెలుసని ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆదర్శ్ ఎక్కడకు వెళ్లను.. తిరిగి వచ్చినా రాకపోయినా ఇక్కడే ఉంటానని చెబుతుంది. ముకుంద ఇంట్లో ఉండే ఏమవుతుందోనని భయంతో ఉంటుంది. మరోవైపు ఈశ్వర్ తాగాలని అనుకున్న.. మందు కాస్త మధుకర్ లాగేసుకుని ఫుల్ కొట్టేస్తాడు. ఇంట్లో పాము దూరిందనేసరికి అందరూ బయటకు వస్తారు. సరదాగా మాట్లాడుకుంటారు. మధుకర్ కి మెమరీ టెస్ట్ పెడతానని కృష్ణ అంటుంది. ఒక ఆట ఆడతానని చెప్పి మధుకర్ ను కృష్ణ బకరా చేస్తుంది. ఈ విషయాన్ని అంతా అలేఖ్య వీడియో తీస్తుంది. దీంతో అందరూ నవ్వుకుంటారు. వీడియో చూసిన మధుకర్ ఏడుస్తూ ఉంటాడు.

అలేఖ్య దగ్గరకు మధుకర్ వెళ్తాడు. నీ రెండు చేతులకు గోరింటాకు ఉందని, నాకు బొట్టు ఎలా పెడతావని అడుగుతాడు. చేతులు కడుక్కుని పెడతానని చెబుతుంది. ఇదే ప్రశ్న ముకుందని అడుగుతాడు. బొట్టు పెట్టి పంపించేందుకు ఆదర్శ్ లేడు కదా అని బాధపడుతుంది. ఆ మాటకు అందరూ బాధపడుతుంటారు. కృష్ణ నువ్వు బొట్టు ఎలా పెడతావని అంటే తాను వెళ్లి మురారి నుదిటి మీద నుదురు పెట్టి బొట్టు పెడుతుంది. ఇది చూసి ముకుంద కుళ్లుకుంటుంది. తెల్లారీ మురారి డల్ గా ఉండేసరికి మళ్లీ ఏమైదని కృష్ణ అడుగుతుంది. ఏమో తెలియదు నా గుండెకి తెలియాలని అంటాడు. అయితే మీ గుండెను అడుగుతానని గుండెల మీద వాలుతుంది. ఇది ప్రేమా.. లేదంటే అభిమానమా.. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే బాగుండు కృష్ణ అని అనుకుంటాడు.

IPL_Entry_Point

టాపిక్