Krishna Mukunda Murari May 17th Episode: ముకుందకు విడాకులు ఇప్పిస్తానన్న తండ్రి - మురారి మౌనం-krishna mukunda murari may 17th episode srinivas worried on mukunda married life ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari May 17th Episode Srinivas Worried On Mukunda Married Life

Krishna Mukunda Murari May 17th Episode: ముకుందకు విడాకులు ఇప్పిస్తానన్న తండ్రి - మురారి మౌనం

HT Telugu Desk HT Telugu
May 17, 2023 09:10 AM IST

Krishna Mukunda Murari May 17th Episode: ముకుంద‌ను త‌న ఇంటికి తీసుకెళ్లిపోతాన‌ని ఆమె తండ్రి శ్రీనివాస్ నిర్ణ‌యించుకుంటాడు. కూతురికి విడాకులు ఇప్పించి మ‌రో పెళ్లి చేస్తాన‌ని చెబుతాడు. అత‌డి మాట‌ల‌కు భ‌వానీ సీరియ‌స్ అవుతుంది.

కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

Krishna Mukunda Murari May 17th Episode: ముకుంద‌కు దూరంగా ఉండాలంటే కృష్ణ‌కు ద‌గ్గ‌ర కావాల‌ని మురారి నిర్ణ‌యించుకుంటాడు. కృష్ణ‌తో మ‌రింత స‌న్నిహితంగా ఉండ‌టం మొద‌లుపెడ‌తాడు. గుడిలో, రెస్టారెంట్‌లో మురారి డ‌ల్‌గా ఉండ‌టంతో అత‌డికి దిష్టి త‌గిలింద‌ని కృష్ణ అనుకుంటుంది. దిష్టి తీస్తుంది. వారిద్ద‌రి అన్యోన్య‌త చూసి భ‌వానీ, రేవ‌తి సంతోష‌ప‌డితే ముకుంద మాత్రం క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

ముకుంద తండ్రికి అవ‌మానం...

ముకుంద తండ్రి శ్రీనివాస్ ఇంటికి బంధువులు వ‌స్తారు. . భ‌ర్త లేక‌పోయినా ముకుంద సంతోషంగా బ‌తుకుతోందంటూ తండ్రి ముందే ఆమెను మాట‌ల‌తో అవ‌మానిస్తారు. పెళ్లై సంవ‌త్స‌రం అయినా ముకుంద భ‌ర్త తిరిగి రాలేద‌ని, అయినా బ‌రువు దించుకొని బిందాస్‌గా కూర్చున్నారు అంటూ శ్రీనివాస్‌ను దెప్పిపోడుస్తారు. చ‌చ్చిపోయాడో, బ్ర‌తికి ఉన్నాడో తెలియ‌ని ఆద‌ర్శ్ కోసం ముకుంద జీవితాన్ని అన్యాయం చేయ‌వ‌ద్ద‌ని అంటారు. వారి మాట‌ల‌తో ముకుంద తండ్రి ఆలోచ‌న‌లో ప‌డ‌ప‌తాడు.

గొడ‌వ‌లు మ‌ర్చిపోదామ‌ని చెప్పిన భ‌వానీ...

ఆశ్ర‌మ ప‌నుల కోసం కొద్ది రోజుల భ‌వానీ ఇంటికి దూరంగా వెళ్లిపోనుండ‌టంతో ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ బాధ‌ప‌డుతోంటారు. మ‌న మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌లు మ‌ర్చిపోయి సంతోషంగా ఉంద‌మ‌ని మురారితో అంటుంది భ‌వానీ.

ఏయ్ తింగ‌రిపిల్లా మా అబ్బాయిని జాగ్ర‌త్త‌గా చూసుకో అంటూ కృష్ణ‌కు ఫ‌న్నీగా వార్నింగ్ ఇస్తుంది. ఆ త‌ర్వాత ముకుంద వ‌ద్ద‌కు వ‌చ్చి ఈ ఇంట్లో నీ గురించి ఆలోచిస్తేనే ఎక్కువ‌గా బాధ‌గా ఉంద‌ని అంటోంది. భ‌వానీ ముకుంద‌ను ఓదార్చుతుండ‌గానే ఇంత‌లోనే శ్రీనివాస్ అక్క‌డికి వ‌స్తాడు.

ముకుంద‌కు విడాకులు ఇప్పిస్తాన‌న్న తండ్రి

తండ్రిని చూసి ముకుంద ఆనంద‌ప‌డుతుంది. శాశ్వ‌తంగా త‌న ఇంటికి ముకుంద‌ను తీసుకెళ‌దామ‌నే ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని అత‌డు చెబుతాడు. తండ్రి మాట‌ల‌తో ముకుంద షాక్ అవుతుంది. కూతురును అత్తారింట్లో క‌ష్టాల్లో వ‌దిలిపెట్టి ఏ చింత లేకుండా బ‌తుకుతాన్నాన‌ని బంధువులు త‌న‌ను అవ‌మానిస్తున్నార‌ని అంటాడు.

ఇక్క‌డే ఉంచితే ముకుంద జీవితం ఏటూ కాకుండా పోతుంద‌ని శ్రీనివాస్ ఆవేద‌న‌కు లోన‌వుతాడు. విడాకుల కోసం కోర్ట్‌లో ఫిటిష‌న్ వేయ‌బోతున్న‌ట్లు చెబుతాడు. అత‌డి మాట‌ల‌తో భ‌వానీతో పాటు అంద‌రూ షాక్ అవుతారు. ఆద‌ర్శ్ లేడు కాబ‌ట్టి విడాకులు తొంద‌ర‌గానే వ‌స్తాయ‌ని, ఆ త‌ర్వాత ముకుంద‌కు మ‌రో పెళ్లి చేస్తాన‌ని అంటాడు.

షాక్‌లో ముకుంద‌

తండ్రి మాట‌లు ముకుంద‌కు కూడా అర్థం కావు. ఏంటి ఇదంతా అని అడుగుతుంది. అందుకు క‌న్నందుకు నా కూతురుకు న్యాయం చేస్తున్నాన‌ని శ్రీనివాస్ చెబుతాడు. ఆద‌ర్శ్ తిరిగి వ‌స్తాడ‌నే న‌మ్మ‌కం త‌న‌కు లేద‌ని స‌మాధాన‌మిస్తాడు. త‌న ఆస్తి మొత్తం ఇచ్చి అయినా ముకుంద‌కు రెండో పెళ్లి చేస్తాన‌ని గ‌ట్టిగా చెబుతాడు. అత‌డి మాట‌ల‌కు భ‌వానీ ఎమోష‌న‌ల్ అవుతుంది.

ఒక‌వేళ ఆద‌ర్శ్ తిరిగిరాక‌పోతే తామే ముకుంద‌కు మ‌రో పెళ్లి చేస్తామ‌ని అంటుంది. కానీ ఆమె మాట‌ల‌కు అడ్డు చెబుతాడు శ్రీనివాస్‌. త‌మ కూతురుని ఇంటికి తీసుకెళ‌తాన‌ని ప‌ట్టుప‌డ‌తాడు. ఒక‌వేళ ఆద‌ర్శ్ తిరిగివ‌చ్చి త‌న భార్య ఏద‌ని అడిగితే ఏం స‌మాధానం చెబుతార‌ని భ‌వానీ అత‌డిని ప్ర‌శ్నిస్తుంది. లేని ఆద‌ర్శ్ గురించే అంద‌రూ ఆలోచిస్తున్నార‌ని, కానీ ఇక్క‌డే ఉన్న ముకుంద మ‌న‌సులో ఏముందో ఎవ‌రూ క‌నుక్కోలేక‌పోతున్నార‌ని శ్రీనివాస్ కుమిలిపోతాడు.

మురారి మౌనం...

అంద‌రూ మాట్లాడుతున్నా మురారి మాత్రం సైలెంట్‌గా ఉంటాడు. ఆ మౌనం వెనుక కార‌ణం ఏమిట‌ని ముకుంద తండ్రి అత‌డిని అడుగుతాడు. అయినా మురారి మాత్రం పెద‌వి విప్ప‌డు. త‌న కూతురుని ఇప్పుడే ఈ క్ష‌ణ‌మే క‌ట్టుబ‌ట్ట‌ల‌తోత‌న‌తో పంపించ‌మ‌ని ప‌ట్టుప‌డ‌తాడు శ్రీనివాస్‌. విడాకులు ఇప్పించి త‌ప్ప‌కుండా ముకుంద‌కు మ‌రో పెళ్లి చేస్తాన‌ని అంటాడు.

అత‌డి మాట‌ల‌కు భ‌వానీ సీరియ‌స్ అవుతుంది. స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా తెగ‌తెంపులు చేస్తానంటే కుద‌ర‌ద‌ని, కొన్నాళ్లు గ‌డువుఇవ్వ‌మ‌ని కోరుతుంది. భ‌వానీ మాట‌ల‌కు క‌న్వీన్స్ అయిన శ్రీనివాస్ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. ముకుంద‌కు ఏ లోటు రాకుండా చూసుకోవాల‌ని అంద‌రికీ చెప్పి భ‌వానీ కూడా ఆశ్ర‌మానికి వెళ్లిపోతుంది.

ఎంగేజ్‌మెంట్ రింగ్ తీసినందుకు మురారిపై సీరియ‌స్ అవుతుంది ముకుంద‌. మురారికి ఐ ల‌వ్ యూ చెబుతుంది. జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాన‌ని అంటుంది. అది త‌ప్పు అని మురారి ఆమెకు స‌ర్ధిచెప్ప‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్ ముగిసింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.